శివాజీ పెద్ద కొడుకు కష్టం వృధా.. బిగ్ బాస్ ఓడిపోయిన దానికంటే అదే పెద్ద బాధ
బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగింది ? కనీసం రన్నరప్ గా ఉండాల్సిన తాను మూడవ స్థానంలో ఎందుకు సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. శోభా శెట్టితో గొడవ.. నాగార్జునతో వాగ్వాదం లాంటి అన్ని విషయాలపై శివాజీ క్లారిటీ ఇస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 7 ముగిసింది. కానీ ఆ హీట్ ఇంకా తగ్గలేదు. బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే తర్వాత బయట జరిగిన అల్లర్లు, వాహనాలపై దాడులతో సరికొత్త వివాదం రాజుకుంది. తన అభిమానులని పల్లవి ప్రశాంత్ రెచ్చగొట్టేలా వ్యవహరించాడని, పోలీసులకు సహకరించలేదని అతడిని అరెస్ట్ చేశారు. అయితే పల్లవి ప్రశాంత్ బెయిల్ పై బయటకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పల్లవి ప్రశాంత్ కి హౌస్ లో సపోర్ట్ ఇచ్చిన నటుడు శివాజీ బయటకి వచ్చిన తర్వాత కూడా అదే రిలేషన్ మైంటైన్ చేస్తున్నాడు.
ప్రశాంత్, యావర్, తాను కలసి ఒక చిత్రంలో నటిస్తామని శివాజీ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగింది ? కనీసం రన్నరప్ గా ఉండాల్సిన తాను మూడవ స్థానంలో ఎందుకు సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. శోభా శెట్టితో గొడవ.. నాగార్జునతో వాగ్వాదం లాంటి అన్ని విషయాలపై శివాజీ క్లారిటీ ఇస్తున్నారు.
శివాజీ హౌస్ నుంచి బయటకి వచ్చాక ఆయన నటించిన 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ఈటివి విన్ ఓటిటిలో జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో శివాజీ వరుసగా యూట్యూబ్ ఛానల్స్ లో, టివి ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.
బిగ్ బాస్ చివరి వారాల్లో తనని తగ్గించి అమర్ దీప్ ని హైలైట్ చేశారని అందువల్లే తాను 3 వ ప్లేస్ కి వెళ్లినట్లు శివాజీ పేర్కొన్నారు. అమర్ దీప్ వరుసగా ఫౌల్ గేమ్స్ ఆడినప్పటికీ బిగ్ బాస్ అతడికే ప్రాధాన్యత ఇవ్వడం బాధించింది అని అన్నారు. తాను బిగ్ బాస్ విజేతగా నిలుస్తానని నా ఫ్యామిలీ బాగా ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా నా కొడుకులు ఇద్దరూ నేను విజేత అవుతానని ఎదురుచూశారు.
కానీ అది జరగలేదు. ఫినాలే రోజు నా కొడుకులు ఇద్దరూ వేదికపైకి రావడం ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. నేను టైటిల్ గెలవాలని నా పెద్ద కొడుకు బయట ఎంతో కష్టపడ్డాడు. ప్రమోషన్స్ మొత్తం వాడే చేశాడు. కానీ నేను టైటిల్ గెలవలేదు. వాడి కష్టం మొత్తం వృధా అయింది.
నేను అభిమానుల మనస్సులో గెలిచానని సంతోషం ఉంది. టైటిల్ గెలవలేదనే బాధ కంటే నా కొడుకు కష్టం వృధా అయిందనే బాధ ఎక్కువగా ఉన్నట్లు శివాజీ పేర్కొన్నారు. శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.