- Home
- Entertainment
- Anirudh Ravichander: అనిరుధ్ క్యూట్ అండ్ యంగ్ లుక్ వెనుక సీక్రెట్.. ఆ 8 ఫుడ్స్ ఏంటో తెలుసా?
Anirudh Ravichander: అనిరుధ్ క్యూట్ అండ్ యంగ్ లుక్ వెనుక సీక్రెట్.. ఆ 8 ఫుడ్స్ ఏంటో తెలుసా?
Anirudh Ravichander:మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఇప్పటికీ ఎంతో యంగ్‌గా కనిపించడం వెనుక ఆయన శాకాహార డైట్ ఉందట. చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచే 8 సూపర్ ఫుడ్స్, వాటి ఉపయోగాలు ఇక్కడ చూద్దాం.

అనిరుధ్ యంగ్ లుక్ సీక్రెట్..
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తన ఫిట్‌నెస్, యంగ్ లుక్స్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన పూర్తి శాకాహారి అనే విషయం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు మన చర్మాన్ని యంగ్‌గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.
అనిరుధ్ 2012లోనే తాను పూర్తి శాకాహారి అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తమిళనాడుకు చెందిన వ్యక్తి అయినప్పటికీ, ఆయనకు కారంగా ఉండే ఆంధ్రా భోజనం అంటే చాలా ఇష్టమట. ముఖ్యంగా ఆంధ్రా భోజనంతో పాటు వాళ్ల అమ్మ చేసే బంగాళాదుంప వంటకాలను బాగా తింటారు. శాకాహారం అంటే రుచిలేనిది అని కాకుండా, నచ్చిన ఆహారాన్ని పరిమితిలో తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయన నిరూపిస్తున్నారు.
శాకాహారం తింటే 10 ఏళ్లు చిన్నవాళ్లుగా కనిపిస్తారా?
యంగ్‌గా కనిపించేందుకు తోడ్పడే 8 హెల్దీ ఫుడ్స్!
1. ఆకుకూరలు: తోటకూర, పాలకూర, మునగాకులలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 2. టమోటాలు: వీటిలోని లైకోపీన్ కణాల నష్టాన్ని అడ్డుకుంటుంది. 3. బాదం, పిస్తా: వీటిలోని విటమిన్ E చర్మానికి, గుండెకు మేలు చేస్తుంది. 4. ఉసిరి, జామ: వీటిలో ఉండే విటమిన్ C కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. 5. పప్పుధాన్యాలు: కందిపప్పు, పెసలు, శనగలు శరీరానికి అవసరమైన ప్రోటీన్ ఇస్తాయి. 6. అవిసె గింజలు: వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. 7. అవకాడో: చర్మానికి అవసరమైన మంచి కొవ్వులు అందిస్తుంది. 8. ఎండు ఫలాలు: ఖర్జూరాలు, అంజీర్ తింటే శరీరానికి అవసరమైన ఖనిజాలు లభిస్తాయి.
అన్నం తింటే త్వరగా ముసలివాళ్లు అయిపోతారా?
మనం రోజూ తినే వరి అన్నాన్ని పూర్తిగా మానాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. శుద్ధి చేసిన పిండి పదార్థాలు (మైదా), అధికంగా చక్కెర ఉన్న పదార్థాలు, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్ మాత్రమే శరీరానికి హాని చేస్తాయి. మన సాంప్రదాయ అన్నంతో పాటు తగినన్ని కూరగాయలు, ఆకుకూరలు, పప్పు చేర్చుకుని తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
శాకాహారం తినడం వల్ల కలిగే ప్రధాన లాభాలు ఇవే!
సరిగ్గా ప్లాన్ చేసిన వెజిటేరియన్ డైట్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పండ్లు, కూరగాయల ద్వారా ఫైబర్ లభిస్తుంది. పప్పుల ద్వారా ప్రోటీన్ అందుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు కణాలను కాపాడుతాయి. పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సరైన ఆహార ఎంపికల వల్ల బరువు, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి.
స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ 22 జంటల కవలలపై ఎనిమిది వారాల పాటు ఒక రీసెర్చ్ చేసింది. ఒకరికి వెజిటేరియన్ డైట్, మరొకరికి నార్మల్ డైట్ ఇచ్చారు. వెజిటేరియన్ డైట్ తిన్న వారిలో బరువు, చెడు కొలెస్ట్రాల్, ఇన్సులిన్ స్థాయిలు తగ్గినట్లు గుర్తించారు. అలాగే DNA లెక్కల ప్రకారం వారి జీవసంబంధ వయస్సు సగటున 0.65 సంవత్సరాలు తగ్గినట్లు పరిశోధకులు తెలిపారు.
మిడిల్ క్లాస్ ప్రజలు సులువుగా పాటించే డైట్ ప్లాన్!
యంగ్‌గా కనిపించడానికి ఖరీదైన పండ్లు తినాల్సిన పనిలేదు. ఉదయం ఇడ్లీ, దోశతో సాంబార్ లేదా చట్నీ తినవచ్చు. మధ్యాహ్నం అన్నంలోకి ఆకుకూరలు, కూరగాయలు, పప్పు చేర్చుకోవాలి. సాయంత్రం జంక్ ఫుడ్ బదులు జామపండు లేదా బాదం పప్పులు తినాలి. రాత్రి పూట చపాతీ, కూరలు తీసుకోవచ్చు. సరిపడా నీళ్లు తాగుతూ, మంచి నిద్రపోతే ఎవరైనా ఎప్పుడూ యంగ్‌గా కనిపిస్తారు.





