ఆ నటుడు ముద్దు పెడితే వాంతి వచ్చింది.. రవీనా టండన్ సంచలన వ్యాఖ్యలు .
బాలీవుడ్ ను ఒకప్పుడ ఒక ఊపు ఊపేసిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ గురించి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన రవీనా ఇక్కడ కూడా నాలుగైదు సినిమాలు చేశారు. తాజాగా రవీణా టండన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ.. తెలుగులో కూడా నాలుగైదు చిత్రాల్లో నటించారు రవీనా టండన్. ఆకాశ వీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద లాంటి సినిమాల్లో రవీనా టాండన్ మెరిశారు. ఇక ఇప్పుడు ఆమె వయస్సు 47 ఏళ్ళు. 50 ఏళ్ళకు మూడు ఏళ్ల దూరంలో ఉన్న ఆమె చెక్కు చెదరని గ్లామర్ తో మతిపోగొడుతున్నారు. ఇక సినిమాలు, గ్లామర్ యాంగిలే కాదు.. కాంట్రవర్సీలకు కూడా ఆమె కేరాఫ్ అడ్రస్సే.
కేజీఎఫ్ 2లో రవీనాటాండన్ ప్రధాన మంత్రి పాత్రలో నటించి మెప్పించింది. చాలా రోజుల తర్వాత రవీనా ఒక పవర్ ఫుల్ రోల్ ప్లే చేసింది. ఈ చిత్రంలో రవీనా నటనకి ప్రశంసలు దక్కాయి. 90వ దశకంలో రవీనా టాండన్ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా రాణించారు. అయితే చిత్ర పరిశ్రమలో తాను ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నట్లు రవీనా పలు సందర్భాల్లో తెలిపింది.
తాజాగా రవీనా టాండన్ నటిగా తనకి ఎదురైన అవమానం గురించి ఓపెన్ అయింది. నాకు ఇబ్బందికరంగా అనిపించినా ఏ సన్నివేశంలో కూడా నటించేదాన్ని కాదు. అందుకే నాకు పొగరు.. అని.. నాపై అహంకారి ముద్ర వేశారు. నా కెరీర్ బిగినింగ్ లో ఇది ఎక్కువగా జరిగింది అన్నారు రవీనా. ప్రస్తుతం ప్రతీ సినిమాలో ముద్దు సీను కామన్ అయిపోయింది. చిన్నా పెద్ద సినిమాలు లేకుండా.. ముద్దు సీన్లు కామన్ అయిపోయాయి. అడల్ట్ సీన్లతోనే సినిమాలకు బాగా పబ్లిసిటీ పెంచుతున్నారు అని అన్నారు ఆమె.
ఇక ముద్దు సీన్ల గురించి మాట్లాడుతూ రవీన టాండన్ కీలక వ్యాఖ్యలు చేశారు.ముద్దు సీన్ల వెనుక ఉన్న కష్టాల గురించి ఆమె రివీల్ చేశారు. సినిమాలకు సంబంధించి నో కిస్సింగ్ రూల్ ను రవీనా టాండన్ ఫాలో అయ్యేవారు. అయితే కెరీర్ తొలినాళ్లలో రవీనా టాండన్ ఊహించని విధంగా ఒక సందర్భంలో సహ నటుడు రవీనా పెదాలను తన పెదాలతో తాకారట. ఆ సమయంలో ఆమెకు వాంతి అయినంత పని అయ్యిందన్నారు.
ఆమె మాట్లాడుతూ.. నేను ఎప్పుడూ ముద్దు సీన్లలో నటించలేదు.. కాని అలా అతని పెదాలు తాకగానే.. భయం వేసింది. వెంటనే నేను గదిలోకి వెళ్లిపోయానని రవీనా టాండన్ అన్నారు. ఎంతో వికారంగా అనిపించి వాంతి చేసుకున్నానని నోటిని 100సార్లు కడుక్కుంటే బాగుంటుందని అనిపించిందని ఆమె కామెంట్లు చేశారు. అయితే ఏ సినిమా షూట్ సమయంలో ఈ అనుభవం ఎదురైందో మాత్రం రవీనా టాండన్ చెప్పలేదు.
ఇక రవీనా టాండన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో.. వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ను జోరుగా సాగిస్తున్నారు. అటు బాలీవుడ్ తో పాటు.. సౌత్ లో కూడా క్యారెక్టర్ రోల్స్ గట్టిగా చేస్తున్నారు రవీనా.