- Home
- Entertainment
- చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ లో నటించింది, బన్నీతో 3 సినిమాలు.. రెండేళ్లుగా ఖాళీగా ఉన్న క్రేజీ నటి
చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ లో నటించింది, బన్నీతో 3 సినిమాలు.. రెండేళ్లుగా ఖాళీగా ఉన్న క్రేజీ నటి
అందం, అభినయం రెండూ ఉన్న హీరోయిన్ కేథరిన్. కేథరిన్ దాదాపు 12 ఏళ్ళ క్రితం తెలుగులో చమ్మక్ చల్లో అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

Catherine Tresa
అందం, అభినయం రెండూ ఉన్న హీరోయిన్ కేథరిన్. కేథరిన్ దాదాపు 12 ఏళ్ళ క్రితం తెలుగులో చమ్మక్ చల్లో అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కేథరిన్ కొన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించింది కానీ.. ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
Catherine Tresa
ఇద్దరమ్మాయిలతో చిత్రంలో ఏకంగా అల్లు అర్జున్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. కానీ ఆ మూవీ నిరాశపరిచింది. ఆ తర్వాత ఆశించిన కొన్ని చిత్రాల్లో నటించింది కానీ కేథరిన్ కి సరైన సక్సెస్ దక్కలేదు. రుద్రమదేవి చిత్రంలో మరోసారి అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది.
Catherine Tresa
ముచ్చటగా మూడోసారి సరైనోడు చిత్రంలో బన్నీకి జోడిగా కేథరిన్ ఆడిపాడింది. టాలీవుడ్ లో కేథరిన్ కి దక్కిన తొలి బ్లాక్ బస్టర్ హిట్ సరైనోడు చిత్రం అని చెప్పొచ్చు.
Catherine Tresa
ఈ చిత్రంలో ఎమ్మెల్యే పాత్రలో కేథరిన్ యువతని భలే ఆకట్టుకుంది. నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో కేథరిన్ బోల్డ్ గా నటించింది. ఇటీవల కేథరిన్ బింబిసార, వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది.
Catherine Tresa
వాల్తేరు వీరయ్య చిత్రంలో రవితేజకి జోడిగా కేథరిన్ నటించింది. ఈ చిత్రం చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు అప్పుడప్పుడూ కేథరిన్ కి విజయాలు దక్కుతున్నాయి.
Catherine Tresa
కానీ గత రెండేళ్లుగా కేథరిన్ చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కేథరిన్ గ్లామరస్ గా కనిపిస్తూ ఫోటోలు షేర్ చేస్తోంది.