తమిళ సినిమాలతో కంగనా రనౌత్ బిజీ బిజీ, బాలీవుడ్ లో తగ్గిన సినిమాలు..
తమిళంలో ఫుల్ బిజీ అయిపోతుంది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. బాలీవుడ్ ను వదిలేస్తుందో ఏమో అన్న అనుమానం వచ్చేలా వరుస ప్రాజెక్ట్ లతో కోలీవుడ్ లో బిజీ అయిపోయింది కంగనా.
Kangana Ranaut
బాలీవుడ్ లో గొప్పగా నటించే హీరోయిన్లు ఎవరూ ఉంటే.. ముందు వరుసలో ఉంటుంది కంగనా రనౌత్. వరుస వివాదాలతో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సాధించి కంగనా.. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచింది. బాలీవుడ్ లో పలు విమర్శలు తెచ్చుకున్నా.. నటిగా మాత్రం ఆమె రేంజ్ వేరు. ఆమె వల్లే కొన్ని సినిమాలు సూపర్ హిట్లయిన సందర్భాలున్నాయి.
Kangana Ranaut
అయితే బాలీవుడ్ లో ఉన్న కొన్నివివాదాల కారణంగా ఆమె ఈ మధ్య కాస్త డల్ అయింది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం. నెపోటిజం, కాస్టింగ్ కౌచ్ లాంటి వాటిలో బాలీవుడ్ స్టార్స్ ను గట్టిగా విమర్షించడం.. బాలీవుడ్ లో ఏ ఇష్యూ జరిగినా ఘాటుగా స్పందించడం ఇలా ఆమె చేసిన పనులు బాలీవుడ్ కు కంగనాని కాస్త దూరంగా పెట్టేలా చేశాయి.
కానీ.. నాలుగైదేళ్ల క్రితం కంగనా అంటే ఓ సెపరేట్ ఇమేజ్ ఉండేది. ఆమె పట్టిందల్లా బంగారమే. ఆమె నటించిందంటే సినిమా పక్కా బ్లక్‌బస్టర్ హిట్ అంటూ ఓ అంచనాలు ఉండేవి. తను వెడ్స్ మను, క్వీన్, మణికర్ణిక వంటి సినిమాలు నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెట్టాయి. ఎవరు ఎలా ఉన్నా..? ఏమనుకున్నా.. తనసినిమాలు తాను చేసుకుంటూ వెళ్తోంది బ్యూటీ.
Image: Kangana Ranaut / Instagram
ఇక ప్రస్తుతం కంగనా మూడు సినిమాలను లైన్‌లో పెట్టింది. మరీ ముఖ్యంగా ఆమె తమిళంలో ఫుల్ బిజీ అవుతోంది. బాలీవుడ్ లో కన్నా తమిళంలోనే ఎక్కువ ఆఫర్స్ ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి.
తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ మరో తమిళ సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. ఇటీవలే తమిళ ప్రొడక్షన్ సంస్థలు ట్రైడెంట్ ఆర్ట్స్, అహింస ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఓ సినిమా నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.
అయితే ఆ సినిమా గురించి పూర్తిగా వివరాలు వెల్లడించకుండా.. ఓ తమిళ హీరో.. హిందీ హీరోయిన్ ఈ సినిమాలో భాగం కానున్నట్లు వెల్లడించింది. దాంతో ఆ బాలీవుడ్ హీరోయిన్ కంగనానే అని చెన్నై ఫిల్మ్ సర్కిల్ ల్లో టాక్ గట్టిగా వినిపిస్తుంది. మలయాళం దర్శకుడు విపిన్ దర్శకత్వ బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే కోలీవుడ్ లో వరుస సినిమాలు చేసుకుంటూ వస్తోంది బ్యూటీ జయలలిత బయోపిక్ లో మెరిసిన కంగనా రనౌత్.. చంద్రముఖి-2 సినిమాతో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈసినిమాలో చంద్రముఖిలా కంగనా 100 పర్సంట్ హైలెట్ అవుతుందంటున్నారు. మరీముఖ్యంగా తొలిపార్టులో జ్యోతిక పాత్ర ఏ రేంజ్‌లో ఉందో.. సీక్వెల్‌లో కంగనా రోల్ కూడా అంతే స్థాయిలో ఉంటుందట.
లారెన్స్ హీరోగా నటించిన చంద్రముఖి2 సినిమాకు పి. వాసు దర్శకుడు. ఈసినిమాలో కంగనా రనౌత్ సీన్స్ ప్రేక్షకులను వీర లెవల్లో భయపెడతాయని ఇన్‌సైడ్ టాక్. ఈ సినిమా సెప్టెంబర్ 19న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈసినిమాతో పాటు మరికొంత మంది నిర్మాతలు కంగనా రనౌత్ డేట్స్ కోసం ఎదరు చూస్తున్నట్టు తెలుస్తోంది.