- Home
- Entertainment
- Bigg Boss Telugu 9: తండ్రిని ఎదిరించి ఇండస్ట్రీకి, బిగ్ బాస్ ఫస్ట్ కంటెస్టెంట్ గా ముద్ద మందారం హీరోయిన్ ?
Bigg Boss Telugu 9: తండ్రిని ఎదిరించి ఇండస్ట్రీకి, బిగ్ బాస్ ఫస్ట్ కంటెస్టెంట్ గా ముద్ద మందారం హీరోయిన్ ?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈసారి డబుల్ హౌస్, డబుల్ ధమాకాతో రణరంగం పక్కా అంటూ.. ఈవెంట్ ను నాగార్జున స్టార్ట్ చేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫస్ట్ కంటెస్టెంట్ గా ముద్దమందారం సీరియల్ హీరోయిన్ తనూజ హౌస్ లోకి ఎంటర్ అయ్యింది.

బుల్లితెరపై బిగ్బాస్ రియాల్టీ షో సందడి మొదలైంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 స్టార్ట్ అయ్యింది. అగ్నిపరీక్ష నుంచి ఐదుగురు సామాన్యులకు బిగ్ బాస్ హౌస్ లో అవకాశం లభించబోతోంది. ఇక బిగ్ బాస్ గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో ఫస్ట్ కంటెస్టెంట్ గా సీరియల్ స్టార్ తనూజ ఎంటర్ అయ్యింది. ముద్ద మందారం సీరియల్ తో హీరోయిన్ గా తెలుగు బుల్లితెరపై అడుగు పెట్టిన తనూజ.. తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. బిగ్బాస్ హౌస్ లోకి ప్రతి సంవత్సరం సీరియల్ సెలబ్రెటీస్ రావడం కామన్. గత సీజన్ లో కన్నడ బ్యూటీస్ చేసిన రచ్చ గురించి తెలిసిందే. ఇక ఇప్పుడు ముద్ద మందారం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తనూజ గౌడ ఈసీజన్ లో సందడి చేయడానికి ఫస్ట్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టింది.
బుల్లితెరపై తన అందం, అభినయంతో కట్టిపడేసింది తనూజ. ముద్ద మందారం సీరియల్ తర్వాత మరో సీరియల్ చేయలేదు. చాలా కాలంగా తెలుగు తెరకు దూరంగా ఉంటున్న ఆమె.. ఇప్పుడిప్పుడే తిరిగి టీవీ అడియన్స్ ముందుకు వస్తుంది. తనూజ కర్ణాటకకు చెందిన అమ్మాయి.. కానీ ఒక్క సీరియల్ ద్వారా తెలుగు అడియన్స్ హృదయాలను దొచుకుంది. ఈ సీరియల్ మాత్రమే కాకుండా పలు కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా కూడా ఆమె నటించింది. కానీ ఈ అమ్మడుకు సినిమాలతో అంతగా గుర్తింపు రాలేదు. ఎక్కువగా సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యింది. ముద్ద మందారం తర్వాత నాగ భైరవి సీరియల్ చేసిన ఆమె.. ఆ తర్వాత కన్నడలో పలు సీరియల్స్ లో నటించింది. ఇక తాజాగా బిగ్బాస్ సీజన్ 9లో ఈ అమ్మడు అడుగు పెట్టింది.
వచ్చీ రావడంతోనే తన కాన్ఫిడెన్స్ తో నాగార్జునకే షాక్ ఇచ్చింది తనూజ. తన తండ్రికి తాను సినిమాల్లోకి రావిడం ఇష్టం లేదు, కాని తన ధైర్యం చేసి బయటకు వచ్చి ఇండస్ట్రీలో ఒంటరి పోరాటం చేశానని చెప్పుకొచ్చారు తనూజ. అంతే కాదు ఇంట్లో వాళ్లు గర్వపడేలా ఎదిగి చూపిస్తానంటోంది తనూజ. దాంతో నాగార్జున కూడా తనూజ తండ్రికి బిగ్ బాస్ వేదికగా రిక్వెస్ట్ చేశారు. ఆడపిల్లల్ని ఇండస్ట్రీకి ధైర్యంగా పంపించండి. ఇక్కడ మేము మా బిడ్డల్లా చూసుకుంటాం అని అన్నారు. ఇక తనూజ బాగా వంట చేస్తానని చెప్పుకొచ్చింది. నాగార్జున కొసం స్పెషల్ గా మటన్ బిర్యానీ కూడా చేసుకుని తీసుకొచ్చారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో తనూజ ఆట ఎలా ఉంటుందో చూడాలి.