నిఖిల్ నుంచి శివ బాలాజీ వరకు.. బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఎవరు..? ఏం చేస్తున్నారు..?
రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంప్లీట్ అయ్యింది. కన్నడ నటుడునిఖిల్ విజేతగా నిలిచాడు. తెలుగు బిగ్ బాస్ లో 8వ విజేత నిఖిల్. మరి మిగతా 7 సీజన్ల విన్నర్స్ ఎవరోగుర్తున్నారా..? వాళ్లు ఇప్పుడు ఏం చేస్తున్నారు.
ఈ సారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా నడిచింది. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో అదరగొట్టారు. గ్రాండ్ ఫినాలే నిన్న భారీ ఎత్తున జరిగింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేతగా నిఖిల్ నిలిచాడు. చివరి వరకు గౌతమ్ విన్నర్ అవుతాడు అనుకున్నారు అంతా. కాని నిఖిల్ విన్నర్ గా..గౌతమ్ రన్నర్ గా నిలిచాడు. ఇక సీజన్ 8 గ్రాండ్ ఫినాలే కి ముఖ్య అతిధిగా వచ్చారు మెగా పవర్ స్టార్ గ్లోబల్ హీరో రామ్ చరణ్. విజేతకు ట్రోఫీ తో పాటు 55 లక్షల చెక్ ను కూడా అందించారు.
బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ గా నిఖిల్ నిలవగా.. సీజన్ 8 కంటే ముందు జరిగిన గత 7 సీజన్ ల విన్నర్స్ ఎవరు వారు ఏం చేస్తున్నారు తెలుసుకుందాం.. ముందుగా గత సీజన్ అంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. యూట్యూబర్.. రైతుగా హౌస్ లోకి వచ్చి రచ్చ రచ్చ చేశాడు. టైటిల్ గెలిచిన తరువాత కూడా బయట అతను చేసిన గొడవకు.. ఈసీజన్ లో విన్నర్స్ ర్యాలీలు చేయకూడదని పోలీస్ బందోబస్త్ పెట్టారు.
ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విన్నర్ గా నిలిచాడు సింగర్ రేవంత్. రన్నర్ గా శ్రీహాన్ విన్ అయ్యాడు. నిజానికి 40లక్షల ప్రైజ్ మనీ తీసుకోవడంతో శ్రీహాన్ విన్నర్ నుంచి రన్నర్ అయ్యాడు. ఆ ప్రైజ్ మనీ తీసుకోకుండా ఉండి ఉంటే శ్రీహాన్ విన్నర్ అయ్యేవాడు. అక్కడ రాంగ్ స్టెప్ వేయడంతో రేవంత్ కు టైటిల్ వెళ్లింది.
విన్నర్ బెనిఫిట్స్ కూడా అతినికే వెల్లాయి. 40 లక్షలతో శ్రీహాన్ సరిపెట్టుకోవలసి వచ్చింది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ సింగర్ అయిన రేవంత్ ఎన్నో పాటలు పాడి, ఎన్నో అవార్డ్స్ కూడా సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్ న్ కు కూడా నాగార్జున హోస్ట్ గా చేశారు.
ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ గా వీజే సన్నీ కప్పు గెలుచుకున్నాడు. జర్నలిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. మోడలింగ్ చేసుకుంటూ.. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు సన్ని. అలాగే కళ్యాణ వైభోగం వంటి పాపులర్ సీరియల్స్‌లో నటించారు. ఈ సీరియల్ తోనే ఆయనకి బిగ్ బాస్ అవకాశం వచ్చింది. ప్రస్తుతం హీరోగా చిన్న చిన్న సినిమాలు చేసుకుంటున్నాడు సన్ని.
Bigg Boss Abijeet
ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విన్నర్ గా అభిజిత్ విన్ అయ్యాడు. చాలామంది అభిజిత్ విన్ అవ్వకుండా వెనక్కి లాగాలి అని చూశారు.కాని ఒక్కడే ఒంటరి పోరాటం చేసి విన్ అయ్యాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో పాపులర్ అయిన ఈ కుర్రాడు..హౌస్ లో ఎక్కడా కాస్త కూడా స్లిప్ అవ్వకుండా..నోరు జారకుండా జాగ్రత్తగా తెలివిగా గేమ్ ఆడాడు. అభిజిత్ కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కాని ఆతరువాత సినిమాలు చేయలేదు అభిజిత్.. ట్రావెలర్ గా మారి దేశ విదేశాలుతిరుగుతున్నాడు. లైఫ్ ను ఏంజాయ్ చేస్తున్నాడు.
ఇక కింగ్ నాగార్జున హోస్టింగ్ చేయడంస్టార్ట్ చేసిన సీజన్ 3 చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఈ సీజన్ విన్నర్ గా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గెలిచాడు. ఫోక్ సింగర్ గా.. వీడియో సాంగ్స్ చేసిన రాహుల్.. ఆతరువాత సినిమాల్లో పాటలు పాడటంస్టార్ట్ చేశాడు.
ఈసీజన్ లో పునర్నవితో లవ్ ట్రాక్ నడిపాడు రాహుల్. బయటకు విన్నర్ గా బయటకు వెళ్లాక అష్షురెడ్డితో ఎఫైర్ నడిపించాడు. ఇక బయటకు వచ్చాక టాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన రాహుల్.. ఆర్ ఆర్ ఆర్ లోని నాటు నాటు పాటకు ఆస్కార్ కూడా వరించింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విన్నర్ గా కౌశల్ విన్ అయ్యాడు. ఈ సీజన్ కూడా రచ్చ రచ్చ అయ్యింది. కౌశల్ బయట మనుషులను పెట్టి చేసిన హడావిడి. కౌశల్ అర్మీఅనేపేరుతో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ సీజన్ కు నాని హోస్ట్ చేయగా..కౌశల్ వల్ల నానీ హోస్టింగ్ పై కూడా ట్రోల్స్ తప్పలేదు. ఈ సీజన్ ను సరిగ్గా నడిపించలేకపోయారు అన్న విమర్శలు కూడా వచ్చాయి. విన్ అయ్యి బయటకు వచ్చిన కొత్తలో కాస్త హడావిడి చేసినా..ఆతరువాత అసలు కనిపించకుండాపోయాడు.
ఇక అసలు బిగ్ బాస్ తెలుగు స్టార్ట్ అయ్యింది 2017లో. ఫస్ట్ సీజన్ ను బ్లాక్ బాస్టర్ హిట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్ తనహోస్టింగ్ తో. ఎన్టీఆర్ చేసిన ఫస్ట్ ఎపిసోడ్ అంత అందంగా ఏ సీజన్ సక్సెస్ అవ్వలేదు అని చెప్పాలి. ఇక బిగ్ బాస్ సీజన్ 1 విజేతగా నటుడు శివ బాలాజీ నిలిచారు. శివ బాలాజీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఎన్నో సినిమాల్లో నటించి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కాస్త సినిమాలకి బ్రేక్ ఇచ్చి తన వ్యాపారాలు చూసుకుంటున్నాడు.