- Home
- Entertainment
- సూపర్ స్టార్ కృష్ణ కూడా ఫెయిల్, ఇండియన్ సినిమాలో ఆ టాలీవుడ్ హీరో ఒక్కడే ది బెస్ట్..బాలీవుడ్ లెజెండ్ కామెంట్స్
సూపర్ స్టార్ కృష్ణ కూడా ఫెయిల్, ఇండియన్ సినిమాలో ఆ టాలీవుడ్ హీరో ఒక్కడే ది బెస్ట్..బాలీవుడ్ లెజెండ్ కామెంట్స్
ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు , సావిత్రి లాంటి దిగ్గజ నటీనటులు తమ నటనతో తెలుగు సినిమాకి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చారు.

SuperStar Krishna
ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు , సావిత్రి లాంటి దిగ్గజ నటీనటులు తమ నటనతో తెలుగు సినిమాకి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చారు. ఆ తర్వాత చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగార్జున కమర్షియల్ గా తెలుగు సినిమా స్థాయిని పెంచారు. ఇప్పుడు తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది.
Super Star Krishna
ఇండియన్ సినిమాలో పౌరాణిక పాత్రలు వేయాలంటే స్వర్గీయ నందమూరి తారకరామారావుకు మాత్రమే సాధ్యం అన్నట్లుగా అప్పట్లో పరిస్థితి ఉండేది. ఎన్టీఆర్ వేయని పౌరాణిక పాత్ర అంటూ లేదు. రాముడిగా, కృష్ణుడిగా, రావణుడిగా, దుర్యోధనుడిగా, అర్జునుడిగా ఇలా అన్ని పాత్రలో నటించారు. ఇక అప్పట్లో ప్రేమ కథా చిత్రాలు, ట్రాజడీ కథలు అంటే ఏఎన్నార్ కి మాత్రమే సాధ్యం అనేవారు.
Devadasu Movie
దేవదాసు చిత్రం వెనుక ఆసక్తికర చరిత్ర ఉంది. ఈ చిత్రంలో 1953లో అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి జంటగా నటించారు. ఒక దృశ్య కావ్యంలా ఉండే ఈ చిత్రానికి దేశం మొత్తం ఫిదా అయింది. ఏఎన్నార్ నటనకు ప్రశంసలు దక్కాయి. అయితే అదే సమయంలో అన్ని భాషల్లో దేవదాసు చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళంలో, హిందీలో కూడా ఈ చిత్రం తెరకెక్కింది. హిందీలో అప్పటి లెజెండ్రీ హీరో దిలీప్ కుమార్ నటించారు. హిందీ తో పాటు అన్ని భాషల్లో దేవదాసు చిత్రం అట్టర్ ఫ్లాప్ అయింది.
Devadasu Movie
కానీ తెలుగులో మాత్రమే ఆల్ టైం క్లాసిక్ హిట్ గా నిలిచింది. దానికి కారణం ఏఎన్నార్, సావిత్రి కెమిస్ట్రీ, వారి నటనే అని అంతా చెబుతుంటారు. దిలీప్ కుమార్ అయితే ఏఎన్నార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ సినిమాలో దేవదాసు పాత్రలో నటించాలి అంటే ఏఎన్నార్ కి మాత్రమే సాధ్యం, ఆయనే ది బెస్ట్ అని కామెంట్స్ చేశారు.
Dilip Kumar
కొన్ని దశాబ్దాల తర్వాత సూపర్ స్టార్ కృష్ణ దేవదాసు చిత్రాన్ని తెలుగులోనే రీమేక్ చేశారు. కానీ ఆ చిత్రం దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. ఇండియన్ సినిమాకి దేవదాసు అంటే ఏఎన్నార్ మాత్రమే అని తెలుగు ప్రేక్షకులు కూడా డిసైడ్ చేశారు.