MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bro Review: `బ్రో` మూవీ ట్విట్టర్‌ రివ్యూ.. పవన్ మ్యాజిక్‌ వర్కౌట్‌ అయ్యిందా?

Bro Review: `బ్రో` మూవీ ట్విట్టర్‌ రివ్యూ.. పవన్ మ్యాజిక్‌ వర్కౌట్‌ అయ్యిందా?

పవన్ కళ్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన `బ్రో` సినిమా నేడు(శుక్రవారం) విడుదలవుతుంది. ముందుగా ఓవర్సీస్‌లో ప్రదర్శించారు. మరి ట్విట్టర్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం. 

Aithagoni Raju | Published : Jul 28 2023, 03:12 AM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19
Asianet Image

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన మూవీ `బ్రో`. `భీమ్లా నాయక్‌`వంటి హిట్ మూవీ తర్వాత ఆయన్నుంచి వస్తోన్న చిత్రమిది. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తో వస్తుందీ మూవీ. ఇందులో సాయిధరమ్‌ తేజ్‌ మరో హీరోగా నటిస్తుండటం ఈ చిత్రం స్పెషల్‌. తమిళ దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. ఆయన తమిళంలో రూపొందించిన `వినోదయ సిత్తం` చిత్రానికిది రీమేక్‌. తెలుగులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(జులై 28)న విడుదలయ్యింది. ముందుగా అమెరికా వంటి విదేశాల్లో ప్రీమియర్స్ గా ప్రదర్శించారు. మరి అక్కడి రెస్పాన్స్ ఎలా ఉందో ట్విట్టర్‌ లో వాళ్లు పోస్ట్ చేశారు. ఆ ట్విట్టర్‌ రివ్యూని ఓ సారి తెలుసుకుందాం. 
 

29
Asianet Image

`బ్రో` టైమ్‌ వాల్యూని తెలియజేసే చిత్రం. దేవుడికైనా టైమ్ రావాలంటారు. అలా దేవుడుకంటే టైమ్‌ గొప్పదనేది ఈసినిమా ద్వారా చెప్పబోతున్నారు. కొంత ఆథ్యాత్మిక టచ్‌తో సినిమా సాగుతుంది. తమిళంలో సముద్రఖని, తంబిరామయ్య నటించారు. అక్కడ ఎలాంటి అంచనాలు లేకుండా ఈ సినిమా విడుదలైంది. పైగా సముద్రఖని సినిమా అంటే మినిమమ్‌ గ్యారంటీ ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఐదు కోట్లతో రూపొందిన ఈ సినిమా సుమారు పది కోట్లు వసూలుచేసింది. అంతకంటే ఎక్కువగా క్రిటికల్‌గా ప్రశంసలందుకుంది. ఎంతో మందిని ఆలోచింప చేసిన సినిమాగా నిలిచింది.
 

39
Asianet Image

దీన్ని పవన్‌ కళ్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ హీరోలుగా తెలుగులో రీమేక్‌ చేశారు. ఇక్కడ కథని చాలా యంగ్‌ ఏజ్‌గా మార్చేశారు. ముఖ్యంగా తంబిరామయ్య పాత్రలో నటించిన సాయిధరమ్‌ తేజ్‌ నటించారు. సముద్రఖని పాత్రని పవన్‌ కళ్యాణ్‌ చేశారు. ఇక ఫ్యామిలీ సెటప్‌ అంతా మారిపోయింది. మాతృకలో తంబిరామయ్య బ్యాంక్‌ మేనేజర్‌గా చేస్తే, ఇందులో సాయిధరమ్‌ తేజ్‌ తండ్రి చనిపోవడంతో కార్పొరేట్‌ కంపెనీ బాధ్యతలు తీసుకుంటాడు. బిజీ లైఫ్‌ని లీడ్‌ చేస్తుంటాడు. ఫ్యామిలీ, లవర్‌ కూడా టైమ్‌ కేటాయించలేకపోతుంటాడు. ఇంతలో యాక్సిడెంట్ అవుతుంది. అందులో చనిపోతాడు. అప్పుడు టైమ్‌(పవన్‌) ఎంట్రీ ఇస్తాడు. తమ బాధ్యతలు పుల్‌ఫిల్‌ చేసేందుకు కొంత టైమ్‌ కావాలని రిక్వెస్ట్ చేయగా, మళ్లీ పునర్జన్మనిస్తాడు టైమ్‌. అలా మళ్లీ బతికిన సాయిధరమ్‌ తేజ్‌కి ఎదురైన అనుభావాలేంటి? ఆయన చూసిన అసలైన జీవితం ఏంటి? జీవితంలో ఏం తెలుసుకున్నాడనేది ఈ సినిమా కథ. 
 

49
Asianet Image

ఇక యూఎస్‌ వంటి ఇతర దేశాల్లో ఒక్క రోజు ముందుగానే ఈ పెద్ద సినిమాలు  ప్రదర్శించబడతాయనే విషయం తెలిసిందే. `బ్రో` మూవీ కూడా ముందుగానే ప్రీమియర్స్ ని ప్రదర్శిస్తున్నారు. అక్కడి ఫ్యాన్స్ సినిమాని ముందుగానే చూసి ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇది ప్రదర్శించబడుతుంది. తమకి సినిమా ఎలా అనిపించిందో ట్విట్టర్ ద్వారా పోస్ట్ ల రూపంలో తెలియజేస్తున్నారు. మరి వాళ్లు ఏంచెబుతున్నారు? వాళ్లకి సినిమా నచ్చిందా? లేదా?సినిమా హిట్టా ఫట్టా? ఓవర్సీస్‌ ఆడియెన్స్ రివ్యూ ఏంటనేది ట్విట్టర్‌ రివ్యూలో తెలుసుకుందాం. 
 

59
Asianet Image

సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తుంది. స్టోరీ లైన్‌ చాలా ఆసక్తికరంగా ఉందట. ఫ్యాన్స్ మూమెంట్‌ చాలానే ఉన్నాయని అంటున్నారు. ఎమోషన్ సైడ్‌ ప్రయారిటీ ఎక్కువగా ఉందని, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి ప్రాణమని, ఫ్యాన్స్ ని అలరించే సీన్లుసాగుతూనే మరోవైపు డివోషనల్‌ టచ్‌ ఉందట. రెండింటిని బ్యాలెన్స్ చేసినట్టు చెబుతున్నారు. థమన్‌ బీజీఎం హైలైట్‌ అంటున్నారు. డైలాగులు, స్క్రీన్‌ ప్లే రేసీగా ఉందంటున్నారు. 
 

69
Asianet Image

అయితే ఇందులోనూ కొన్ని పొలిటికల్‌ డైలాగ్ లు పెట్టేప్రయత్నం చేశారట. తెలివిగా వాటిని ఇరికించారని అంటున్నారు. ఇక పవన్‌ కళ్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కాంబో సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు మంచి హ్యూమర్‌ని పండిస్తాయనట. పవన్‌ కళ్యాణ్‌ పాపులర్‌ సాంగ్స్ అన్నింటిని ఇందులో మిక్స్ చేశారట. అది ఫ్యాన్స్ కి ఊగిపోయేలా చేస్తాయని ఓవర్సీస్ ఆడియెన్స్ చెబుతున్నారు. 
 

79
Asianet Image

ఫస్టాఫ్‌ ఫన్‌గా, సరదాగా సాగుతుందని, ఇంటర్వెల్‌ బ్యాంగ్ అదిరిపోయిందట. అదేసమయంలో స్టోరీ లైన్ కూడా ఆసక్తికరంగా ఉందని, వీఎఫ్‌ఎక్స్ చాలా బాగున్నాయని చెబుతున్నారు. ఫాంటసీ ఎలిమెంట్ల వైపు పోకుండా చాలా వరకు రియల్ లైఫ్‌ని చూపించారట. ఓవరాల్‌గా సినిమా ఫర్వాలేదంటున్నారు. పవన్ కళ్యాణ్ మార్క్ తో సాగుతుందని చెబుతున్నారు.
 

89
Asianet Image

అయితే మరికొంత మంది సినిమా అంత గొప్పగా ఏం లేదని యావరేజ్‌ ఫిల్మ్ అంటున్నారు. కథలో డెప్త్ లేదని, అలా పైపైన టచ్‌ చేసుకుటూ వెళ్లారని, స్క్రీన్ ప్లే వీక్ గా ఉందని చెబుతున్నారు. పవన్ ఇమేజ్‌ని, ఫ్యాన్స్ ఎలిమెంట్లకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం వల్ల చెప్పాలనుకున్న విషయం పక్కకు వెళ్లేలా ఉందని అంటున్నారు. అయితే క్లైమాక్స్ మాత్రం బాగుందట. ఫిలాసఫీ టచ్‌ ఇస్తూ ప్రాక్టికల్ గా చెప్పిన తీరు ఆకట్టుకునేలా ఉందని హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఇక్కడ రైటింగ్‌ బాగుందని అంటున్నారు.

99
Asianet Image

 పవన్‌ ఫ్యాన్స్ ఎంజాయ్‌ సీన్లు మాత్రం పుష్కలంగా ఉన్నాయట. థియేటర్లలో ఎంజాయ్‌ చేస్తారని, పవన్ స్వాగ్‌ ఈ సినిమాని నడిపిస్తుందని, ఆయన పాత్ర చివరి వరకు ఉంటుందంటున్నారు. రైటింగ్‌ సైడ్‌ ఇంకా దృష్టి పెడితే సినిమా నెక్ట్స్ లెవల్లో ఉండేదట. మొత్తంగా ఓవర్సీస్ ఆడియెన్స్ టాక్ మాత్రం పాజిటివ్ గా ఉంది. యావరేజ్‌ నుంచి ఎబౌ యావరేజ్‌గా చెబుతున్నారు. మరి మన ఆడియెన్స్ కి సినిమా ఎంత వరకు నచ్చుతుంది? ఇక్కడి రిజల్ట్ ఎలా ఉంటుందనేది పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. 

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
పవన్ కళ్యాణ్
 
Recommended Stories
Top Stories