ఎన్టీఆర్ నుంచి నాగార్జున వరకూ.. తెలుగు బిగ్ బాస్ హోస్ట్ లు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
బిగ్ బాస్ తెలుగు అన్ని సీజన్లు ఆడియన్స్ ను అలరించాయి. అయితే హోస్ట్ లు గా ముగ్గురు అద్భుతంగా చేశారు. మరి ఆ ముగ్గురు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు.. ఎవరు ఎక్కవ వసూలు చేశారు.
బిగ్ బాస్ తెలుగు గత 8 ఏళ్ళుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఒకటీ రెండు సీజన్లు తప్పించి అన్ని సీజన్లను ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. ఇక తెలుగు బిగ్ బాస్ కు 3వ సీజన్ నుంచి కింగ్ నాగార్జున్ హోస్ట్ గా కొనసాగుతున్నారు.
కాగా రెండో సీజన్ కు నేచురల్ స్టార్ నాని.. మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా కొనసాగారు. అయితే వీరిలో ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు.
ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రన్నింగ్ లో ఉంది. కింగ్ నాగార్జున ఇప్పటికే 5 సీజన్లకు హోస్టింగ్ చేశారు. ఇప్పుడు 6వ సీజన్ కు ఆయన హోస్ట్ గా చేస్తున్నారు. ప్రతీ సీజన్ ను తనదైన స్టైల్ లో సక్సెస్ చేశారు నాగ్. కంటెస్టెంట్స్ ను చాలా నైస్ గా హ్యాండిల్ చేస్తూ వస్తున్నారు. విమర్శించాల్సిన చోట విమర్శిస్తూ.. మెచ్చుకొంటూ.. ప్రతీ సీజన్ ను అద్భుతంగా రన్ చేస్తున్నారు.
ఇక ఇప్పటి వరకూ నాగార్జున హోస్టింగ్ చేస్తూ ఎంత రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నారో తెలుసా..? అసలు ఈ ముగ్గరు హోస్ట్ లు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అన్నది ఆసక్తిగా మారగా…
నాగార్జున అయితే మొదటగా ఎపిసోడ్ కు 10 నుంచి 15 లక్షల వరకూ తీసుకున్నాడట. ఇక ఇప్పుడు సీజన్ 8 కు వచ్చేవరకూ.. టోటల్ అమౌంట్ ను పెంచి.. ఓవర్ ఆల్ గా 15 కోట్లకు పైగా తీసుకుంటున్నాడని తెలుస్తోంది.
ఇక నాగార్జున కంటే ముందు అంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ను నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశారు. అయితే నాని ఒక్కడే బిగ్ బాస్ హోస్ట్ గా విమర్శలు ఫేస్ చేశాడు. కంటెస్టెంట్స్ ను కంట్రోల్ లో పెట్టలేకపోయాడని.. బయాస్ గా ఆలోచిస్తున్నాడంటూ.. రకరకాల కామెంట్లు.. ట్రోలింగ్ వచ్చింది. దాంతో నాని నెక్ట్స్ సీజన్ ఆఫర్ వచ్చినా.. నో చెప్పేశాడట.
సినిమాలకు రజినీకాంత్ గుడ్ బై.. వాళ్ల హెచ్చరికలే కారణమా..? చివరి సినిమా అదే..?
Nani
కాగా రెండో సీజన్ కి నాని హోస్ట్ చేయగా ఒక్కో ఎపిసోడ్ కి 10 నుండి 12 లక్షల రేంజ్ లో రెమ్యునరేషన్ ని అందుకున్నాడని సమాచారం. కానీ రెండో సీజన్ కాంట్రవర్సీలు ఎక్కవగా ఉండటంతో మూడో సీజన్ చేయలేదు నాని. హ్యాపీగా తన సినిమాలు చేసుకుంటూ ఉండిపోయాడు. ఆ సీజన్ లో విన్నర్ గా నిలిచిన కౌశల్ మందా కూడా వివాదాస్పదుడు అయ్యాడు.
ఇక తెలుగులో బిగ్ బాస్ ను స్టార్ట్ చేసింది.. యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఫస్ట్ సీజన్ అయినా.. చాలా అనుభవం ఉన్నట్టుగా నడిపించాడు తారక్. గతంలో ఎవరు మీలో కోటీశ్వరుడు షోకు హెస్టింగ్ చేసిన అనుభవంతో... బిగ్ బాస్ ను అద్భుతంగా హోస్టింగ్ చేశాడు తారక్. కాని ఆతరువా సిజన్లు ఎన్టీఆర్ హోస్ట్ అయ్యింటే అదిరిపోయేవి. కాని ఆయన సినిమాల్లో బిజీగా ఉండి.. వదులుకున్నాడు జూనియర్
NTR BIgg boss
ఇక జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ ను తెలుగు ఆడియన్స్ కు రుచి చూపించాడు. కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కో ఎపిసోడ్ హోస్ట్ చేసినందుకు అక్షరాలా 35 లక్షల రెమ్యునరేషన్ ని అందుకునేవాడని సమాచారం. ఇక మొదటి సీజన్ సూపర్ సక్సెస్ తర్వాత..ఎన్టీఆర్ రెండో సీజన్ నుండి సినిమాల వలన తప్పుకున్నాడు…