మహేష్,రాజమౌళి ప్రాజెక్టుపై వచ్చిన వార్తను ఖండిస్తూ నిర్మాత ప్రకటన
అడ్వేంచర్ నేపథ్యంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సుమారు రూ. 1000 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో ఈ భారీ ప్రాజెక్ట్‌లోకి మరికొందరు బడా నిర్మాతలు కూడా చేతులు కలపబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Mahesh,rajamouli
రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లే మహేష్ బాబు కూడా బాగా జుట్టు పెంచి, జిమ్ చేస్తూ ఈ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అయితే ఇప్పటివరకు కూడా ఈ సినిమా నుంచి ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. కాని రోజుకో వార్త చొప్పున వస్తూనే ఉంది. అయితే తాజాగా ఓ ఇంగ్లీష్ డైలీలో వచ్చిన వార్తను ఖండిస్తూ నిర్మాణ సంస్దవారు ప్రకటన రిలీజ్ చేసారు. ఇంతకీ ఏమిటా వార్త.
టాలీవుడ్ లో ఇప్పుడు అందరి దృష్టీ మహేశ్ బాబు- రాజమౌళి సినిమాపైనే ఉంది. మొన్న సంక్రాంకి వచ్చిన మహేష్ గుంటూరు కారం యావరేజ్ కావటంతో ఈ ప్రాజెక్టుపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానికి తోడు పాన్ ఇండియా రేంజ్‌లో మహేశ్ బాబు ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది కావటంతో ఆ లెక్కలే వేరుగా ఉంటున్నాయి. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో ఈ సినిమా ఎప్పుడూ ఎనౌన్సమెంట్ డేట్ కూడా బయిటకు వచ్చింది.
అందుతున్న సమాచారం మేరకు మే 31,2024న ఈ సినిమా లాంచ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఆ రోజు మహేష్ బాబు తండ్రి అయిన సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. త్వరలోనే ఈ విషయాన్ని ఎనౌన్స్ చేస్తూ చిన్న టీజర్ వదలబోతున్నారని వినికిడి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ఇప్పటికే మొదలై శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం మల్టిఫుల్ సెట్స్ హైదరాబాద్ లో వేస్తున్నారు. అలాగే ఈ సినిమా కోసం క్రూ మొత్తాన్ని రాజమౌళి సెట్ చేసారని అంటున్నారు. అలాగే ఈ చిత్రం భారీ బడ్జెట్ కావటంతో వేరే నిర్మాతలు కూడా ఇన్వాన్వ్ అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది.
Mahesh,rajamouli
ఈ చిత్రానికి ప్రధాన నిర్మాతగా శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కెఎల్ నారాయణ వ్యవహరించనున్నారు. చాలా ఏళ్ల క్రితం ఆయనకు రాజమౌళి- మహేశ్ మాట ఇచ్చారు. దానిని ఈ సినిమాతో నిలిబెట్టుకుంటున్నట్లు సమాచారం. అడ్వేంచర్ నేపథ్యంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సుమారు రూ. 1000 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో ఈ భారీ ప్రాజెక్ట్‌లోకి మరికొందరు బడా నిర్మాతలు కూడా చేతులు కలపబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలా ఈ ప్రాజెక్టులోకి సహ నిర్మాతగా Netflix చేసేందుకు డీల్ జరుగుతోందని అంటున్నారు. అయితే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు.
ఇక రీసెంట్ గా ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ ఈ సినిమాకు కాస్టింగ్ డైరెక్టర్ వీరేన్ స్వామి పనిచేస్తున్నట్టు వార్త రాశారు. దీనిపై మూవీ యూనిట్ స్పందిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ దుర్గ ఆర్ట్స్ నుంచి తాజాగా అధికారిక లేఖని విడుదల చేసింది. ఆ లేఖలో ఉన్న విషయం ఇది..
శ్రీ దుర్గ ఆర్ట్స్ తమ లేఖలో.. SS రాజమౌళి & మహేష్ బాబు రాబోయే సినిమా కోసం కాస్టింగ్ రూమర్స్ పై క్లారిటీ కోసమే ఈ లేఖ. ఇటీవల ప్రముఖ సంస్థ (టైమ్స్ ఆఫ్ ఇండియా) SS రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్ యొక్క కాస్టింగ్ గురించి ఒక కథనాన్ని ప్రచురించినట్లు మా దృష్టికి వచ్చింది. అందులో పేర్కొన్నదానికి విరుద్ధంగా వీరేన్ స్వామి మా సినిమాలో ఏ విధంగాను భాగం కాలేదు. దీన్ని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము. అవసరమైనప్పుడు సినిమా గురించి అన్ని అధికారిక ప్రకటనలు నిర్మాణ సంస్థ తెలుపుతుంది అని క్లారిటీ ఇచ్చారు.
మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందే సినిమా కోసం ఓ ఇండోనేషియన్ హీరోయిన్ ని ఎంచుకొన్నారని వార్తలు వస్తున్నాయి. ఆమె పేరు… చెల్సియా ఇస్లాన్. ఇప్పటికే ఆమె కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో నటించింది. రీసెంట్ గా ఆమెను స్క్రీన్ టెస్ట్ కూడా చేశారని, ఈ సినిమాలో ఆమె వర్క్ చేయటం కన్ఫర్మ్ అని తెలుస్తోంది. అయితే చెల్సియాని హీరోయిన్ పాత్ర కోసం ఎంచుకొన్నారా, లేదంటే కీలక పాత్ర కోసం తీసుకొన్నారా? అనేది తెలియాల్సివుంది.
రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో ఎప్పుడో సినిమా రావాల్సి ఉన్నా... ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి భారీ ప్రాజెక్టుల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు రూట్ క్లియర్ అయింది. మరికొద్ది రోజుల్లోనే రాజమౌళి ప్రపంచంలోకి అడుగుపెడతారు మహేష్. ఈ కాంబినేషన్‌లో వస్తున్న మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి.
టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న రాజమౌళి దీనిని గురించి మాట్లాడుతూ... ‘ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథ’ అంటూ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఇది ఉంటుందని తెలిపారు. ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ స్థాయిలో నిర్మించనున్నారు. హై-వోల్టేజ్ యాక్షన్ అండ్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా మూడు భాగాలుగా రానుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రకటించిన విషయం తెలిసిందే.
మొత్తం షూటింగ్ ప్రపంచంలోని మూడు దేశాల్లో జరగనుంది. ఈ సినిమా షూటింగ్‌లో కొంత భాగం దట్టమైన అమెజాన్ అడవుల్లో జరగనుంది. షూటింగ్ ప్రారంభానికి ముందు రాజమౌళి మీడియాతో ఇంటరాక్ట్ అవుతారు. ప్రముఖ హాలీవుడ్ స్టూడియో, కెఎల్ నారాయణతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుంది. హీరోయిన్ , ఇతర నటీనటులను త్వరలోనే ఖరారు చేస్తారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ని త్వరలో ఖరారు చేయనున్నారు.
మహేశ్‌బాబు మాట్లాడుతూ...‘ఆయనతో పనిచేయాలన్న కల సాకారం కాబోతోంది. రాజమౌళితో ఒక సినిమా చేస్తే, 25 సినిమాలు చేసినట్టే. ఈ ప్రాజెక్టు విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నా. ఇది పాన్ ఇండియా మూవీ అవుతుంది. జాతీయ స్థాయిలో సరిహద్దులను ఈ చిత్రం చెరిపేస్తుంది’’ అని అన్నారు. తన సినిమాలకు అంతకంతకూ బడ్జెట్ పెంచుకుంటూ పోతున్న రాజమౌళి.. ట్రిపుల్ ఆర్ కోసం 450 నుంచి 500 కోట్ల వరకూ ఖర్చు చేశాడు. ఇక ఈసినిమాకు అంతకు మించి అన్నట్టగా.. 500 నుంచి 600 కోట్ల వరకూ బడ్జెట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. వీఎఫ్ఎక్స్ కే ఎక్కువగా ఖర్చు పెట్టనున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నారు. ఇందుకు కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో నిధి వేట ఇతివృత్తంగా ఒక కథ సిద్ధం చేయగా, జేమ్స్‌బాండ్ తరహాలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా దీన్ని తీర్చిదిద్దే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి.
ఇక మహేష్ బాబు సినిమా కోసం నటీనటుల ఎంపిక చేస్తున్నాడట రాజమైళి. ముఖ్యంగా మహేష్ కు జోడీగా నటించే హీరోయిన్ కోసం చాలా ఆప్షన్లు తీసుకున్నాడట. అందులో ఎవరు అయితే బాగుంటారా అని చూస్తున్నాడట. లిస్ట్ లో టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ ఉన్నట్టు తెలుస్తోంది.