MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • నేను మనిషినే.. నీ దయాదాక్షిణ్యాలతో బతుకుతున్నామా? భావోద్వేగానికి లోనైన కంటెస్టెంట్

నేను మనిషినే.. నీ దయాదాక్షిణ్యాలతో బతుకుతున్నామా? భావోద్వేగానికి లోనైన కంటెస్టెంట్

Bigg Boss Telugu 9 promo : బిగ్ బాస్ లో మరింత డ్రామాకి దారి తీస్తుందని క్లారిటీగా కనిపిస్తోంది. “చదరంగం అయినా, రణరంగం అయినా… సర్వైవల్‌కి స్ట్రాటజీ మాత్రమే వెపన్ ” అంటూ విడుదలైంది. తాజా బిగ్‌బాస్ ప్రోమో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. 

2 Min read
Author : Rajesh K
Published : Sep 10 2025, 12:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
హౌస్‌లో హీటెక్కిన నామినేషన్లు
Image Credit : https://www.hotstar.com/in/home

హౌస్‌లో హీటెక్కిన నామినేషన్లు

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లో మొదటి వారం నామినేషన్లే ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. కామనర్లు, సెలబ్రిటీలు ఇద్దరూ తమ సర్వైవల్ కోసం వ్యూహాత్మకంగా నామినేషన్లు వేస్తుండటంతో హౌస్‌లో ఒక్కసారిగా వాతావరణం మరింత హీటెక్కుతోంది. కంటెస్టెంట్లందరూ తన మైండ్ గేమ్స్ ఆడుతూ హౌస్ ను వార్ రూం గా మర్చేస్తున్నారు. నిజంగా తొలివారం నామినేషన్స్ టాస్క్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా మలుపులు తిరిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
భరణి – ఇమ్మానుయేల్ సుత్తి గేమ్
Image Credit : star maa

భరణి – ఇమ్మానుయేల్ సుత్తి గేమ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లో పరిస్థితులు రోజురోజుకి మరింత హీటెక్కుతున్నాయి. “చదరంగం అయినా, రణరంగం అయినా… సర్వైవల్‌కి స్ట్రాటజీ మాత్రమే వెపన్” అంటూ విడుదల చేసిన తాజా ప్రోమో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. తాజా ప్రోమోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది సుత్తి గేమ్. భరణి, ఇమ్మానుయేల్ మధ్య టాస్క్. సుత్తి గేమ్‌లో భరణి-ఇమ్మానుయేల్ పోటీపడ్డారు. చివరికి భరణి గెలిచి, తన నామినేషన్ పవర్‌ను ఉపయోగించి సంజనను నామినేట్ చేశాడు. ఆ తర్వాత సుత్తిని శ్రీజకి అందజేశాడు.

Related Articles

Related image1
పెళ్ళైనప్పటికీ బిగ్ బాస్ రీతూ చౌదరి ఎందుకు ఒంటరిగా ఉంది ? భర్తతో కలిసి ఆమె చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా..
Related image2
Bigg Boss Telugu 9: తండ్రిని ఎదిరించి ఇండస్ట్రీకి, బిగ్ బాస్ ఫస్ట్ కంటెస్టెంట్ గా ముద్ద మందారం హీరోయిన్ ?
36
సంజనపై శ్రీజ ఫైర్
Image Credit : StarMaa

సంజనపై శ్రీజ ఫైర్

నామినేషన్ రౌండ్‌లో ఎక్కువమంది కంటెస్టెంట్స్ టార్గెట్ చేసిన పేరు సంజనది. మానిటర్ ఇచ్చిన సూచనలు పట్టించుకోకపోవడం, కామనర్స్ తక్కువ చేసి చూడటం ఇవన్నీ ఇతర హౌస్‌మేట్స్‌కు చిరాకు తెప్పించాయి. దీంతో ఆమెపై వరుసగా నామినేషన్లు వచ్చాయి. ఇది గేమ్‌లో సంజనకు పెద్ద సవాలుగా మారింది. ఇక

సుత్తి రాగానే శ్రీజ మొదట సంజనపైనే ఫైర్ అయింది. “బాత్రూంలో షాంపూ బాటిల్ పెట్టడం వల్లే ఇబ్బంది వచ్చింది. మా మాట వినకుండా మీరు మీ స్టాండ్ మీదే ఉన్నారుగా.. అది అసలు స్టాండ్‌యే కాదు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆపై తనూజను కూడా నామినేట్ చేస్తూ, ఆమె గత కొన్ని రోజులుగా వేసిన కామెంట్లపై అసహనం వ్యక్తం చేసింది.

46
తనూజ vs హౌస్‌మేట్స్
Image Credit : StarMaa

తనూజ vs హౌస్‌మేట్స్

ఈ నామినేషన్లలో ఎక్కువ హీటెక్కించిన సన్నివేశం తనూజ చుట్టూ తిరిగింది. ఒకేసారి చాలామంది ఆమెపై ఆరోపణలు చేయడంతో ఆమె ఎమోషనల్ అయింది. “మేమూ మనుషులమే.. ఒక్కసారి చెబితే సరిపోతుంది. కానీ ప్రతి ఒక్కరూ వచ్చి అదే మాటలు చెబితే ఎలా?” అంటూ తాను ఎదుర్కొంటున్న ఒత్తిడిని బయటపెట్టింది. వెంటనే పవన్ మాట్లాడుతూ, “నువ్వు మనుషుల్లా చూడట్లేదు” అని చెప్పడం ఆమెను మరింత నొప్పించారు. మరోపైన హరీష్ కూడా అటాక్ చేశారు. “నీ దయా దాక్షిణ్యాల మీద మేము బతుకుతున్నామా?” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

56
భావోద్వేగానికి లోనైన తనూజ
Image Credit : StarMaa

భావోద్వేగానికి లోనైన తనూజ

తనూజ వెంటనే రియాక్ట్ అయ్యింది. “నా బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు” అంటూ కౌంటర్ ఇచ్చింది. నామినేషన్లు ముగిసిన తర్వాత తనూజ సుమన్ శెట్టితో మాట్లాడుతూనే కన్నీళ్లు పెట్టుకుంది. “నామినేషన్ వల్ల కాదు.. కానీ ఒక ఆడపిల్ల బిహేవియర్ గురించి ఇలా మాట్లాడడం బాధిస్తోంది. బయట ప్రపంచంలో ఇది నా ఇమేజ్‌పై ఎలా ప్రభావం చూపుతుందో భయం వేస్తోంది” అంటూ ఎమోషనల్ అయ్యింది. ఈ సన్నివేశం ఆడియెన్స్ హృదయాలను తాకింది.

66
మాస్క్‌మ్యాన్ – భరణి ఘర్షణ?
Image Credit : StarMaa

మాస్క్‌మ్యాన్ – భరణి ఘర్షణ?

మరోవైపు ప్రోమోలో భరణి మాస్క్‌మ్యాన్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ ఇమ్మానుయేల్ అడ్డుకోవడంతో పెద్ద గొడవ తప్పింది. ఇది రాబోయే ఎపిసోడ్స్‌లో మరింత డ్రామాకి దారి తీస్తుందని క్లారిటీగా కనిపిస్తోంది. “చదరంగం అయినా, రణరంగం అయినా… సర్వైవల్‌కి స్ట్రాటజీ మాత్రమే వెపన్ ” అంటూ విడుదల చేసిన బిగ్‌బాస్ ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. నామినేషన్లలో ఎవరెవరు బయటపడతారు? ఎవరి స్ట్రాటజీ వర్కవుట్ అవుతుంది? అన్న ఉత్కంఠతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
వినోదం
వైరల్ న్యూస్
అక్కినేని నాగార్జున

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు ద్రోహం చేసిన సురేఖ, పవర్ స్టార్ జీవితాన్ని మలుపు తిప్పిన చిరంజీవి భార్య
Recommended image2
Pawan Kalyan: పవన్‌ వల్లే ఉదయ్‌ కిరణ్‌ ఫోటోలు లీక్‌.. సుస్మిత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ వెనుక జరిగింది ఇదే
Recommended image3
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Related Stories
Recommended image1
పెళ్ళైనప్పటికీ బిగ్ బాస్ రీతూ చౌదరి ఎందుకు ఒంటరిగా ఉంది ? భర్తతో కలిసి ఆమె చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా..
Recommended image2
Bigg Boss Telugu 9: తండ్రిని ఎదిరించి ఇండస్ట్రీకి, బిగ్ బాస్ ఫస్ట్ కంటెస్టెంట్ గా ముద్ద మందారం హీరోయిన్ ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved