ఎన్టీఆర్ కారుతో హాట్ టాపిక్.. సెలెబ్రిటీల కాస్ట్లీ కార్లు ఇవే, అతడి వద్ద బాంబ్ ప్రూఫ్ కారు
సినీ తారలు ఏం చేసినా అభిమానులు మురిసిపోతుంటారు. తమ అభిమాన నటుడు కొత్త కారు కొంటే తామే కొన్నంత సంతోషం పొందుతారు అభిమానులు.
సినీ తారలు ఏం చేసినా అభిమానులు మురిసిపోతుంటారు. తమ అభిమాన నటుడు కొత్త కారు కొంటే తామే కొన్నంత సంతోషం పొందుతారు అభిమానులు. ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన గ్యారేజ్ లో కొత్త కారుని చేర్చాడు.
ఎన్టీఆర్ విదేశాల నుంచి లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్స్యూల్స్ కారుని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మోడల్ కారుని కొన్న తొలి ఇండియన్ గా ఎన్టీఆర్ రికార్డ్ సృష్టించాడు. దీనితో ఎన్టీఆర్ కొన్న కారు పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కారు ఖరీదు 3.5 కోట్ల వరకు ఉంటుంది. ఎన్టీఆర్ ఈ కొత్త కారు కొన్న తర్వాత సెలెబ్రిటీల కాస్ట్లీ కార్ల విషయంలో సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు కూడా ఖరీదైన కార్లంటే మోజే. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కార్లలో ఒకటిగా గుర్తింపు పొందిన బుగాటి వెరావ్ కారుని షారుఖ్ వాడుతున్నారు. ఈ కారు గంటకు 400 కిమీ వేగంతో దూసుకువెళ్లగలదు.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఉపయోగించే కారుకి ఓ ప్రత్యేకత ఉంది. అమీర్ ఖాన్ మెర్సిడెజ్ బెంజ్ 600 కారు ఓనర్. ఈ కారుకి ఓ ప్రత్యేకత ఉంది. ఈ కారు బాంబ్ ప్రూఫ్. అమీర్ ఖాన్ సత్యమేవ జయతే కార్యక్రమం చేస్తున్న టైంలో అతడికి బెదిరింపులు వచ్చాయి. దీంతో అమీర్ ఖాన్ ఈ బాంబ్ ప్రూఫ్ కారుని ఉపయోగిస్తున్నారు.
సూపర్ హీరో హృతిక్ రోషన్ కి కూడా కార్లంటే మక్కువే. హృతిక్ రోషన్ రోల్స్ రాయ్స్ ఘోస్ట్ సిరీస్ II కారుని ఉపయోగిస్తున్నాడు. ఈ కారు విలువ రూ 7 కోట్ల వరకు ఉంటుందట.
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ రోల్స్ రాయిస్ కల్లినన్ మోడల్ కారుని ఉపయోగిస్తున్నాడు. ఈ కారు ధర కూడా 7 కోట్ల వరకు ఉంటుంది.