Kriti Sanon : ఇద్దరు సీనియర్ హీరోయిన్లున్నా.. అన్నీ తానై చూసుకుంటున్న కృతి సనన్
కృతి సనన్ (Kriti Sanon) లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. స్టార్ హీరోయిన్ ఫ్యాషన్ సెన్స్ తో ఫిదా చేస్తోంది. మరోవైపు తనకున్న క్రేజ్ తో మెంటల్ ఎక్కిస్తుండటం ఆసక్తికరంగా మారింది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతిసనన్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం. టాలీవుడ్ లోనూ పలు చిత్రాలు చేసి ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. తన నటనతో అలరించింది.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
‘దోచేయ్’, ‘వన్ :నేనొక్కడినే’ వంటి చిత్రాలతో గతంలో అలరించింది. చివరిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సరసన ‘ఆదిపురుష్’ (Adipurush)లో నటించి మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ అయ్యింది.
ఇక తాజాగా కృతి సనన్ నటించిన చిత్రం ‘క్రూ’ (Crew). ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు.
ఈ చిత్రంలో మరో ఇద్దరు సీనియర్ హీరోయిన్లు కరీనా కపూర్ (Kareena Kapoor), టబు (Tabu) కూడా నటించడం విశేషం. అయితే ప్రమోషన్స్ లో మాత్రం వారిద్దరూ చాలా తక్కువగా కనిపిస్తున్నారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను ప్రస్తుతం కృతి సనన్ అన్నీ తానై ప్రమోట్ చేస్తోంది. ఆడియెన్స్, ఫ్యాన్స్ ను మెప్పించేలా ఈవెంట్లలో స్పీచ్ లు ఇరగదీస్తోంది. సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లతో అదరగొడుతోంది. లేటెస్ట్ ఫ్యాషన్ ను పరిచయం చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈమె పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.