డిన్నర్ కి పిలిచి అతడితో టాలీవుడ్ మహిళా నిర్మాత శారీరక సంబంధం.. ఘరానా మోసం గుట్టు రట్టు
చిత్ర పరిశ్రమలో అప్పుడప్పుడూ కొన్ని చీటింగ్ వ్యవహారాలు బయటపడుతూ ఉంటాయి. కొందరు అసిస్టెంట్ డైరెక్టర్లు, మేనేజర్లు వర్తమాన నటీమణులని అవకాశాల పేరుతో వేధించడం, మోసగించడం చూస్తూనే ఉన్నాం.
చిత్ర పరిశ్రమలో అప్పుడప్పుడూ కొన్ని చీటింగ్ వ్యవహారాలు బయటపడుతూ ఉంటాయి. కొందరు అసిస్టెంట్ డైరెక్టర్లు, మేనేజర్లు వర్తమాన నటీమణులని అవకాశాల పేరుతో వేధించడం, మోసగించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఒక మహిళా నిర్మాత కెమెరా అసిస్టెంట్ కి పెద్ద టోపీ పెట్టేసింది. బాధితుడు పోలీసులని ఆశ్రయించడంతో ఈ వ్యవహారం బయటకి వచ్చింది.
టాలీవుడ్ కి చెందిన కెమెరా అసిస్టెంట్ నాగార్జున బాబు తాను మోసపోయాను అంటూ పోలీసులని ఆశ్రయించాడు. భైరవ పురం చిత్ర నిర్మాతగా ఆశా మల్లిక వ్యవహరించారు. ఆమెతో కెమెరా అసిస్టెంట్ నాగార్జున బాబుకి పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల పరిచయం తర్వాత ఆశా మల్లికా.. నాగార్జున బాబుని డిన్నర్ కి ఇన్వైట్ చేసింది.
నాగార్జున బాబుని ఒంటరిగా డిన్నర్ కి పిలిచిన ఆశా మల్లిక ఆ తర్వాత అతడితో శారీరక సంబంధం పెట్టుకుంది. కొన్ని రోజుల తర్వాత తాను ప్రెగ్నెంట్ అని అతడికి చెప్పింది. అయితే తనకి ఆల్రెడీ పెళ్లి అయిందని కూడా చెప్పింది. తన భర్త నుంచి త్వరలో విడాకులు తీసుకుంటానని నమ్మించింది. తనని పెళ్లి చేసుకోవాలని నాగార్జున బాబుని కోరింది.
దీనితో నాగార్జున బాబు పెళ్ళికి ఒకే చెప్పాడు. ఇద్దరూ చిలుకూరు బాలాజీ టెంపుల్ లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొన్ని రోజులకు తనకు అర్జెంట్ గా డబ్బు అవసరం అని మల్లిక తన భర్తని కోరింది. దీనితో నాగార్జున బాబు 18,50,000 ఒకసారి 10 లక్షలు మరోసారి ఆమె అకౌంట్ లో వేశాడు. డబ్బు చేతికి అందాక అతడిని దూరం పెట్టడం ప్రారంభించింది.
marriage
ఆమె ప్రవర్తనలో మార్పు రావడంతో నాగార్జున బాబు ఆరా తీయడం మొదలు పెట్టాడు. అప్పుడే మల్లికా గురించి దిమ్మ తిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో మల్లికకి ఒక పెళ్లి కాదు రెండు పెళ్లిళ్లు అయినట్లు తేలింది. అంతే కాదు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారట. గతంలో ఇదే తరహాలో చాలా మందిని మోసం చేసినట్లు కూడా నాగార్జున బాబుకి తెలిసింది.
వేరే వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం.. ఆ తర్వాత వారిపైనే కేసులు పెట్టి.. ఆస్తిలో వాటా ఇవ్వాలని బెదిరించడం లాంటి పనులు మల్లిక చేస్తోంది. ఆమె మోసాలన్నింటిపై నాగార్జున బాబు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. గతంలో కూకట్ పల్లిలో, వైజాగ్ గాజువాకలో ఆమె ఇద్దరిపై కేసులు పెట్టినట్లు కూడా తెలిసింది.