- Home
- Entertainment
- కొంచెం ఫ్రెష్ కొంచెం మెస్... జాన్వీ కపూర్ డే అలా గడిచిందట, ఇంటర్నెట్ ని ఊపేస్తున్న ఫోటోలు!
కొంచెం ఫ్రెష్ కొంచెం మెస్... జాన్వీ కపూర్ డే అలా గడిచిందట, ఇంటర్నెట్ ని ఊపేస్తున్న ఫోటోలు!
జాన్వీ కపూర్ తన డే ఎలా గడిచిందో ఫ్యాన్స్ తో పంచుకున్నారు. షార్ట్ అండ్ స్వీట్ గా తన మూడ్స్ షేర్ చేశారు. జాన్వీ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది.

Janhvi Kapoor
జయాపజయాలతో సంబంధం లేకుండా జాన్వీ కపూర్ ఇండియా వైడ్ పాపులారిటీ రాబట్టారు. కేవలం అందచందాలతో అభిమాన వర్గాన్ని సంపాదించారు. ఇంస్టాగ్రామ్ వేదికగా జాన్వీ సూపర్ హాట్ టెంప్టింగ్ ఫోజులతో మనసులు దోచేస్తుంటారు. తాజాగా ఆమె తన దిన చర్యకు సంబంధించిన సిరీస్ ఆఫ్ ఫోటోలు ఫ్యాన్స్ తో షేర్ చేశారు.
Janhvi Kapoor
జాన్వీ కపూర్ తన అప్ కమింగ్ మూవీ మిస్టర్ అండ్ మిస్ మహి షూట్ లో పాల్గొన్నారు. అనంతరం తనకు ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ ఫోటోలు పెట్టారు. నెక్స్ట్ నెట్లో క్రికెట్ ప్రాక్టీస్ చేశారు. సూర్య కాంతిలో ఆటలాడి శరీరానికి విటమిన్ డి పొందారు.ఈ పనులన్నీ ముగించుకొని ఇంటికి చేరారు. ఈ పనులకు సంబంధించిన ఫోటోలన్నీ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
Janhvi Kapoor
జాన్వీ కపూర్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ పై నెటిజన్స్ కామెంట్స్ రూపంలో అభిమానం చాటుకుంటున్నారు. హార్ట్ ఇమోజీలు, లవ్ కామెంట్స్ జాన్వీ ఫోటోల కామెంట్ సెక్షన్ నింపేస్తున్నారు. ఇక సోషల్ మీడియా ఫ్రీక్ గా జాన్వీ తనకు సంబంధించిన ప్రతి విషయం అభిమానులకు తెలియజేస్తారు.
Janhvi Kapoor
ప్రస్తుతం జాన్వీ మిస్టర్ అండ్ మిస్ మహితో పాటు వరుణ్ ధావన్ కి జంటగా బవాల్ మూవీ చేస్తున్నారు. ఇవి రెండు చిత్రీకరణ జరుపుకుంటాయి. గత ఏడాది ఆమె మిల్లీ టైటిల్ తో ప్రయోగాత్మక చిత్రం చేశారు. సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మిల్లీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
Janhvi Kapoor
కాగా జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ పై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. చాలా కాలంగా ఆమెను సౌత్ నటింప చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. శ్రీదేవి కూతురిగా ఆమెకు సపరేట్ క్రేజ్ ఉంది. ఆమె నటించడం సినిమాలకు ప్రచారం తెచ్చిపెడుతుంది.
Janhvi Kapoor
అయితే ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్ నటించడం ఖాయమే అంటున్నారు. ఈ మేరకు మేకర్స్ ఆమెను లాక్ చేశారంటున్నారు. అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ... విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఆమెపై ఎన్టీఆర్ 30 యూనిట్ ఫోటో షూట్ కూడా నిర్వహించారట.
Janhvi Kapoor
దర్శకుడు కొరటాల శివ ఇప్పటి వరకు హీరోయిన్ ప్రకటన చేయలేదు. మొదట అలియా భట్ ని అనుకున్నారు. ఆమె వ్యక్తిగత కారణాలతో ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. మరొకరి పేరు వినిపించని నేపథ్యంలో జాన్వీ కన్ఫర్మ్ అనుకుంటున్నారు. మార్చి నుండి ఎన్టీఆర్ 30 రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.