- Home
- Entertainment
- సుకుమార్ కు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ మెసేజ్, అల్లు అర్జున్ చెప్పినట్టు జరిగిందిగా...
సుకుమార్ కు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ మెసేజ్, అల్లు అర్జున్ చెప్పినట్టు జరిగిందిగా...
అల్లు అర్జున్ చెప్పినట్టే జరిగింది. టాలీవుడ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ గురించి బన్నీ చెప్పిన మాటలు నిజం అయ్యాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హీరాణీ సుకుమార్ కు మెసేజ్ పెట్టాడు. ఇంతకీ ఆయన ఏమన్నాడు, బన్నీ ఏం చెప్పాడు. .

టాలీవుడ్ డైరెక్టర్లలో.. లెక్కల మాస్టర్ సుకుమార్‌ది ప్రత్యేక శైలి. కథ నుంచి స్క్రీన్ ప్లే వరకూ.. ఆయన పనితీరు చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆయన శిశ్యులతో పాటు.. ఆయనతో కలిసి ట్రావెల్ చేస్తోన్న డైరెక్టర్లు కూడా.. సుకుమార్ నుంచి చాలా టెక్నిక్స్ నేర్చుకోవచ్చు అంటుంటారు.
సుకుమార్ నుంచి చాలా నేర్చుకోవచ్చు అని మాటలు పుష్ప విడుదలకు ముందు జరిగిన ప్రెస్‌మీట్‌లో అల్లు అర్జున్ స్వయంగా అన్నారు. అంతే కాదు పుష్ప తరువాత ప్యాన్ ఇండియా స్థాయిలో దర్శకులు సుకుమార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు కూడా. సినిమాని తెరకెక్కించడంలో సుకుమార్ ను చూసి అందరూ.. కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటారు... ఇదే జరగకపోతే మైత్రి ఆఫీస్ దగ్గర చొక్కా తీసి తిరుగుతా అని బన్నీ శపథం కూడా చేశారు. ఇక అచ్చంగా బన్నీ చెప్పినట్టే జరిగింది. సుకుమార్ నుంచి చాలా నేర్చుకోవాలి అని సాక్ష్యాత్తు.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి స్వయంగా అన్నారు.
ఇటీవల బాలీవుడ్ బడా డైరక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ సుకుమార్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. సుక్కు ఫోన్ నంబర్ తీసుకుని మరీ ఆయనకు మెసేజ్ పంపారు.అందరూ ఆశ్చర్యపోయేలా రాజ్ కుమార్ సుకుమార్ పనితనాన్ని పొగిడారు. ఇంతకీ సుకుమార్ కు రాజ్ కుమార్ హిరాణి ఏమని మెసేజ్ పెట్టారంటే..?
గుడ్ మార్నింగ్ సుకుమార్ గారు. నేను రాజు హిరాణీ పుష్ప సినిమా చూసినప్పటి నుంచీ మీతో మాట్లాడాలనుకుంటున్నా. మీ నంబర్ నా దగ్గర లేఉద. శుక్రవారం మహావీర్ జైన్‌ని కలిశా. మీ గురించి ఇద్దరం చాలా మాట్లాడుకున్నాం. అలా ఆయన్నుంచీ మీ ఫోన్ నంబర్ దొరికింది. పుష్ప ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.ఈ సినిమా గురించి నేను ఎంతోమందికి చెప్పాను. నా మాటలు విని చాలామంది నాకేదో అయిందనుకుని ఆశ్చర్యంగా చూశారు.
కథ నుంచి సీన్ టు సీన్ మీరు తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉంది. అల్లు అర్జున్ నటన, పాటలు, నేపథ్య సంగీతం ఇలా అన్ని చక్కగా కుదిరి మంచి ఎంటర్‌టైనర్ అయింది. నేను సినిమాను చాలా ఎంజాయ్ చేశా. మీరు ఇలాంటి అద్భుతాలు మరెన్నో చేయాలి. మిమ్మల్ని ఓసారి కలవాలనుకుంటున్నా. ముంబైకి వస్తే నాకు ఫోన్ చేయండి అని రాజ్‌కుమార్ హిరాణీ మెసేజ్ చేశారు.
దీనికి సుకుమార్ స్పందించారు. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్‌గా చెప్పుకునే మీ నుంచి సందేశం రావడం నాకెంతో ఆనందంగా ఉంది. మీరు పంపించిన సందేశం నా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం వల్ల రిప్లై లేట్ అయింది. ఫిల్మ్ మేకింగ్, కథ రాయడంలో మీరు నాకెంతో స్ఫూర్తి అంటూ.. సుకుమార్ తిరిగి మెసేజ్ పెట్టారు.