- Home
- Entertainment
- సుహాస్ మూవీ షూటింగ్ లో ప్రమాదం, పడవ బోల్తా.. కోటి రూపాయలు సముద్రం పాలు, ప్రాణాలు ఎలా కాపాడుకున్నారో తెలుసా
సుహాస్ మూవీ షూటింగ్ లో ప్రమాదం, పడవ బోల్తా.. కోటి రూపాయలు సముద్రం పాలు, ప్రాణాలు ఎలా కాపాడుకున్నారో తెలుసా
హీరో సుహాస్ నటిస్తున్న తమిళ చిత్రంలో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. షూటింగ్ కోసం సముద్రంలోకి కెమెరా ఇతర సామాగ్రి తరలిస్తున్న పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.

కమెడియన్ గా కెరీర్ ప్రారంభం
కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోగా దూసుకుపోతున్నాడు సుహాస్. తక్కువ సమయంలో సుహాస్ నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిపోయాడు. సుహాస్ కామెడీ టైమింగ్ బావుంటుంది. కానీ హీరోగా అవకాశాలు రావడంతో ప్రస్తుతం సుహాస్ కామెడీ పాత్రలు బాగా తగ్గించారు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్, ప్రసన్న వదనం లాంటి తక్కువ బడ్జెట్ చిత్రాలతో సుహాస్ వరుస విజయాలు అందుకుంటున్నాడు.
సుహాస్ నటిస్తున్న తమిళ చిత్రం
హిట్ 2 మూవీలో సుహాస్ విలన్ గా నటించి మెప్పించాడు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రంలో గెస్ట్ రోల్ లో మెరిశాడు. ప్రస్తుతం సుహాస్ తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్ర టైటిల్ మండాడి. ఈ మూవీలో సుహాస్ తోపాటు సూరి కూడా నటిస్తునారు. మాతి మారన్ ఈ చిత్రానికి దర్శకుడు. మండాడి మూవీ విషయంలో చిత్ర యూనిట్ వైవిధ్యమైన అప్రోచ్ ఫాలో అవుతోంది. ఈ మూవీ తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. రెండు భాషల వెర్షన్స్ షూటింగ్ ఒకేసారి జరుగుతోంది. తమిళంలోసూరి హీరో కాగా సుహాస్ విలన్.. తెలుగు వెర్షన్ లో సుహాస్ హీరోగా సూరి విలన్ గా నటిస్తున్నారు.
మండాడి షూటింగ్ లో పడవ బోల్తా
తాజాగా ఈ చిత్ర షూటింగ్ లో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. తమిళనాడులోని తొండి సముద్ర తీర ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నారు. సముద్రంలో చిత్రీకరించే సన్నివేశాలు ఈ మూవీలో చాలా ఉన్నాయి. దీనితో చిత్ర సిబ్బంది 60 లక్షల విలువైన రెడ్ డిజిటల్ కెమెరా, ఇతర సామాగ్రిని సముద్రంలోకి పడవలో తరలిస్తుండగా ప్రమాదం జరిగింది.
కోటి రూపాయల సామాగ్రి సముద్రం పాలు
ఒక్కసారిగా పడవ బోల్తా పడడంతో 60 లక్షల విలువైన కెమెరా సముద్రంలో మునిగిపోయింది. మరికొంత సామాగ్రి కూడా మునిగిపోయింది. మొత్తం కోటి రూపాయల విలువైన సామాగ్రి సముద్రం పాలు అయినట్లు తెలుస్తోంది. అయితే పడవలో ఉన్న సిబ్బందిని పక్కనే మరో పడవలో ఉన్న సిబ్బంది రక్షించారు. దీనితో ప్రాణాపాయం తప్పింది.
పడవ సముద్రంలో మునిగిపోతున్న దృశ్యాలు
పడవ సముద్రంలో మునిగిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుహాస్ కి ఇది తమిళ డెబ్యూ మూవీ. సుహాస్, సూరితో పాటు ఈ చిత్రంలో సత్యరాజ్, మహిమా నంబియార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.