డబుల్ ఎలిమినేషన్ : టేస్టీ తేజా అవుట్, ఇంకొకరు ఎవరో తెలిస్తే మీ మైండ్ బ్లాక్!
13వ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అవుతున్నాడు. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. డబుల్ ఎలిమినేషన్ కాగా.. మరో కంటెస్టెంట్ బిగ్ బాస్ ఇంటిని వీడుతున్నాడు. అది ఎవరో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది
12వ వారం యష్మి ఎలిమినేట్ అయ్యింది. అంతకు ముందు వారం అవినాష్ ఎలిమినేట్ కావాల్సింది. నబీల్ తన వద్ద ఉన్న అవిక్షన్ షీల్డ్ వాడిన నేపథ్యంలో సేవ్ అయ్యాడు. ఫినాలేకి మరో మూడు వారాలు మాత్రమే ఉంది. హౌస్లో 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ క్రమంలో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చోటు చేసుకుందని సమాచారం.
కాగా టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడట. సీజన్ 7లో కంటెస్ట్ చేసిన టేస్టీ తేజా 9 వారాలు ఉన్నారు. ఇక సీజన్ 8కి గాను ఎనిమిది మంది వైల్డ్ కార్డు ఎంట్రీలు ఇచ్చారు. వారిలో టేస్టీ తేజ ఒకరు. ఐదవ వారం టేస్టీ తేజ మినీ లాంచ్ ఈవెంట్ ద్వారా హౌస్లో అడుగు పెట్టాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా సత్తా చాటాడు. బిగ్ బాస్ ఇంట్లోకి వాళ్ళ అమ్మను తేవాలి అనేది టేస్టీ తేజ కల. సీజన్ 7లో ఈ కల నెరవేరలేదు.
Bigg boss telugu 8
ఈసారైనా అమ్మను బిగ్ బాస్ షోలో చూపించాలని టేస్టీ తేజ కోరుకున్నాడు. అది నెరవేరింది. టేస్టీ తేజ సంతోషం వ్యక్తం చేశాడు. అనధికారిక ఓటింగ్ లో టేస్టీ తేజ ఐదో స్థానంలో ఉన్నాడు. కానీ అతడు ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది. ఈసారి టేస్టీ తేజ 8 వారాలు హౌస్లో ఉన్నట్లు అయ్యింది. కాగా టేస్టీ తేజతో పాటు మరొక కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నాడట. అతడే పృథ్విరాజ్.
Bigg boss telugu 8
పలు మీడియా సంస్థల పోల్స్ లో పృథ్విరాజ్, విష్ణుప్రియ చివరి రెండు స్థానాల్లో ఉన్నట్లు తేలింది. ఈసారి పృథ్వి ఎలిమినేషన్ అనివార్యమే అని ప్రచారం జరిగింది. కొందరు బిగ్ బాస్ రివ్యూవర్స్ సైతం ఈ వారం పృథ్వి ఇంటిని వీడుతాడని అంచనా వేశారు. వారి అంచనా ప్రకారమే పృథ్విరాజ్ ఎలిమినేట్ అయ్యాడట. ఇక ఫస్ట్ వీక్ నుండి పృథ్విరాజ్ హౌస్లో ఉన్నాడు. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ద్వారా హౌస్లో అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్స్ లో ఒకడు.
పృథ్వి గేమ్ పట్ల అటు పాజిటివ్, ఇటు నెగిటివ్ అభిప్రాయాలు ఉన్నాయి. మొదట్లో అతడు సోనియా ఆకులతో అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. నిఖిల్-సోనియా-పృథ్వి మధ్య ట్రై యాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అంటూ కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరితో సోనియా ప్రవర్తన నచ్చకే జనాలు ఆమెను ఎలిమినేట్ చేశారు. నాలుగో వారమే సోనియా సర్దుకుంది.
పృథ్వి ప్రస్తుతం విష్ణుప్రియతో రొమాన్స్ చేస్తున్నాడు. అతడు హద్దుల్లో ఉన్నా విష్ణుప్రియ కంట్రోల్ కావడం లేదు. ఈ సీజన్ కి గాను లవ్ బర్డ్స్ గా పృథ్విరాజ్, విష్ణుప్రియ అవతరించారు. విష్ణుప్రియతో పృథ్వి వ్యవహారంపై జనాల్లో అసహనం ఉంది. అలాగే పృథ్వి కోపం కూడా ప్రేక్షకులకు ఆగ్రహం తెప్పిస్తుంది. పృథ్వి ఎప్పుడో ఎలిమినేట్ కావలసింది అనే టాక్ ఉంది. మరి పృథ్వి వెళ్ళిపోతే విష్ణుప్రియ బాధ వర్ణనాతీతం అనడంలో సందేహం లేదు.