- Home
- Entertainment
- `మగధీర`కి, `బింబిసార`కి లింక్.. రెండో పార్టే కాదు, సూపర్ మ్యాన్ సిరీస్‌లా..ప్లాన్ అదిరిందిగా!
`మగధీర`కి, `బింబిసార`కి లింక్.. రెండో పార్టే కాదు, సూపర్ మ్యాన్ సిరీస్‌లా..ప్లాన్ అదిరిందిగా!
ఇప్పుడు అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ గా ఉన్న `బింబిసార`కి,రాజమౌళి రూపొందించిన `మగధీర`కి లింక్ ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు రెండో పార్ట్ కూడా రాబోతుందట. దర్శకుడు వశిష్ట ఆ సీక్రెట్స్ ని బయటపెట్టారు.

కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం `బింబిసార`(Bimbisara)పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ట్రైలర్‌తో అంచనాలు పెరిగాయి. సినిమా ఎలా ఉండబోతుందో అనే ఉత్కంఠ నెలకొంది. కొందరు `బాహుబలి`, మరికొందరు `మగధీర`తో కంపేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు వశిష్ట క్లారిటీ ఇచ్చాడు. అనేక ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు.
`బింబిసార` కథకి మూలం `మగధీర`(Magadheera) చిత్రమే అని తెలిపారు దర్శకుడు వశిష్ట. ఆ సినిమా కారణంగానే ఈ చిత్ర కథ పుట్టిందన్నారు. `2018లో `బింబిసార` జర్నీ ప్రారంభమైంది. సాధారణంగా ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఏదో కాలంలోకి వెళ్లినట్లు చూపించారు. కానీ ఇదే కాలానికి చెందిన ఓ రాజు మరో పీరియడ్‌లోకి వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో నుంచే `బింబిసార` కథ పుట్టింది. ఈ కథ అనుకున్నప్పుడు ఓ రకంగా `మగధీర`నే స్ఫూర్తిగా తీసుకున్నట్టు చెప్పారు.
`మన దేశాన్ని పాలించిన మన రాజులు ఎవరున్నారు అని ఆలోచించినప్పుడు బింబిసారుడు గురించి తెలిసింది. ఆ పేరు కూడా స్ట్రైకింగ్‌గా అనిపించింది. అయితే ఇది పూర్తిగా కల్పిత కథ. చరిత్రలో ఉన్న బింబిసారుడికి ఈ కథకి సంబంధం లేదు. బింబిసారుడు అనే రాజు 500 సంవత్సరాలకు ముందు పరిపాలించారు. ఆయనకు సంబంధించిన వివరాలేవీ తెలియదు. కాబట్టి నేను కొత్తగా నేర్చుకుంటూ దాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశాను. ఓరకంగా చెప్పాలంటే నేను ప్రతిరోజూ టైమ్ ట్రావెల్ చేసినట్లు నాకు అనిపించేది` అని తెలిపారు.
ఇక ఈ చిత్రానికి సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు వశిష్ట(Vashist). రెండో పార్ట్ కూడా ఉన్నట్టు తెలిపారు. సినిమా ప్రారంభంలోనే రెండు పార్ట్ లుగా కథ రెడీ చేశామన్నారు. అయితే మొదటి భాగానికి సంబంధించి రిజల్ట్ తో సంబంధం లేకుండా రెండో పార్ట్ ఉంటుందని చెప్పారు. మరోవైపు దీనికి సంబంధించిన లైన్స్ ఉన్నాయని, దీన్ని రెండు, మూడు, నాలుగు భాగాలుగా తీయాలనుకుంటున్నట్టు చెప్పారు. ఓ సూపర్ మ్యాన్ సిరీస్‌లా ప్లాన్ చేసినట్టు చెప్పారు దర్శకుడు.
`బాహుబలి`, `మగధీర` వంటి చిత్రాలతో `బింబిసార`ని పోల్చడం చాలా హ్యాపీగా ఉందని, అయితే వాటితో పోల్చితే ఈ సినిమా డిఫరెంట్ అని, `మగధీర`కి కాస్త దగ్గరగా అనిపిస్తుందన్నారు. కానీ కథ పరంగా ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్‌కి జోడీగా సంయుక్త మీనన్, కేథరిన్ నటించారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఫాంటసీ అంశాలతో ఈ చిత్రం సాగబోతున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 5న సినిమా విడుదల కానుంది.