- Home
- Entertainment
- రష్మిక నీ ప్రియుడు అనకొండలానే నిన్ను కూడా తరిమేస్తాం... రష్మికపై నిర్మాత షాకింగ్ కామెంట్స్
రష్మిక నీ ప్రియుడు అనకొండలానే నిన్ను కూడా తరిమేస్తాం... రష్మికపై నిర్మాత షాకింగ్ కామెంట్స్
వివాదాస్పద ఫిల్మ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ హీరోయిన్ రష్మిక మందానను ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. నీ ప్రియుడు అనకొండను తరిమేసినట్లు నిన్ను కూడా బాలీవుడ్ నుండి పంపిస్తాం అంటూ దారుణ ట్వీట్ చేశారు.
Rashmika Mandanna
బాలీవుడ్ నిర్మాత, నటుడు, ఫిల్మ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అక్కడి సూపర్ స్టార్స్ పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ తో పాటు పలువురు ఇండస్ట్రీ పెద్దలను ఉద్దేశిస్తూ అనుచిత కామెంట్స్ చేస్తారు.
Rashmika Mandanna
కమల్ ఆర్ ఖాన్ కి సౌత్ చిత్రాలపై అసలు గౌరవం ఉండదు. బాహుబలి చిత్రాలను కమల్ ఆర్ ఖాన్ కార్టూన్ మూవీస్ అంటూ ఎగతాళి చేశాడు. ఎప్పుడూ ఎవరినో ఒకరిని టార్గెట్ చేయడం, నెగిటివ్ ట్వీట్స్ వేయడం కమల్ ఆర్ ఖాన్ కి పరిపాటిగా మారింది. ఒకటి రెండు సార్లు కమల్ ఆర్ ఖాన్ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ చేశారు.
Rashmika Mandanna
తాజాగా హీరోయిన్ రష్మిక మందానను కమల్ ఆర్ ఖాన్ టార్గెట్ చేశాడు. ఆమెను కించపరిచేలా దారుణ కామెంట్స్ చేశారు. నిన్ను ఇండస్ట్రీ నుండి తరిమేస్తాము. ఇక రష్మిక నేషనల్ క్రష్ అని ఫీల్ అయ్యే వాళ్ళు తమ కళ్ళను చెక్ చేయించుకుంటే బెటర్. ఆమెది భోజ్ పురి చిత్రాలు చేసుకునే రేంజ్ అంటూ... అవమానకర కామెంట్స్ చేశాడు.
హే రష్మిక(Rashmika Mandanna) మేడమ్... నీ ప్రియుడు అనకొండను లైగర్ ప్లాప్ తో ఎలా బాలీవుడ్ నుండి తరిమేశామో అలాగే నిన్ను కూడా పంపించేస్తాము. అయితే నువ్వు భోజ్ పురి చిత్రాలు చేసుకుంటాను అంటే ఓకే. మేము హ్యాపీ అని... ఒక ట్వీట్ చేశాడు.
మరొక ట్వీట్లో... రష్మికను నేషనల్ క్రష్ అని ఫీల్ అవుతున్నవారు తమ కళ్ళను చెక్ చేయించుకుంటే బెటర్. రవి కిషన్, పవన్ సింగ్, నిరావ, కేసరి లాల్ వంటి నటులతో నటించి రాక్ చేయొచ్చు... అని కామెంట్ పోస్ట్ చేశారు. రష్మిక టాలెంట్, గ్లామర్, ఆమె ఫేమ్ ని దిగజార్చుతూ కమల్ ఆర్ ఖాన్ పోస్ట్స్ పెట్టాడు.
ఎప్పుడూ ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతూ ఉండే కమల్ ఆర్ ఖాన్ ఒక సౌత్ హీరోయిన్ మీద తన అక్కసు వెళ్లగక్కాడు. అయితే కమల్ ఆర్ ఖాన్ ని ఎందరు, ఎంత దారుణంగా తిట్టినా పట్టించుకోడు. తన పైత్యం వదలకుండా చూపిస్తూనే ఉంటాడు. రష్మిక,విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఫ్యాన్స్ ఆయన్ని తిట్టినా వాళ్ళ నోళ్లు నొప్పి పుట్టాల్సిందే కానీ... తనకేమీ ఫరక్ పడదు.
రష్మిక బాలీవుడ్ లో సెటిల్ కావాలనే ఆలోచలో ఉన్నారు. ఆమె నటించిన గుడ్ బై అనుకున్న స్థాయిలో ఆడలేదు. సిద్ధార్థ్ మల్హోత్రాకి జంటగా చేసిన మిషన్ మజ్ను ఓటీటీలో నేరుగా విడుదల చేస్తున్నారు. ఇక రష్మిక ఖాతాలో యానిమల్ వంటి భారీ బాలీవుడ్ మూవీ ఉంది. విజయ్ కి జంటగా రష్మిక నటించిన వారసుడు(Varasudu) జనవరి 14న విడుదల కానుంది.