- Home
- Entertainment
- ఆలియా భట్, దీపికా నుంచి అనన్య పాండే,సాయి మంజ్రేకర్ వరకూ టాలీవుడ్ కు క్యూ కట్టిన బాలీవుడ్ బ్యూటీస్..
ఆలియా భట్, దీపికా నుంచి అనన్య పాండే,సాయి మంజ్రేకర్ వరకూ టాలీవుడ్ కు క్యూ కట్టిన బాలీవుడ్ బ్యూటీస్..
సీన్ రివర్స్ అయ్యింది. ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్లు .. బాలీవుడ్ లో సినిమాలు ఎప్పుడు చేద్దామా, ఎప్పుడుఆ చాన్స్ వస్తుందా అని వెయ్యి కళ్లతో వెయిట్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో సినిమా చేయడానికి వెంపర్లాడుతున్నారు బాలీవుడ్ హీరోయిన్లు. ఒక్క ఛాన్స్ ఫ్లీజ్ అంటున్నారు. అలా టాలీవుడ్ కి వలస వస్తున్న బాలీవుడ్ హీరోయిన్లపై ఓ లుక్కేద్దాం.

సౌత్ హీరోయిన్ల అల్టిమేట్ టార్గెట్ ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల్లో చెయ్యడమే. కానీ ఇప్పుడు టైమ్ మారింది. ఇండియన్ సినిమాకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉన్న టాలీవుడ్ ని వెతుక్కుంటూ వస్తున్నారు బాలీవుడ్ హీరోయిన్లు . వరసపెట్టి టాలీవుడ్ కి క్యూ కడుతున్నారు.
తెలుగు సినిమాల్లో నటించి తమ క్రేజ్ ని పాన్ ఇండియా మార్కెట్ ని పెంచుకోడానికి వరస పెట్టి టాలీవుడ్ బాట పట్టారు బాలీవుడ్ భామలు. లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా తెలుగులో తన రెండో సినిమాని అనౌన్స్ చేసింది.ఎన్టీఆర్,కొరటాల కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో ఎన్టీఆర్ కి జంటగా ఆలియా నటిస్తోంది. దీని కంటే ముందే ట్రిపుల్ఆర్ లో రామ్ చరణ్ కి జంటగా నటించి తెలుగు ఎంట్రీ కి రెడీ అయ్యింది.
టాప్ హీరోయిన్స్ తో పాటు అప్ కమింగ్ బాలీవుడ్ భామ అనన్య పాండే కూడా తెలుగు అరంగేట్రానికి అంతా సిద్దం చేసుకుంది. పూరీ జగన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లైగర్ మూవీ లో విజయ్ దేవరకొండకు హీరోయిన్ గా ఫిక్స్ అయిన అనన్యపాండే తెలుగు ఆడియన్స్ ని తన అందం, అభినయంతో మెస్మరైజ్ చెయ్యబోతోంది.
మరో బ్యూటి ఫుల్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ అయితే ఏకంగా 2 సినిమాలతో తెలుగులోకి వస్తోంది. మేజర్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరీ అధారంగా తెరకెక్కిన ..అడవి శేష్ మూవీ మేజర్ మూవీ తోపాటు , వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న గని సినిమా లో కూడా హీరోయిన్ గా మరో సినిమా ఆఫర్ కొట్టేసింది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో తెలుగులో బిజీ అయ్యింది సాయిమంజ్రేకర్
బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషి కూడా సౌత్ లో సందడి చేస్తోంది. అజిత్ , కార్తికేయ లీడ్ రోల్స్ లో రిలీజ్ అయిన యాక్షన్ ఎంటర్ టైనర్ వలిమై లో హ్యూమా ఖురేషి పోలీస్ ఆఫీసర్ గా కీ రోల్ ప్లే చేసింది. అంతేకాదు ప్రమోషన్లలో కూడా యాక్టివ్ రోల్ ప్లే చేసి తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది హ్యూమా ఖురేషి.
మరో స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ ..బేసిక్ గా సౌత్ అమ్మాయే అయినా ...బాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి టాప్ స్టార్ అయ్యింది. ఇప్పుడు దీపికా కూడా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. నాగాశ్విన్ -ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియామూవీ ప్రాజెక్ట్. కె సినిమాలో దీపికా పదుకోన్ ప్రభాస్ కి జంటగా నటిస్తోంది.
స్టార్ హీరోయిన్ల దగ్గరనుంచి అప్ కమింగ్ హీరోయిన్ల వరకూ సౌత్ సినిమాల మీద ఇంట్రస్ట్ చూపిస్తూ.. ఇండస్ట్రీ ఎంట్రీ కి రెడీ అయ్యారు. లేటెస్ట్ గా మిస్ యూనివర్స్ ఊర్వశి రౌతేలా నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తోందన్న వార్త లు స్పీడప్ అయ్యాయి.
బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ మరోసారి టాలీవుడ్ ని పలకరించబోతోంది. అప్పుడెప్పుడో మంచు మనోజ్ కరెంట్ తీగ సినిమాలో ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ చేసిన సన్నీ ..మరోసారి మంచు హీరో సినిమాలో కనిపించబోతోంది. మంచు విష్ను అప్ కమింగ్ మూవీ గాలి నాగేశ్వరరావు లో రోహిణి క్యారెక్టర్ చేస్తున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సన్నీ లియోన్ .
మరో క్రేజీ బాలీవుడ్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ .. సౌత్ మీద బాగా ఇంట్రస్ట్ చూపిస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు .. కన్నడ హీరో కిచ్చా సుదీప్ తో విక్రాంత్ రోణ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది జాక్విలిన్. అంతకుముందేప్రభాస్ తో సాహో లో బ్యాడ్ బాయ్ అంటూ స్పెషల్ సాంగ్ చేసిన జాక్విలిన్ ..ఇప్పుడు టాలీవుడ్ మీద ఫోకస్ చేసింది.
శ్రీదేవి కూతురు .. బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వి కపూర్ కూడా తెలుగు ఎంట్రీకి రెడీ అవుతోంది. ఎప్పటి నుంచో జాన్విని టాలీవుడ్ కి తీసుకురావాలని చాలా మంది ట్రై చేస్తున్నా.. ఆ ట్రయల్ ఇప్పటికి సక్సెస్ అవుతోంది. విజయ్ దేవరకొండ,పూరి కాంబినేషన్లో రెండో సినిమాగా తెరకెక్కబోతున్న జనగణమన సినిమాలో హీరోయిన్ గా జాన్వి ఫిక్స్ అయ్యినట్టు న్యూస్.