MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలీవుడ్ కాదు రీమేక్ వుడ్... సౌత్ రెసిపీ ట్రై చేస్తున్న టాప్ స్టార్స్!

బాలీవుడ్ కాదు రీమేక్ వుడ్... సౌత్ రెసిపీ ట్రై చేస్తున్న టాప్ స్టార్స్!

సౌత్ చిత్రాలు ప్రభంజనం సృష్టిస్తుండగా బాలీవుడ్ హీరోలు రీమేక్స్ పై పడ్డారు. నాలుగు టాప్ స్టార్స్ రోజులు, నెలల వ్యవధిలో సౌత్ రీమేక్స్ తో రానున్నారు. ఈ లిస్ట్ లో సల్మాన్, అక్షయ్, అజయ్ దేవ్ గణ్ ఉన్నారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Feb 08 2023, 06:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Salman Khan

Salman Khan


బాలీవుడ్ కి 2022 బ్లాక్ ఇయర్ అని చెప్పాలి. వాళ్లకు అసలు కలిసి రాలేదు. టాప్ స్టార్స్ నుండి టైర్ టు హీరోల వరకూ ఎవరికీ విజయం దక్కలేదు. ఒకటి రెండు సినిమాలు మినహాయిస్తే అన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అదే సమయంలో సౌత్ చిత్రాలు బాలీవుడ్ దుమ్ముదులిపాయి. ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ 2, కార్తికేయ , కాంతార సాలిడ్ వసూళ్లు సాధించాయి. దీంతో తమ ఓన్ రెసిపీ పక్కనపెట్టి సౌత్ కథలు ట్రై చేస్తున్నారు. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్ గణ్, కార్తీక్ ఆర్యన్ రీమేక్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించనున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

సల్మాన్ ఖాన్ రంజాన్ కానుకగా కిసీకా భాయ్ కిసీకి జాన్ విడుదల చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా వెంకటేష్ కీలక రోల్ చేస్తున్నారు. ఈ మూవీ తమిళ హిట్ వీరం రీమేక్. అజిత్ కుమార్ నటించిన వీరం సూపర్ డూపర్ హిట్ కొట్టింది. తెలుగులో ఈ చిత్రాన్ని కాటమరాయుడు చేసి పవన్ భంగపడ్డారు.

35

2019లో విడుదలైన ఖైదీ తెలుగు, తమిళ భాషల్లో భారీ హిట్ కొట్టింది. కార్తీ హీరోగా నటించగా లోకేష్ కనకరాజ్  ప్రయోగాత్మకంగా తెరకెక్కించారు. ఖైదీ చిత్రాన్ని అజయ్ దేవ్ గణ్ భోలా టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. టబు కీలక రోల్ చేస్తున్న భోలా మార్చి 30న విడుదల కానుంది. 
 

45

2020 సంక్రాంతి విన్నర్ అల వైకుంఠపురంలో మూవీ హిందీలో షెహ్జాదా గా తెరకెక్కింది. కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించారు. అల్లు అర్జున్ కి ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన అల వైకుంఠపురంలో హిందీ రీమేక్ ఎలాంటి ఫలితం ఇస్తుందనే ఆసక్తి అందరిలో ఉంది. షహ్జాదా ఫిబ్రవరి 10న విడుదల కానుంది.

55

మరో స్టార్ అక్షయ్ కుమార్ సౌత్ రీమేక్ ఎంచుకున్నాడు. ఆయన మలయాళ హిట్ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ చేస్తున్నారు. సెల్ఫీ టైటిల్ తో ఈ రీమేక్ తెరకెక్కుతుంది. ఇమ్రాన్ హష్మీ కీలక రోల్ చేస్తున్నారు. ఫిబ్రవరి 24న విడుదల అవుతుంది. పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన డ్రైవింగ్ లైసెన్స్ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ సక్సెస్ అందుకుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవిని లేపడం కోసం బాలయ్య, నాగ్‌, వెంకీలను తగ్గించిన స్టార్‌ డైరెక్టర్‌.. చివరికి ఆయనతోనే గొడవ
Recommended image2
Nayanthara: నయనతార కెరీర్ లో చెత్త సినిమాలు, ఆ ఒక్క మూవీ చేసినందకు ఇప్పటికీ బాధపడుతున్న హీరోయిన్
Recommended image3
Folk Song: రియల్ లైఫ్ ప్రేమజంట పాటకు యూట్యూబ్ లో 5 కోట్ల వ్యూస్, పాట వింటే స్టెప్పులేయాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved