నరాలు తెగే ఉత్కంఠ, టైట్ కాంపిటీషన్ లో విన్నర్ అయ్యేది ఎవరు? లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్
బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్ ఎవరో మరో మూడు రోజుల్లో తేలిపోతుంది. ఫైనల్ కి వెళ్లిన టాప్ 5 లో ఓట్ల ఆధారంగా టైటిల్ అందుకోనున్నారు. ఫైట్ చాలా టైట్ గా ఉంది.
Bigg boss telugu 8
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నవంబర్ 15న ముగియనుంది. నిఖిల్, అవినాష్, ప్రేరణ, నబీల్, గౌతమ్ ఫైనల్ కి వెళ్లారు. అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచి నేరుగా తన బెర్త్ టాప్ 5 లో కన్ఫర్మ్ చేసుకున్నారు. మిగతా కంటెస్టెంట్స్ ని ఆడియన్స్ ఓట్లు వేసి టైటిల్ రేసులో నిలిపారు. వీరిలో ఒకరు టైటిల్ విన్నర్ కానున్నారు.
Bigg boss telugu 8
సీజన్ 7లో 6 మంది కంటెస్టెంట్స్ ని ఫైనల్ కి పంపారు. అంబటి అర్జున్, ప్రియాంక జైన్, యావర్, శివాజీ, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ఫైనలిస్ట్స్. ఈసారి కూడా ఒకరిని ఎలిమినేట్ చేసి ఆరుగురిని ఫైనల్ కి పంపుతారని అందరూ భావించారు. కానీ బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ షాక్ ఇచ్చాడు. ఓటింగ్ లో వెనకబడిన రోహిణి, విష్ణుప్రియ 14వ వారం ఎలిమినేట్ అయ్యారు. ఫైనల్ కి వెళ్లాలన్న వీరి ఆశలు గల్లంతు అయ్యాయి.
ఇకమూడు వారాలుగా ఇద్దరు కంటెస్టెంట్స్ పేరు టైటిల్ రేసులో వినిపిస్తున్నాయి. నిఖిల్, గౌతమ్ లలో ఒకరు టైటిల్ విన్నర్ అంటున్నారు. నిఖిల్ ఫస్ట్ వీక్ నుండి హౌస్లో ఉన్నాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్. టాస్క్ లలో సత్తా చాటాడు. నిఖిల్ దే టైటిల్ అనుకుంటున్న తరుణంలో గౌతమ్ నుండి అతనికి గట్టి పోటీ ఎదురవుతుంది.
చివరి వారం ఓటింగ్ లో కూడా వీరి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. గౌతమ్ మొదటి స్థానంలో, రెండవ స్థానంలో నిఖిల్ ఉన్నారట. అయితే ఓట్ల తేడా చాలా స్వల్పం అట. జస్ట్ పాయింట్స్ లో డిఫరెన్స్ ఉందట. నిఖిల్ నాన్ లోకల్ అనేది అతనికి మైనస్. అదే సమయంలో గౌతమ్ కి వైల్డ్ కార్డు ఎంట్రీ మైనస్. చివరి నిమిషం వరకు విన్నర్ ఎవరో చెప్పడం కష్టంగా ఉంది. గత సీజన్లో ముందే విన్నర్ పై ఒక అవగాహన వచ్చేది.
Bigg boss telugu 8
కాగా నిఖిల్ కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఐదు వారాలు గేమ్ చేసిన వచ్చిన మాజీ కంటెస్టెంట్ గౌతమ్ కి టైటిల్ ఇస్తే విమర్శలు ఎదురవుతాయనే వాదన ఉంది. అదే సమయంలో వైల్డ్ కార్డు ఎంట్రీలకు టైటిల్ కొట్టే అర్హత లేకుంటే... వైల్డ్ కార్డ్స్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కాగా మూడో స్థానం కొరకు ప్రేరణ, నబీల్ మధ్య పోటీ నెలకొంది. నాలుగో స్థానంలో ఉన్న నబీల్ ఒక స్థానం ముందుకు వచ్చాడట. దాంతో ప్రేరణ వెనక్కి వెళ్లిందట. నబీల్ మూడు, ప్రేరణ నాలుగో స్థానంలో ఉన్నారట.
అవినాష్ కి కనీస ఓటింగ్ నమోదు కావడం లేదట. ఆయన చాలా వెనకబడ్డారట. అవినాష్ ఏ విధంగాను టైటిల్ రేసులో లేరట. ఈ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్న అవినాష్, హోస్ట్ నాగార్జున ఒకవేళ ఫైనల్ లో డబ్బులు ఆఫర్ చేస్తే.. అవి తీసుకుని టైటిల్ రేసు నుండి తప్పుకునే ఆలోచనలో ఉన్నాడట. మొత్తంగా బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ రేస్ రసవత్తరంగా మారింది.