MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • నాగ మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ కావడానికి కారణం ఇదే, ఎట్టకేలకు కీలక విషయం వెలుగులోకి!

నాగ మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ కావడానికి కారణం ఇదే, ఎట్టకేలకు కీలక విషయం వెలుగులోకి!

నాగ మణికంఠ గత వారం ఎలిమినేట్ అయ్యాడు.  నేను టైటిల్ ఖచ్చితంగా కొట్టాలన్న నాగ మణికంఠ జర్నీ ముగిసింది. కాగా తాను హౌస్ నుండి బయటకు రావడానికి కారణాలు ఏమిటో నాగ మణికంఠ వెల్లడించాడు.   

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 24 2024, 06:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


నాగ మణికంఠ టైటిల్ కోసమే బిగ్ బాస్ షోకి వచ్చాను అన్నాడు. తనకు భార్య పిల్లలు కావాలి. అత్తమామల దగ్గర గౌరవం దక్కాలి. ఇవి జరగాలనే నేను ఖచ్చితంగా టైటిల్ విన్నర్ కావాలని అన్నాడు. అనూహ్యంగా సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. ప్రేక్షకులు నాగ మణికంఠకు ఓట్లు వేశారు. కానీ అతడు తానంతట తానే బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోయాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Goutham Krishna

Goutham Krishna


నాగ మణికంఠ షో నుండి వైదొలగడానికి ప్రధాన కారణం అనారోగ్య సమస్యలు.హోస్ట్ నాగార్జునతో కూడా ఆయన ఇదే చెప్పాడు. నేను చాలా వరకు ట్రై చేశాను. ఇంకా నా వల్ల కాలేదు. అందుకే వచ్చేశాను అన్నారు. కాగా నాగ మణికంఠకు అనారోగ్య సమస్యలు తలెత్తడానికి హౌస్లో ఉన్న పరిస్థులేనట. ఈ విషయాన్ని నాగ మణికంఠ నేరుగా చెప్పారు. సరిపడా తిండి లేకపోవడం తన ఆరోగ్యాన్ని దెబ్బ తీసింది అన్నాడు. 

కేవలం నిమిషం సమయంలో హౌస్ మేట్స్ అందరికి సరిపడా సరుకులు తెచ్చుకోవాల్సి వచ్చేది. కొన్నిసార్లు కూరగాయలు తెచ్చేవారు కాదు. కొన్నిసార్లు రైస్ తెచ్చేవారు కాదు. కొన్నిసార్లు పెరుగు మిస్ అయ్యేది. నిర్ణీత సమయం మాత్రమే వంటకు ఉంటుంది. దాంతో రోజుకు రెండు, మూడు చపాతీలు మాత్రమే వచ్చే వి. పూత రేకుల్లా ఉండే దోశలు రెండు మూడు వచ్చేవి. దాని వలనే నా ఆరోగ్యం దెబ్బతింది అన్నాడు. కడుపునిండా ఆహారం ఉండేది కాదని నాగ మణికంఠ చెప్పకనే చెప్పాడు. 
 

36


నాగ మణికంఠ స్ట్రాంగ్ ప్లేయర్ గా బిగ్ బాస్ హౌస్లో అవతరించాడు. మొదటి వారమే కన్నీటి గాథలు మొదలుపెట్టడంతో ఒకింత విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇతడు మరో పల్లవి ప్రశాంత్. సింపతీ గేమ్ తో టైటిల్ విన్నర్ కావాలని అనుకుంటున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. 

నాగ మణికంఠ చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నాడని రోజులు గడిచే కొద్దీ అర్థమైంది. హౌస్ మొత్తాన్ని నాగ మణికంఠ కన్ఫ్యూషన్ లో పడేశాడు. అతడి పట్ల ఎలా ప్రవర్తించాలో కంటెస్టెంట్స్ కి అర్థం కాని పరిస్థితి. ఒక దశలో నాగ మణికంఠను అందరూ టార్గెట్ చేశారు. అది వాళ్లకు మైనస్ అవుతుందని, అతడికి ప్లస్ అవుతుందనే సందేహం మరలా వారిలో కలిగింది. 

46

నాగ మణికంఠ సింపతీ గేమ్ తనను టార్గెట్ చేస్తున్న కంటెస్టెంట్స్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందనే చర్చ హౌస్లో మొదలైంది. అంతగా నాగ మణికంఠ ఇతర కంటెస్టెంట్స్ మైండ్స్ ట్యూన్ చేశాడు. అదే సమయంలో అమ్మాయిలతో నాగ మణికంఠ ప్రవర్తన విమర్శలకు దారి తీసింది. నాగ మణికంఠ హగ్ చేసుకోవడం నాకు నచ్చలేదని యష్మి అసహనం ప్రదర్శించింది. 

56
Bigg boss telugu 8

Bigg boss telugu 8


యష్మితో పాటు ఇతర లేడీ కంటెస్టెంట్స్ ని కూడా నాగ మణికంఠ అవసరం ఉన్నా లేకున్నా హగ్ చేసుకునేవాడు. సోనియా ఆకులను పక్కకు తీసుకెళ్లి హగ్ కావాలని అడిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయినప్పటికి ప్రేక్షకుల్లో నాగ మణికంఠకు క్రేజ్ ఏర్పడింది. దాదాపు ప్రతి వారం నామినేషన్స్ లో ఉంటున్న నాగ మణికంఠ ప్రేక్షకుల ఓట్లతో సేవ్ అవుతున్నాడు. 

ఈ వారం పక్కాగా ఇంటికి వెళ్లే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరు?
 

66
Naga Manikanta

Naga Manikanta


7వ వారం సైతం నాగ మణికంఠ ఓటింగ్ లో టాప్ 3-4 లో ఉన్నాడు. టేస్టీ తేజ, గౌతమ్ చివరి రెండు స్థానాల్లో ఉన్నట్లు సమాచారం. ప్రేక్షకుల నిర్ణయం ప్రకారం గౌతమ్ ఎలిమినేట్ కావాల్సింది. కానీ నాగ మణికంఠ స్వయంగా వెళ్లిపోతానని చెప్పడంతో... నాగార్జున ఫైనల్ గా కంటెస్టెంట్స్ ఓటింగ్ తీసుకున్నాడు. మెజారిటీ ఇంటి సభ్యులు నాగ మణికంఠకు వ్యతిరేకంగా ఓట్లు వేయడంతో ఎలిమినేట్ అయ్యాడు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Venkatesh: వెంకీ అలాంటి సినిమాలకు పనికిరాడు అంటూ కామెంట్స్.. ఆ 4 మూవీస్ తోనే సూపర్ హిట్స్ కొట్టిన విక్టరీ
Recommended image2
Vijay Ajith Meet: లండన్‌లో విజయ్‌, అజిత్ ఐకానిక్‌ మీట్.. తలాని చూసి పరుగెత్తుకెళ్లి హగ్ చేసుకున్న దళపతి
Recommended image3
Epic Day 2 Collections: ఎపిక్‌ మూవీ 2 రోజుల కలెక్షన్లు.. ఆనంద్‌, వైష్ణవి జోడీ బాక్సాఫీసు వద్ద ఇలా చేసిందేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved