సల్మాన్ ఖాన్ సిక్స్ ప్యాక్ ఫేక్ అంటూ ప్రచారం, కండల వీరుడి ఫిట్ నెస్ పై పేలుతున్న జోకులు.. నిజమెంత..?
బాలీవుడ్ లో కండల వీరుడుగా పేరుంది సల్మాన్ ఖాన్ కు. 60 ఏళ్లకు మూడు ఏళ్ళు దూరంలో ఉన్న సల్మాన్ ఇంత ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తున్నాడంటూ.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు.. ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. అయితే తాజాగా సల్మాన్ కుసబంధించిన ఓన్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌ను కండల వీరుడు అని అంటారు. ఇన్నేళ్ల ఫిల్మ్ కెరీర్ లో ఆయనకు ఆ పేరు ఇప్పటికి ఫిక్స్డ్ గానే ఉంది. ప్రస్తుతం 57 ఏళ్ళ వయస్సులో కూడా సల్మాన్ ఖాన్ అదే ఫిట్ నెస్ ను కంటీన్యూ చేయడం విశేషం. క్రమం తప్పకుండా జిమ్, ఫిజికల్ ఫిట్‌నెస్ తదితర కారణాల వల్ల ఆయన అలా కంటిన్యూ అవుతాడు అని అంటుంటారు.
57 ఏళ్ల వయసులో కూడా సల్మాన్ సిక్స్‌ప్యాక్‌తో కనిపిస్తుంటే.. అసలుఇది ఎలా సాధ్యం...ఇది నిజమేనే అని కొంత మంచి చెవులు కొరుక్కుంటుంటారు కూడా. అసలు అది నిజంగానే సిక్స్ ప్యాక్ ఆ.. అని ఎన్నో ఏళ్ళుగా ప్రశ్న వినిపిస్తూనే ఉంది. తాజాగా బయటికొచ్చిన ఓ వీడియో ఇప్పుడు అన్ని ప్రశ్నలకు సమాధానంగా నిలిచింది.
సల్మాన్ ఖాన్ సినిమా అంటే.. పక్కాగా షర్ట్ విప్పాల్సిందే.. ఆ సీన్ లుకుండా అసలు సల్మాన్ సినిమా అంటూ ఉండదు మరి. ఆయన సినిమాలో యాక్టింగ్ కు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో.. అంతకు మించి బాడీ చూపించడానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఎందుకంటే అతని బాడీకి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి. ఒకవేళ యాక్షన్ సీన్స్‌లో కాకపోయినా పాటల్లో అయినా తన మస్క్యులర్ బాడీని చూపించే ప్రయత్నం చేస్తుంటారు దర్శకులు.
తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుండగా.. ఆ వీడియో చూసి.. సల్మాన్ ఖాన్‌కు సిక్స్ ప్యాక్ లేదు అంటున్నారు సోషల్ మీడియా జనాలు. అది సిక్స్ ప్యాక్ కాదని.. పెద్ద పొట్ట అంటున్నారు. ఆ పొట్టను విజువల్ ఎఫెక్ట్స్‌లో మేనేజ్ చేసి సిక్స్ ప్యాక్ ఉన్నట్లు చూపిస్తున్నారని నెట్టింట రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఇది ఫ్యామిలీ ప్యాక్ ..కాని సిక్స్ ప్యాక్ కవరింగ్ ఇస్తున్నారంటున్నారు. ఇందులో నిజం ఎంతో తెలియదు కాని..న్యూస్ మాత్రం వైరల్ అవుతోంది.
నిజానికి ఇది కొత్త వీడియో కాదు… ఒక ఏడాది క్రితమే ఈ వీడియో బయటకు వచ్చింది. అయితే ఇప్పుడెఎందుకో మళ్లీ ఆ వీడియోను బయటకు తీసుకొచ్చారు. అందులో సల్మాన్‌కు బాణడు పొట్ట ఉంది. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సమయంలోనిది ఆ వీడియో అని సమాచారం. మరి ఇందులో నిజం ఎంత.. అబద్ధం ఎంతో తెలియదు కాని.. ఈ న్యూస్ మాత్రం వైరల్ అవుతుంది.
ఇక సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. టైగర్ 3 సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. మనీష్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కత్రీనా కైఫ్ హీరోయిన్ గా నటిస్తోంది. దివాళి కానుకగా ఈమూవీ రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందింది.