- Home
- Entertainment
- RRR Movie: బాలీవుడ్ దృష్టిలో ఆర్ ఆర్ ఆర్ హీరో చరణేనా? ఆ ప్రశ్నకు అర్థం ఏమిటీ? ఎన్టీఆర్ కి తీరని అన్యాయం!
RRR Movie: బాలీవుడ్ దృష్టిలో ఆర్ ఆర్ ఆర్ హీరో చరణేనా? ఆ ప్రశ్నకు అర్థం ఏమిటీ? ఎన్టీఆర్ కి తీరని అన్యాయం!
ఆర్ ఆర్ ఆర్ విడుదలైనప్పటి నుండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహనంలో ఉన్నారనేది ఒప్పుకోవాల్సిన నిజం. చరణ్ పాత్రకు మించి ఎన్టీఆర్ రోల్ ఉంటుందని అందరూ ఊహించారు. ప్రోమోలు కూడా ఆ తరహా అంచనాలు కలిగేలా చేశాయి. తీరా సినిమా చూస్తే రామ్ చరణ్ వీరవిహారం చేశారు. రాజమౌళి అధిక ప్రాధాన్యత ఆ పాత్రకు ఇవ్వడం జరిగింది.

RRR Movie
ఇదే విషయాన్ని బాలీవుడ్ మీడియా లేవనెత్తడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చరణ్(Ram Charan), ఎన్టీఆర్ ఒకే వేదికపై ఉండగా రిపోర్టర్ అత్యంత ఇబ్బందికరమైన ప్రశ్న అడిగారు. సినిమాలో మీరు బాగా హైలెట్ అయ్యారు. మీ పాత్ర ఎలివేట్ అయ్యిందంటున్నారు.. దానికి మీ సమాధానం ఏమిటని ప్రశ్నించారు.
RRR Movie
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం ఎవరికైనా కష్టమే. కోస్టార్ పక్కనుండగా ఎవరూ అధికులమని చెప్పుకోలేరు. అలాగే గొప్పగా నటించినట్లు స్టేట్మెంట్స్ ఇవ్వలేరు. ఎన్టీఆర్(NTR), చరణ్ లను ఇరకాటంలో పెట్టిన ఈ ప్రశ్నకు చరణ్ చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడి డామేజ్ తగ్గించే ప్రయత్నం చేశారు.
ఆర్ ఆర్ ఆర్ మూవీ(RRR Movie)లో నా పాత్ర తారక్ కంటే బెటర్ గా ఎలివేట్ అయ్యిందంటే అసలు ఒప్పుకోను. సినిమాలో మా ఇద్దరి పాత్రలు అద్భుతంగా ఉన్నాయి. అందులోనూ ఎన్టీఆర్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. మాకు ఇలాంటి గొప్ప చిత్రం ఇచ్చినందుకు రాజమౌళి గారికి ధన్యవాదాలు చెబుతున్నాను, అన్నారు.
ఒకరిని ఇబ్బంది పెట్టాలనేది అక్కడ మీడియా ఉద్దేశం కాదు. కానీ గ్రౌండ్ లెవెల్ లో ఉన్న ఫ్యాక్ట్ ప్రశ్న రూపంలో అడిగారు. సాధారణంగా సొసైటీలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే ప్రశ్నలు నేరుగా వాళ్ళ ఎదుటే చర్చించరు. మరి ఉన్న విషయం కుండ బద్దలు కొట్టే మీడియాకు ఇవన్నీ పరిపాటి.
ఆర్ ఆర్ ఆర్ రూపంలో ఎన్టీఆర్ కెరీర్ పై రాజమౌళి దెబ్బేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఆర్ ఆర్ ఆర్ క్రెడిట్ నార్త్ ఇండియాలో రామ్ చరణ్, రాజమౌళి కొట్టేస్తే ఎన్టీఆర్ కి దక్కేది ఏమీ ఉండదు. దీంతో ఎన్టీఆర్ భవిష్యత్ పాన్ ఇండియా చిత్రాలకు మార్కెట్ లభించదు.
బాలీవుడ్ లో మార్కెట్ ఏర్పరుచుకున్న హీరోకి మాత్రమే పాన్ ఇండియా హోదా వస్తుంది. అది రాజమౌళి సినిమాలతో చాలా ఈజీ అన్న ఆలోచన అందరూ స్టార్స్ లో ఉంది. రాజమౌళి (Rajamouli)బ్రాండ్ వాల్యూతో నార్త్ లో గుర్తింపు తెచ్చుకోవచ్చనేది అందరికీ తెలిసిన సత్యం. మరి ఎన్టీఆర్ విషయంలో ఈ సూత్రం నిజమైందా లేదా అనేది త్వరలో తెలుస్తుంది.