MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • ఉత్కంఠ మధ్య ముగిసిన ఎలిమినేషన్, కిరాక్ సీత అవుట్!

ఉత్కంఠ మధ్య ముగిసిన ఎలిమినేషన్, కిరాక్ సీత అవుట్!

కిరాక్ సీత ఈ వారం బిగ్ బాస్ హౌస్ ని వీడినట్లు తెలుస్తుంది. నామినేషన్స్ లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్ కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న ఆమె, ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారట.   

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 12 2024, 03:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ఆరవ వారానికి గాను యష్మి, విష్ణుప్రియ, పృథ్విరాజ్, సీత, మెహబూబ్, గంగవ్వ నామినేట్ అయిన సంగతి తెలిసిందే.  ఈ ఆరుగురు కంటెస్టెంట్స్ కి ఆడియన్స్ ఓట్లు వేశారు. శుక్రవారం అర్ధరాత్రికి ఓటింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే సస్పెన్సు నెలకొంది. కాగా ప్రముఖ యూట్యూబర్, నటి కిరాక్ సీత ఎలిమినేట్ అయ్యిందట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Bigg boss telugu 8

Bigg boss telugu 8

వివిధ మీడియా సంస్థలు నిర్వహించిన పోల్స్ ప్రకారం, ఓటింగ్ సరళి ఈ విధంగా ఉంది. గంగవ్వ టాప్ లో ఉందట. ఆమెకు 21.51 శాతం ఓట్లు పోల్ అయ్యాయట.  గంగవ్వ సీజన్ 4లో పాల్గొన్నారు. సీజన్ 8 వైల్డ్ కార్డు ఎంట్రీలలో ఆమె ఒకరు. గత సీజన్ తో పోల్చితే గంగవ్వ చురుగ్గా ఉంది. గంగవ్వ... అవినాష్ తో కలిసి ఓ టాస్క్ ఆడి గెలవడం విశేషం. దానికి తోడు గంగవ్వకు సింపతీ యాడ్ అవుతుంది. ప్రేక్షకులు ఆమెకు భారీగా ఓట్లు వేస్తున్నారు. 

 

 రెండో స్థానంలో మెహబూబ్ ఉన్నాడట. మెహబూబ్ సైతం సీజన్ 4 కంటెస్టెంట్. స్ట్రాంగ్ ప్లేయర్ గా మెహబూబ్ పది వారాలు హౌస్లో ఉన్నాడు. ఈసారి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు. సోషల్ మీడియా స్టార్ అయిన మెహబూబ్ కి ఫాలోయింగ్ ఉంది. బీబీ జోడీలో సత్తా చాటాడు. మొదటి వారం మెహబూబ్ పెద్దగా హైలెట్ కాలేదు. అయినప్పటికీ పాపులారిటీ రీత్యా ఓట్లు పడ్డాయని తెలుస్తుంది. 

36
Bigg boss telugu 8

Bigg boss telugu 8


ఈ సీజన్ కి గాను టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగిన విష్ణుప్రియ మూడో స్థానానికి పడిపోయిందట. ఆమె టాప్ సెలబ్రిటీ అయినప్పటికీ... గేమ్ పరంగా మెప్పించడం లేదు. గత రెండు వారాల్లో విష్ణుప్రియ ఆట మరింత దిగజారింది. ఆమె పృథ్విరాజ్ మాయలో పడిపోయింది. సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యాక.. పృథ్విరాజ్ తో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఆమెకు దక్కుతుంది. హోటల్ టాస్క్ లో విష్ణుప్రియ కనీసం ఆకట్టుకోలేదు. 

 

 హోస్ట్ నాగార్జున సైతం ఇదే విషయంలో విష్ణుప్రియకు క్లాస్ పీకాడు. నువ్వు ఆటను సీరియస్ గా తీసుకోకపోతే, ప్రేక్షకులు కూడా నిన్ను సీరియస్ గా తీసుకోరని, విష్ణుప్రియకు నాగార్జున నేరుగా వార్నింగ్ ఇచ్చాడు. ఐదవ వారం నామినేషన్స్ లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న యష్మి తన ఆటను మార్చుకుంది. హోటల్ టాస్క్ లో 100 శాతం ఇచ్చింది. రాయల్ క్లాన్ సభ్యులు ఆమె సేవలకు మెచ్చి స్టార్ సైతం ఇచ్చారు. 

46
Bigg boss telugu 8

Bigg boss telugu 8

అయినప్పటికీ యష్మి నాలుగో స్థానానికి పరిమితమైందట. ఇక చివరి రెండు స్థానాల్లో పృథ్విరాజ్, సీత ఉన్నారట. వీరిద్దరి మధ్య దాదాపు 3 శాతం ఓట్ల తేడా ఉందట. సీత కంటే పృథ్విరాజ్ ముందంజలో ఉన్నాడట. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో సీత ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారట. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది.

56
Kirrak Seetha

Kirrak Seetha

సీత చెప్పుకోదగ్గ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అయితే హౌస్లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యిందని చెప్పొచ్చు. నామినేషన్స్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండటం కూడా ఆమెకు మైనస్. మిగతా ఐదుగురు బలంగా ఉండగా.. సీత ఇంటిని వీడాల్సి వచ్చింది. సీత ఎలిమినేషన్ ఆదివారం ఎపిసోడ్ తర్వాత అధికారికం అవుతుంది. అప్పటి వరకు ఇది ఊహాగానం మాత్రమే. 

బిగ్ బాస్ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్ ఇక్కడ తెలుసుకోండి!

66

కాగా గత ఐదు వారాల్లో బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యారు. ఐదవ వారం డబుల్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది. ఆదిత్య ఓం మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యాడు. నైనిక వారాంతం ఇంటిని వీడింది. ప్రస్తుతం హౌస్లో 16 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఆదివారం ఒకరు ఎలిమినేట్ అవుతారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image2
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Recommended image3
Anasuya: అనసూయ ఏం చేసినా వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved