- Home
- Entertainment
- టాలీవుడ్ వైపు బాలీవుడ్ భామలు.. ఇదే అదునుగా దూసుకెళ్తున్న సౌత్ బ్యూటీలు.. షాకింగ్ గా స్టార్ హీరోయిన్ల కదలికలు.!
టాలీవుడ్ వైపు బాలీవుడ్ భామలు.. ఇదే అదునుగా దూసుకెళ్తున్న సౌత్ బ్యూటీలు.. షాకింగ్ గా స్టార్ హీరోయిన్ల కదలికలు.!
‘బాహుబలి’, ‘పుష్ఫ’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో టాలీవుడ్ సత్తా ఏంటో బాలీవుడ్ కు తెలిసి వచ్చింది. దీంతో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ హీరోయిన్లూ షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అద్భుత అవకాశాలను వినియోగించుకుంటున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకుణె (Deepika Padukone) తొలిసారిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘ప్రాజెక్ట్ కే’లో నటిస్తున్న ఈ బ్యూటీ.. సౌత్ ఆడియెన్స్ ను వెండితెరపై అలరించనుంది. టాలీవుడ్ కు ఉన్న క్రేజ్, తెలుగు సినిమాలకు వస్తున్న రెస్పాన్స్ తో దీపికా టాలీవుడ్ వైపు అడుగులేస్తోంది. ఈ చిత్రం తర్వాత మున్ముందు తెలుగులో మరిన్ని భారీ చిత్రాల్లోనూ నటించే ఛాన్స్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
యంగ్ అండ్ గ్లామర్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon) గతంలో తెలుగు ప్రేక్షకులను అలరించింది. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి ‘వన్ నేనొక్కడినే’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరోసారి రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’లో నటిస్తోంది. ఈ చిత్రంలో హిందీలో రూపొందుతున్నా.. తెలుగు హీరో సరసన నటిస్తుండటంతో టాలీవుడ్ కు ఉన్న క్రేజ్ ను తెలియజేస్తోంది. ఈ సినిమా తర్వాత మరిన్నీ చిత్రాల్లోనూ కనిపించే అవకాశం లేకపోలేదంటున్నారు.
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే (Ananya Panday) ‘లైగర్’తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. తొలిచిత్రం కాస్తా బెడిసికొట్టినా.. ఈ బ్యూటీకి మాత్రం తగిన క్రేజ్ దక్కింది. సినిమాలో ఆమె ప్రాధాన్యత సరిగా లేదనే టాక్ వచ్చినా.. గ్లామర్ పరంగా, నటన పరంగా ఒకే అనిపించుకుంది. దీంతో దర్శకనిర్మాతలు కూడా ఈ బ్యూటీని అప్ కమింగ్ ఫిల్మ్స్ కు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన అన్నీ చిత్రాల్లో కంటే ‘లైగర్’ చిత్రంతోనే అనన్య పేరు ఎక్కువగా వినిపించింది.
స్టార్ కిడ్, బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Jahnvi Kapoor) కూడా టాలీవుడ్ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిత్రంలో నటించే ఛాన్స్ ను అందుకున్నట్టు తెలుస్తోంది. కానీ ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ సరసన నటించాల్సి ఉందని ‘కాఫీ విత్ కరణ్’షోలో తెలిపిన విషయం తెలిసిందే. ఈ లెక్కన త్వరలోనే టాలీవుడ్ లో జాన్వీ అడుగుపెట్టబోతోందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఇదే అదునుగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు హిందీలో వస్తున్న అవకాశాలను వినియోగించుకుంటున్నారు. తమకు వచ్చిన ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తున్నారు. ఈ వరుసలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ముందు వరుసలో ఉంది. ‘పుష్ఫ’ తర్వాత ప్రస్తుతం ఈ బ్యూటీ ఎక్కువ శాతం హిందీలోనే నటిస్తోంది. ‘గుడ్ బై’,‘మిషన్ మజ్ను’,‘యానిమల్’ లాంటి చిత్రాల్లో నటిస్తోంది.
మరోవైపు టాలీవుడ్ ను ఊపూపిన స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కూడా బాలీవుడ్ లో పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ‘ఫ్యామిలీ మేన్ 2’తో నార్త్ ఆడియెన్స్ ఆకట్టుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ దినేష్ విజన్ తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే స్టార్ హీరో వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్ అప్ కమింగ్ చిత్రాల్లోనూ నటిస్తున్న తెలుస్తోంది. ఇలా వరుస ఆఫర్లు అందుకుంటూ బాలీవుడ్ లో వెలిగే ప్రయత్నం చేస్తోంది.
బాలీవుడ్ లో ఊపూపుతున్న హీరోయిన్లలో టాలీవుడ్ బ్యూటీలు రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), తమన్నా భాటియా (Tamannaah Bhatia) పేర్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికే రకుల్ బాలీవుడ్ లో జెండా పాతిన విషయం తెలిసిందే. రీసెంట్ గా ‘ఎటాక్’, ‘రన్ వే 34’ చిత్రాలతో అలరించగా.. తాజాగా ‘కట్ పుట్లీ’ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక తమన్నా కూడా బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ ను అనౌన్స్ చేస్తుండగా.. ‘బబ్లీ బౌన్సర్’,‘బోలే చుడియా’,‘ప్లాన్ ఏ ప్లాన్ బీ’ చిత్రాలను రిలీజ్ కు సిద్ధం చేసింది. ఇలా టాలీవుడ్ క్రేజ్ కు బాలీవుడ్ హీరోయిన్లు ఇటువైపు మొగ్గుచూపుతుండగా.. అక్కడి ఆఫర్లను టాలీవుడ్ బ్యూటీలు దక్కించుకుంటున్నారు.