అరియానాకి చుక్కలు చూపించిన దెయ్యం.. రాత్రి సమయంలో సోహైల్, అఖిల్ ఏం చేశారంటే?
బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో 81వ రోజు కూడా దెయ్యం గేమ్ కొనసాగింది. హర్రర్ సినిమా చూపిస్తూ కన్‌ఫెషన్ రూమ్‌కి పిలిచి మరింత భయపెట్టింది దెయ్యం జలజ. ఈ ఎపిసోడ్ ఆద్యంతం నవ్వులు పూయించింది. మరి ఇంతకి ఏమేం జరిగిందంటే?
మొదట నిన్న జరిగిన అభిజిత్ విషయంలో తన బాధని హారిక వద్ద వ్యక్తం చేసింది మోనాల్. అభిజిత్ ప్రవర్తనపై మరోసారి విచారాన్ని వ్యక్తం చేసింది. అనంతరం అఖిల్‌తోనూ డిస్కష్ చేసింది. ఆయనతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, వ్యక్తిగా ఆయన ఎలా ఉంటాడో తనకు అనవసరం అని, నాతో ఎలా ఉంటున్నారనేది తాను చూస్తానని తెలిపారు.
మోనాల్ సైతం తాను ఎవరితోనైనా మాట్లాడుతున్నాననంటే, అది మంచి ఫీలింగ్‌తోనే అని గొడవలకు కాదని చెప్పింది. ఇలా అభిజిత్‌తో కాసేపు మంచి, మరికాసేపు అఖిల్ దగ్గరకు వెళ్తు మోనాల్ కన్‌ఫ్యూజన్‌కి గురి చేస్తుంది.
బిగ్‌బాస్ ఇంటిసభ్యులను మనుషులుగా, దెయ్యాలుగా విభజింగ్ టాస్క్ ఇచ్చాడు. మనుషులు హౌజ్‌లో ఉన్న దెయ్యం బొమ్మలను తీసి వాటర్‌లో పడేయాలని, దాన్ని దెయ్యాలు ఆపాలని తెలిపాయి. అరియానా, అవినాష్, సోహైల్ దెయ్యాలుగా ఉన్నారు. ఈ క్రమంలో సభ్యులు రెండు దెయ్యం బొమ్మలను వాటర్‌లో పడేశారు. కానీ ఓ బొమ్మని పూర్తిగా పడేయలేకపోయారు. సగం దెయ్యాలు చించుకుని బయటపడేశాయి.
ఆ తర్వాత సభ్యులకు హర్రర్ సినిమాలు చూపించారు. `12వ అంతస్తు` సినిమాని చూపిస్తూ, మధ్యలో ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూమ్‌లో ఏర్పాటు చేసిన డ్రాకుల్లా డెన్‌లోకి పిలిచారు. చీకటి గదిలో స్పూన్‌ను తీసుకోవాలని సూచించారు. ముందుగా అరియానా, అవినాష్‌ను పిలువగా భయంతో వణికిపోయారు.
మొదట అరియానా, అవినాష్‌లను పిలిచారు. వీరిద్దరు భయపడుతూ లోపలికి వెళ్ళారు. స్పూన్ తీసుకురాకుండానే బయటకు వచ్చేశారు.
మోనాల్‌ని పిలవగా, ఆమె లోపలికి వెళ్లి లైట్ వేస్తేనే లోపలికి వస్తా అని తెలిపింది. పదే పదే అలానే అనింది. ఆ తర్వాత స్పూన్ తీసుకుని వచ్చింది.
ఇక సోహైల్, అఖిల్ లను ఒకేసారి పిలించింది. ఇద్దరికి చుక్కలు చూపించింది. కానీ వీరిద్దరు భయపడ్డారు. భయపడనట్టు యాక్ట్ చేశారు. వీరి ఎపిసోడ్ బాగా నవ్వించింది. అయితే సోహైల్‌ని బయట మోనాల్ ఇమిటేట్ చేయడం మరింత ఆకట్టుకుంది.