ఓటింగ్‌లో ఊహించని మార్పులు.. టాప్ లో సుమన్ శెట్టి.. డేంజర్ జోన్‌లో ఎవరున్నారంటే?
Bigg Boss Telugu 9 Voting Update: బిగ్ బాస్ తెలుగు 9 రెండో వారం ఓటింగ్ ట్రెండ్స్ లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. టాప్ లో సుమన్ శెట్టి దూసుకెళ్తుండగా.. డేంజర్ జోన్ లో ఎవరు ఉన్నారు? ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది ఉత్కంఠగా మారింది.

బిగ్ బాస్ ఓటింగ్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రియాలిటీ షో రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ గేమ్ షో టాస్కులు, గేమ్స్, కాంట్రావర్సీలు, లవ్ ట్రాక్ తో రసవత్తరంగా సాగుతోంది. అల్ మిక్స్ ప్యాకేజ్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. ప్రస్తుతం ఈ షో రెండో వారంలోకి అడుగుపెట్టింది. మొదటి వారంలో శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అవ్వడంతో హౌస్ లో 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక రెండో వారంలో నామినేషన్ పర్వం హోరాహోరీగా సాగింది. కంటెస్టెంట్ల మధ్య డైలాగ్ వార్ తో హౌస్ హీటెక్కింది.
నామినేషన్స్ లిస్ట్ ఇదే
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రెండో వారం నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా జరిగింది. ఈ నామినేషన్స్ లో మాస్క్ మ్యాన్ హరీష్, భరణి శంకర్, ఫ్లోరా సైనీ, మర్యాద మనీష్, ప్రియా, సుమన్ శెట్టి, డీమాన్ పవన్ మొత్తం 7 మంది కంటెస్టెంట్స్ నిలిచారు. నామినేషన్ ముగిసిన వెంటనే ఆన్‌లైన్ ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. తమ ఫేవరెట్ కంటెస్టెంట్‌ను ఎలిమినేషన్ నుంచి కాపాడుకునేందుకు అభిమానులు, ఆడియెన్స్ ఓటింగ్‌లో భారీగా పాల్గొంటున్నారు.
ఓటింగ్ ట్రెండ్స్
సోషల్ మీడియా ఓటింగ్ ట్రెండ్స్ పరిశీలిస్తే.. షాకింగ్ గా ఉంది. మరోసారి సుమన్ శెట్టి 41 శాతం ఓట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఆ తరువాత నటుడు భరణి 26 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. అసలు ఎవరూ ఊహించని విధంగా మాస్క్ మ్యాన్ హరీశ్ 8 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. వాస్తవానికి చాలా మంది మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అవుతారని భావించారు. కానీ, మంచి ఓటింగ్ తో సేఫ్ జోన్ లో ఉన్నారు. ఆ తరువాత డీమాన్ పవన్ 7.5 శాతం ఓట్లు నాలుగో స్థానం నిలిచారు. ఆ తరువాత స్థానంలో ఫ్లోరా శైనీ 6 శాతం ఓట్లు, ప్రియా శెట్టి- 5 శాతం ఓట్లు, మర్యాద మనీష్ - 3 శాతం ఓట్లు సాధించారు.
డేంజర్ జోన్ లో ఎవరు?
ప్రస్తుతం సోషల్ మీడియా ఓటింగ్ ప్యాటర్న్ ప్రకారం కేవలం ప్రియా శెట్టి 5 శాతం, మర్యాద మనీష్ 3 శాతం ఓట్లతో డేంజర్ జోన్ లో నిలిచారు. అలాగే గత వారం ఎలిమినేషన్ నుంచి త్రుటిలో తప్పించుకున్న ఫ్లోరా శెట్టికి ఈ వారం కూడా తక్కువ ఓట్లు రావడంతో ఆమె కూడా సేఫ్ కాదనే చెప్పాలి. అయితే.. ఇంకా రెండు రోజుల ఓటింగ్ సమయం ఉన్నందున అనూహ్య మార్పులు జరగవచ్చు. అయితే ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం మర్యాద మనీష్ లేదా ప్రియా శెట్టి బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మాస్క్ మెన్ హరీష్ అసలు రంగు?
మరోవైపు.. మాస్క్ మ్యాన్ హరీష్ పై హౌజ్ లో నెగిటివిటీ పెరిగిపోయింది. తొలిరోజే టైటిల్ ఫేవరెట్‌గా భావించబడ్డాడు. కానీ వారం తిరగకముందే ఆయన ప్రవర్తన హౌస్‌లోనూ, బయట ఆడియెన్స్‌లోనూ నిరాశ కలిగిస్తోంది. తనను తాను మాత్రమే కరెక్ట్ అనుకోవడం, ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం, ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్స్ పట్ల చేసిన వ్యాఖ్యలు ఆడియెన్స్‌లో నెగటివ్ వైబ్ క్రియేట్ చేశాయి. నాగార్జున క్లారిటీ ఇచ్చినా కూడా హరీష్ తన ప్రవర్తన మార్చుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఈ వారం నామినేషన్స్‌లోనూ అతని వైఖరి శాడిజం లా అనిపించిందని, గత సీజన్లలో సైకోగా ప్రవర్తించిన కంటెస్టెంట్స్‌ను గుర్తు చేసిందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన మాస్క్ మెన్ హరీష్ ఇప్పుడు “డేంజర్ కంటెస్టెంట్”గా మారిపోయాడని చెప్పాలి. మొత్తానికి బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ రెండో వారంలో ఎలిమినేషన్‌పై హై వోల్టేజ్ సస్పెన్స్ నెలకొంది. అభిమానులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్‌కి మద్దతు ఇస్తూ ఓటింగ్‌లో దూసుకుపోతున్నారు. ఇక వీకెండ్‌లో నాగార్జున ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచి చూడాల్సి ఉంది.