`బ్రో` సక్సెస్ సెలబ్రేషన్స్.. సినిమాలో ఏపీ మంత్రిపై సెటైర్లు.. క్లారిటీ ఇచ్చిన సముద్రఖని..
పవన్ కళ్యాణ్ నటించిన `బ్రో` చిత్రం నేడు శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్‌ని తెచ్చుకుంటుంది. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాకి టాక్ బాగున్న నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించారు.
`బ్రో` సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో యూనిట్ సెలబ్రేట్ చేసుకున్నారు. హీరో సాయిధరమ్ తేజ్, దర్శకుడు సముద్రఖని, హీరోయిన్ కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల పాల్గొన్నారు. బాణాసంచా కాల్చి సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకున్నారు. తన సంతోషాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా టీమ్ తమ సంతోషాన్ని పంచుకున్నారు. సినిమాకి అద్భుతమైన స్పందన లభిస్తుందని నిర్మాతలు తెలిపారు. అత్యంత షార్ట్ పీరియడ్‌లో ఇంత పెద్ద సినిమా తీయడం ఇటీవల కాలంలో ఇదే ఫస్ట్ ఫిల్మ్ అవుతుందన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోతో ఇంత ఫాస్ట్ గా తీయడం సముద్రఖని వల్లే, పవన్ సహకరించడం వల్లే సాధ్యమైందన్నారు. సినిమాకి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఓవర్సీస్ నుంచి ఇతర దేశాల నుంచి మార్నింగ్ నుంచి ఫోన్ కాల్స్ మోగుతూనే ఉన్నాయన్నారు.
సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ, సినిమాకి మామయ్య పవన్ కళ్యాన్ గారే మెయిన్ హీరో అని, నాది కీలక పాత్ర అని అన్నారు. మామయ్యతో కలిసి నటించడం అద్భుతమైన ఎక్స్ పీరియెన్స్ అని, సినిమాకి ఇంత మంచి స్పందన లభిస్తుంటే హ్యాపీగా ఉందన్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కి సినిమా కనెక్ట్ అవుతుంది. అదే తమ లక్ష్యం. సినిమా సందేశం వారికి రీచ్ కావాలన్నారు. మనీ ముఖ్యం కాదు, జీవితం విలువ తెలవాలన్నారు.
మరోవైపు సినిమాలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సెటైర్లున్నాయనే కామెంట్స్ వినిపించాయి. పబ్‌లో 30ఇయర్స్ పృథ్వీ డాన్సు చేసిన సందర్భంలో ఆయనకు పవన్ క్లాస్ పీకుతాడు. `కింగ్` సినిమాలోని బ్రహ్మానందం స్టయిల్‌లో ఈ క్లాస్ పీకడం ఉంటుంది. అది హైలైట్గా నిలిచింది. థియేటర్లలో ఈలలు, కేకలు వేశారు ఫ్యాన్స్. అయితే ఆ వీడియోని, గతంలో ఓ ప్రజా కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు డాన్సు చేసిన వీడియోకి మిక్స్ చేస్తూ సెటైర్లు పేలుస్తున్నారు.
ఈ నేపథ్యంలో దీనిపై చిత్ర దర్శకుడు స్పందించారు. ఆ విషయం తమకు తెలియదన్నారు. సినిమాలో డాన్సు సరిగా చేయలేని సీన్ ఒకటి ఉంటుంది. ఆ సందర్భంలో అలా పవన్ చేత చెప్పించి కాస్త వినోదాన్ని పండించే ప్రయత్నం చేశామని, ఆ సీన్‌ని బట్టి తీశామని, కానీ మంత్రి గొడవ తనకు తెలియదని నవ్వుతూ చెప్పడం గమనార్హం. పెద్దలతోపాటు చిన్నపిల్లలకు ఈసినిమా కనెక్ట్ కావాలి, అవుతుందన్నారు. తాను తీసిన పర్పస్ నెరవేరుతుందని చెప్పారు. ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మలు సైతం తమ సంతోషాన్ని పంచుకున్నారు.