2024 తెలుగు డబ్బింగ్ సినిమాల హిట్లు, ఫట్లు
2024లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమాలలో కెప్టెన్ మిల్లర్, లాల్ సలాం, భారతీయుడు 2, కంగువా వంటి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. మంజుమ్మల్ బాయ్స్, అమరన్, మహారాజా వంటి సినిమాలు మాత్రం మంచి విజయాన్ని అందుకున్నాయి.
Bharatheeyudu 2 , Lal Salaam, Kanguva, Thangalan
2024కి మరికొద్ది రోజుల్లో వీడ్కోలు పలుకుతున్న వేళ ..తెలుగులో ఈ సంవత్సరం వచ్చి సూపర్ హిట్టైన డబ్బింగ్ సినిమాలు, డిజాస్టర్ అయిన డబ్బింగ్ కళా ఖండాలు గురించి మాట్లాడుకుందాం. అసలు 2024 జనవరిలో విడుదలైన ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాతో మొదలైంది. ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇంక డబ్బింగ్ సినిమాలుకు ఈ సంవత్సరం కలిసి రాదేమో అనుకున్న టైమ్ లో మళయాళ డబ్బింగ్ సినిమాలు వచ్చి సూపర్ హిట్ అనిపించుకున్నాయి. ఆ సినిమాలు ఏమిటో చూద్దాం..
Actror Suriya starrer Kanguva ott release review
మొదట డిజాస్టర్ అయిన సినిమాలు పరిశీలిస్తే...
కెప్టెన్ మిల్లర్.. ధనుశ్ హీరోగా శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. ఈ సినిమా తమిళంలో పొంగల్ కానుకగా విడుదలైంది. కానీ తెలుగులో మాత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. కొని రిలీజ్ చేసిన వారికి మొత్తం డబ్బులు పోయాయి.
ఆ తర్వాత రజినీకాంత్ అతిథి పాత్ర అని పూర్తి పాత్ర చేసిన ‘లాల్ సలాం’.లాల్ సలాం.. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో నటించిన చిత్రం. ఈ సినిమాలో రజినీకాంత్ కు చాలా యేళ్ల తర్వాత సాయి కుమార్ డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగులో మినిమం ఓపెనింగ్స్ రాబట్టలేక చతికిల బడింది.
తంగలాన్.. విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తంగలాన్’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తెలుగు, తమిళం సహా రెండు భాషల్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2’. తెలుగులో భారతీయుడు మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా అందరి అంచనాలను తలకిందలు చేస్తూ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
ఇక వేట్టయ్యాన్.. రజినీకాంత్ హీరోగా జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వేట్టయ్యన్’. ఈ సినిమా తెలుగు, తమిళం సహా రెండు భాషల్లో డిజాస్టర్ గా నిలిచింది.సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కంగువా’. ఈ సినిమా ఈ యేడాది మన దేశంలో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని సీన్స్ ప్రేక్షకులను మరీ దారుణంగా ఉన్నాయనే టాక్ రావటంతో ఉండటంతో ఈ ప్యాన్ ఇండియా మినిమం కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.
భాక్సాఫీస్ దగ్గర హిట్ అయిన డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే... మలయాళం లో రిలీజ్ అయి హిట్ అందుకున్న ఈ చిత్రం తెలుగులోకి డబ్ అయ్యి అంతకుమించి ఘన విజయాన్ని అందుకుంది. నస్లీన్ కే గపూర్, మమత బైజు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని గిరీష్ ఏ డి డైరెక్ట్ చేశారు. తెలుగులో ఈ చిత్రానికి అమితమైన ఆదరణ రావడానికి మరో కారణం.. ఈ చిత్ర కథ నేపథ్యం పూర్తిగా హైదరాబాద్ కావడమే. ఈ సినిమాకు తెలుగు మాటలను 90s వెబ్ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ అందించారు.
మంజుమ్మల్ బాయ్స్:
ఎస్ చిదంబరం దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తెలుగులో అమితమైన ఆదరణ దక్కింది. తెలుగు ప్రేక్షకులను థియేటర్లలో అలరించిన ఈ చిత్రం.. ఓటిటి ద్వారా మరింత ఎక్కువ మందికి వినోదాన్ని పంచింది. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
kanguva
అమరన్:
శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. చాలా రోజుల తర్వాత వెండితెర మీద సాయి పల్లవి కనిపించడంతో తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూర్చారు.
మహారాజా.. విజయ్ సేతుపతి హీరోగా నటించిన తమిళ డబ్బింగ్ చిత్రం ‘మహారాజా’. ఓ కూతురు కోసం ఓ తండ్రి చేసే పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మహారాజా’. ఈ సినిమా తమిళం, తెలుగుతో పాటు చైనాలో కూడా దుమ్ము దులుపుతుంది.