MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హరితేజ హరికథ పార్ట్ 2 ప్లాప్, వీధి రౌడీల్లా నబిల్- పృథ్వీ గొడవ, ఇరకాటంలో ప్రేరణ..

హరితేజ హరికథ పార్ట్ 2 ప్లాప్, వీధి రౌడీల్లా నబిల్- పృథ్వీ గొడవ, ఇరకాటంలో ప్రేరణ..

బిగ్ బాస్ హౌస్ లో తాజా ఎపిసోడ్ భలే ఫన్నీగా అనిపించింది. కామెడీ ప్లాస్, యాక్షన్ ప్లాస్, సెంటిమెంట్ ప్లాస్.. కన్నింగ్ గేమ్ అంతా ఒకే ఎపిసోడ్ లో కనిపించింది.  

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 09 2024, 12:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఒకేరోజు అద్భుతాలు జరిగిపోయాయి. అటు హరితేజ్ హరికథ పార్ట్ 2 తోపాటు.. ప్రేరణ బిగ్ బాస్ హౌస్ చీఫ్ అవ్వడం, నబిల్ పృధ్వీ మధ్య గొడవ, తేజా చేసిన పిచ్చిపని.. విష్ణు ప్రియను ప్రేరణ టార్గెట్ చేయడం.. ఇలా చాలా విషయాలు హౌస్ లో  జరిగాయి. అందులో కొన్ని చిరాకు కలిగిస్తే.. మరికొన్ని మాత్రం భలే ఫన్ ను జనరేట్ చేశాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మరీ ముఖ్యంగా ఈసీజన్ లో హరితేజ నుంచి చాలా మంది ఎక్స్ పెక్ట్ చేస్తున్న హరికథకు టైమ్ రానే వచ్చింది. సీజన్ 1 లో హరితేజ హరికథ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. ఆమెకు మంచి పేరు కూడా వచ్చింది. ఇప్పటికీ బిగ్ బాస్ సీజన్ 1 అంటే.. హరితేజ్ హరికథే ముందుగా చెపుతుంటారు. ఇక ఎలాగో అలా పాపులర్ అయ్యాం కదా అని సీజన్ 8 లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన హరితేజ.. 

ఈసారి కూడా హరికథ పార్ట్ 2ను ఓపెన్ చేశారు. అద్భుతంగా చెప్పాలని స్టార్ట్ చేసిన ఆమెకు.. ఈసారి అంతగా కాలం కలిసి రాలేదు. ఏదో చెప్పారు కాని.. అందులో క్లారిటీ లేదు. ఎవరిగురించి చెప్పినా.. అది పెద్దగా పేలలేదు కూడా. దాంతో హరితేజ్ హరికథ పార్ట్ 2 అట్టర్ ప్లాప్ అయ్యింది. కాని ఆమె కష్టాన్ని గుర్తించిన బిగ్ బాస్.. కిచెన్ టైమ్ 2 అవర్స్ ఎక్స్ ట్రాగా ఇచ్చారు. 
 

35

ఇక హరికథ తరువాత అసలు కథ స్టార్ట్ అయ్యింది. మెగా చీఫ్ గా ప్రేరణ విజయం సాధించింది. అయితే అంతకు ముందు మెగా చీఫ్ కోసం జరిగిన పోరులో నబిల్ పగపట్టి పృధ్వీని టాస్క్ నుంచి బయటపడేలా చేశాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త ముదిరి కొట్టుకునేంత వరకూ వచ్చింది. కాని చుట్టు ఉన్నవాళ్ళు ఆపడంతో ఇద్దరు అంత ఆవేశంలో ఉన్న కంట్రోల్ అయ్యారు. 

వారి అరుపులతో బిగ్ బాస్ హౌస్ దద్దరిల్లిపోయింది. నిజంగా తన్నుకుంటారేమో అని ఆడియన్స్ భయపడేలా చేశారు ఇద్దరు. ఎవరిది తప్పు అనేది మాత్రం ఇక వీకెండ్ రానే వచ్చింది.. నాగార్జున క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక మెగా చీఫ్ అయిన వెంటనే రుబాబ్  స్టార్ట్ చేసింది ప్రేరణ. మరీ ముఖ్యంగా తనకు సపోర్ట్ చేయలేదు అన్న కారణంగా విష్ణు ప్రియను టార్గెట్ చేయడం మొదలు పెట్టింది.

45

 అది కాదు.. ఇది కాదు.. అవి నీట్ గా పెట్టుకో.. నీటు గా చదురుకో.. ఇలా విష్ణును టార్చర్ చేయడం స్టార్ట్ చేసింది ప్రేరణ. అందరిలో విష్ణును చులకన చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంతో ఇద్దరిమధ్య వాదనజరిగింది. ప్రేరణ టార్చర్ తట్టుకోలేని విష్ణు ప్రియ.. తాను నచ్చినట్టు ఉంటానని ఎదరు తిరుగుతుంది. దాంతో ప్రేరణ ఏం చేయాలో తెలియక బిగ్ బాస్ కు చెప్పుకుంటుంది. 
 

55

ఇక హౌస్ లోకి పాము వచ్చింది. నామినేషన్స్ నుంచి తప్పించుకోవడం కోసం ఎవిక్షన్ ను సాధించడం కోసం పాను నోట్ల కంటెస్టెంట్స్ పోటోలు ఉన్న గుడ్డు ను వేయాలి. ముందుగా మెగా చీఫ్ ను 5 గుడ్లు వేయాల్సిందిగా బిగ్ బాస్ ఆదేసించారు. దాంతో ప్రేరణ పరిస్థితి దారుణంగా మారుతుంది. ఎవరిని వేసిసినా.. నెక్ట్స్ నామినేషన్స్ నలో వేస్తారు. ఇక తప్పక ప్రేరణ విష్షు ప్రియా, హరితేజ, పృధ్వీ, గంగవ్వ, గౌతమ్ ల గుడ్లను పాముకు ఆహారంగా వేస్తారు. 

ఇక ఇద్దరిద్దరుగా వెళ్ళి డి్సకర్షన్ చేయసుకోవాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశాలు ఇస్తారు. ఇక విష్ణు ప్రియ,పృధ్వీ మాట్లాడుకుని ప్రేరణను వేస్తారు. అటు   నిఖిల్, గౌతమ్ తేజా గుడ్డను వేయగా... తేజా, యష్మి విషయంలో గోడవ అవుుతుంది. దాంతో యష్మీ ఓప్పుకోకపోయినా..తేజ నిఖిల్ గుడ్డు ను వేయగా.. యష్మికి కోపం వచ్చి రోహిణి గుడ్డును లోపల వేస్తుంది. దాంతో నబిల్ ఒక్కడి గుడ్డే ఉంటుంది. అతనికే ఆ పవర్ వస్తుందని తెలుస్తోంది. మరి బిగ్ బాస్ నిర్ణయం ఏంతో నెక్ట్స ఎపిసోడ్ లో తెలుస్తుంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: ప్రపంచాన్ని కుదిపేసిన హారర్ లవ్ స్టోరీ ఓటీటీలోకి, పండగ చేసుకోండి.. ఈ వారం రిలీజయ్యే మూవీస్ ఇవే
Recommended image2
Baahubali Facts: మొదటి రోజే 70 కోట్ల నష్టం, రాజమౌళి బాధ అంతా ఇంతా కాదు.. బాహుబలికి ఎదురైన పెను సంక్షోభం
Recommended image3
Hema Malini House: 54 ఏళ్ల హేమమాలిని ఇల్లు.. లోపలంతా ధర్మేంద్ర జ్ఞాపకాలే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved