- Home
- Entertainment
- ఒంటిపై దుస్తుల్లేకుండా షాక్ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ.. భర్తతో రొమాంటిక్ పిక్స్ ను షేర్ చేసిన మౌనీ రాయ్..
ఒంటిపై దుస్తుల్లేకుండా షాక్ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ.. భర్తతో రొమాంటిక్ పిక్స్ ను షేర్ చేసిన మౌనీ రాయ్..
‘బ్రహ్మస్త్ర’ బ్యూటీ మౌనీ రాయ్ (Mouni Roy) స్టన్నింగ్ ఫొటోలను షేర్ చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. అందాల విందులో నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది. భర్తతో వేకేషన్ లో ఉన్న ఈ బాలీవుడ్ బ్యూటీ రొమాంటిక్ పిక్స్ ను పంచుకుంది.

‘నాగిని’ ఫేమ్ మౌనీ రాయ్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జనవరి 27న తన ప్రియుడు, ప్రముఖ వ్యాపార వేత్త సూరజ్ నంబియార్ తో మౌనీ రాయ్ పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా ఈ బ్యూటీ కేరీర్ ను కొనసాగిస్తూనే ఉంది.
ఈ బ్యూటీ బాలీవుడ్ లోని పల చిత్రాల్లో స్పెషల్ అపియరెన్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటూనే ఉంది. అందాలను విందు చేస్తూ తన పాపులారిటీని పెంచుకుంటోంది. అదేవిధంగా బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్నంటున్న చిత్రం ‘బ్రహ్మస్త’. ఈ చిత్రంలో మౌనీ రాయ్ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది.
నాగినిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న మౌనీరాయ్ ‘బ్రహ్మస్త్ర’లో కీలక పాత్రను పోషిస్తోంది. దీంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. దీంతోపాటు ఇటు సోషల్ మీడియాలోనూ మౌనీరాయ్ ఫ్యాన్స్, ఫాలోవర్స్ కు టచ్ లోనే ఉంటోంది. ఈమేరకు తన వ్యక్తిగత విషయాలను వారితో పంచుకుంటూ మరింత దగ్గరవుతోంది.
తాజాగా తన భర్తతో వేకేషన్ లో ఉన్న ఈ బ్యూటీ స్టన్నింగ్ పిక్స్ ను షేర్ చేసింది. సీ హౌజ్ లో బెడ్ పై కూర్చొని ఒంటిపై బట్టలు లేకుండా ఫొటోలకు ఫోజులిచ్చింది. బ్యాక్ అందాలను చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ ఏడాదిలో పెళ్లి అయినప్పటి నుంచి మౌనీ రాయ్ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్ట్ లు పెడుతోంది. ముఖ్యంగా తన భర్తతో కలిసి వేకేషన్స్ ను ఎంజాయి చేస్తున్న పిక్స్ ను అభిమానులతో పంచుకుంటోంది. మరోవైపు తన దాంపత్య జీవితాన్ని కూడా హ్యాపీగా లీడ్ చేస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ (Ranbir Kapoor), అలియా భట్ జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మస్త్ర’ తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. ‘నాగిని’ డైలీ సీరియల్ తర్వాత ఈ బ్యూటీ మళ్లీ ఈ భారీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. అలాగే ‘మాయాజాలా’ అనే మరో హిందీ ఫిల్మ్ లోనూ కీ రోల్ లో నటిస్తోంది.