విష్ణుప్రియ నన్ను లవ్ చేస్తోంది, నాపై ఆశలు పెట్టుకోవద్దని చెప్పేశా..పృథ్వీ కామెంట్స్, ఇప్పుడు లైట్ వెలిగిందా
ప్రతి సీజన్ లో హౌస్ లో గేమ్ కంటే లవ్ ట్రాక్ తో హైలైట్ అయ్యే సభ్యులు కొందరు ఉంటారు. ఈ సీజన్ లో లవ్ ఎఫైర్ తో పాపులర్ అయిన జంట అంటే ముందుగా పృథ్వీ, విష్ణుప్రియ గురించి చెప్పుకోవాలి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి అంకానికి చేరుకుంది. ఎలాగైనా టైటిల్ చేజిక్కించుకోవాలని, ఓటింగ్ లో ముందుకు రావాలని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నిఖిల్, గౌతమ్, ప్రేరణ లాంటి బలమైన కంటెస్టెంట్స్ టైటిల్ పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. బలమైన కంటెస్టెంట్ అనుకున్న పృథ్వీ కూడా ఎలిమినేట్ అయ్యాడు.
ప్రతి సీజన్ లో హౌస్ లో గేమ్ కంటే లవ్ ట్రాక్ తో హైలైట్ అయ్యే సభ్యులు కొందరు ఉంటారు. ఈ సీజన్ లో లవ్ ఎఫైర్ తో పాపులర్ అయిన జంట అంటే ముందుగా పృథ్వీ, విష్ణుప్రియ గురించి చెప్పుకోవాలి. సీజన్ మొత్తం వీళ్ళిద్దరూ ప్రేమాయణం సాగించారు. విష్ణుప్రియ కూడా పృథ్వీపై బాగా ప్రేమ కురిపించింది. పృథ్వీ కోసం చాలా గొడవల్లో ఇన్వాల్వ్ అయింది.
విష్ణుప్రియ ప్రేమ మాయ వల్లో, నిర్లక్ష్యం వల్లో కానీ పృథ్వీ ఫిజికల్ గేమ్ తప్ప, మైండ్ గేమ్ పై ఫోకస్ చేయలేదు. నోరు జారుతూ చాలా మందిని దూషించాడు. ఇలా చాలా తప్పులు చేశాడు. ఈ కారణాల వల్ల పృథ్వీ ఎలిమినేట్ కాక తప్పలేదు. బయటికొచ్చిన పృథ్వీ.. విష్ణుప్రియతో తన ప్రేమ గురించి అన్ని విషయాలు ఓపెన్ గా చెప్పేశాడు.
వీళ్ళిద్దరూ హౌస్ లో ఉన్నప్పుడు ప్రేమ అని ఓపెన్ గా చెప్పలేదు కానీ.. ఫ్రెండ్ షిప్ కంటే ఎక్కువ అని చెబుతూ వచ్చారు. పృథ్వీ మాట్లాడుతూ.. విష్ణుప్రియ నన్ను నిజంగానే ప్రేమించింది. ఆ విషయం నాకు తెలుసు. కానీ నేను అడిగినప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్ కంటే చాలా ఎక్కువ అని చెప్పింది తప్ప లవ్ ని ఎక్స్ప్రెస్ చేయలేదు. కానీ నాపై ఆమెకి ఉన్న ప్రేమ తెలుసు. నిజంగానే విష్ణుప్రియ నన్ను లవ్ చేసింది.
అయితే నేను ఆమెని ప్రేమించలేదు. ఒక మంచి ఫ్రెండ్ గా భావించా. ఆమె నాపై ప్రేమ చూపిస్తునప్పుడు నాపై ఆశలు పెట్టుకోవద్దని చెప్పేశా. ఆమె క్యూట్ నెస్ నాకు చాలా ఇష్టం. కానీ ప్రేమ వరకు వెళ్ళలేదు అని పృథ్వీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఫ్యూచర్ లో విష్ణుప్రియ నాపై ప్రేమ పెంచుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి నాపై ఆశలు పెట్టుకోవద్దని ఆమెకి క్లారిటీ ఇచ్చినట్లు పృథ్వీ తెలిపారు. పృథ్వీకి ఎలిమినేట్ అయ్యాక లైట్ వెలిగినట్లు ఉంది అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.