MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • బిగ్‌ బాస్‌ తెలుగు 9 విన్నర్‌ ఎవరో తేలిపోయింది, బిగ్‌ బాస్‌ చరిత్రలో ఫస్ట్ టైమ్‌.. టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే

బిగ్‌ బాస్‌ తెలుగు 9 విన్నర్‌ ఎవరో తేలిపోయింది, బిగ్‌ బాస్‌ చరిత్రలో ఫస్ట్ టైమ్‌.. టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే

బిగ్‌ బాస్‌ తెలుగు 9 విన్నర్‌కి సంబంధించిన చర్చ జరుగుతుంది. ఆన్‌ లైన్‌ పోలింగ్‌ ప్రకారం ఈ సీజన్‌ విజేత ఎవరో తేలిపోయింది. బిగ్‌ బాస్‌ చరిత్రలో మొదటిసారి అరుదైన సంఘటన చోటు చేసుకోబోతుందట. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 26 2025, 04:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇంట్రెస్టింగ్‌గా మారి బిగ్‌ బాస్‌ తెలుగు 9
Image Credit : Asianet News

ఇంట్రెస్టింగ్‌గా మారి బిగ్‌ బాస్‌ తెలుగు 9

బిగ్‌ బాస్‌ తెలుగు 9 పదకొండు వారాలు పూర్తి చేసుకుంది.   డిసెంబర్‌ మూడో వారం ఈ షో ఫైనల్‌ జరగబోతుంది. ప్రస్తుతం బిగ్‌ బాస్‌ హౌజ్‌లో తనూజ, కళ్యాణ్‌, సుమన్‌ శెట్టి, ఇమ్మాన్యుయెల్‌, భరణి, సంజనా, రీతూ చౌదరీ, డీమాన్‌ పవన్‌, దివ్య ఉన్నారు. గత వారం ఎలిమినేషన్‌ ని నాగార్జున క్యాన్సిల్‌ చేశారు. దీంతో ఎలిమినేట్‌ కావాల్సిన దివ్య సేవ్‌ అయ్యింది. దీంతో బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఇప్పుడు తొమ్మిది మంది ఉన్నారు. ఈ వారంలోగానీ, వచ్చే వారంలోగానీ డబుల్‌ ఎలిమినేషన్‌ ఉండే అవకాశం ఉంది. కానీ ఇటీవల బిగ్‌ బాస్‌ షో మాత్రం ఆసక్తికరంగా సాగుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈ సీజన్‌ బిగ్‌ బాస్‌ తెలుగు 9 విన్నర్‌ ఎవరు?
Image Credit : jio Hotstar

ఈ సీజన్‌ బిగ్‌ బాస్‌ తెలుగు 9 విన్నర్‌ ఎవరు?

ఇదిలా ఉంటే బిగ్‌ బాస్‌ తెలుగు 9 గ్రాండ్‌ ఫినాలే ఇంకా మూడు వారాలే ఉండటంతో ఇప్పుడు విన్నర్‌కి సంబంధించి, టాప్‌ 5 కంటెస్టెంట్లకి సంబంధించిన చర్చ జరుగుతుంది. ఎవరు టాప్‌ 5లో ఉంటారు, ఎవరికి విన్‌ అయ్యే ఛాన్స్ ఉందనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై సోషల్‌ మీడియాలో గట్టిగానే డిస్కషన్‌ స్టార్ట్ అయ్యింది. పలువురు సోషల్‌ మీడియాలో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఎవరు విన్‌ అయ్యే అవకాశం ఉందని, ఎవరు విన్‌ కావాలని కోరుకుంటున్నారనే పోలింగ్‌ నిర్వహించగా, ఆశ్చర్యపరిచే ఫలితం కనిపిస్తోంది.

35
తనూజ విన్నర్‌ ?
Image Credit : starmaa

తనూజ విన్నర్‌ ?

సోషల్‌ మీడియా పోలింగ్‌ ప్రకారం విన్నర్‌ ఎవరో తేలిపోయింది. ఆన్‌లైన్‌ పోలింగ్‌ ప్రకారం ఈ సీజన్‌లో బిగ్‌ బాస్‌ తెలుగు చరిత్రలో మొదటిసారిగా లేడీ కంటెస్టెంట్ విన్నర్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. తనూజ ఈ సారి బిగ్‌ బాస్‌ విన్నర్‌ కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఆ తర్వాత కళ్యాణ్‌కి బిగ్‌ బాస్‌ విన్నర్‌ అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. వీరిద్దరిలో ఒకరు ఈ సారి విన్నర్‌ కన్పమ్‌ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరు నామినేషన్‌లో ఉన్నప్పుడు కూడా టాప్‌లో ఉన్నారు. అత్యధిక ఓటింగ్‌తో టాప్‌లో దూసుకుపోతున్నారు. ఆడియెన్స్ ఓటింగ్‌ ప్రకారం ఈ సారి తనూజగానీ, లేదంటే కళ్యాణ్‌గానీ విజేతగా నిలిచే ఛాన్స్ ఉందని టాక్‌. రెగ్యూలర్‌ బిగ్‌ బాస్‌ షోస్‌లో లేడీ ఇప్పటి వరకు విన్నర్‌ కాలేదు. కానీ ఓటీటీ షోలో మాత్రం బింధుమాధివి వినజేతగా నిలవడం విశేం. ఈ లెక్కన తనూజ విన్నర్‌ అయితే ఆమె చరిత్ర సృష్టించబోతుందని చెప్పొచ్చు.

45
బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు
Image Credit : Asianet News

బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు

ఇక ఈ సీజన్‌ టాప్‌ 5లో నిలిచే కంటెస్టెంట్లు ఎవరనేది కూడా ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో సోషల్‌ మీడియాలో చర్చ ప్రకారం ఈ సారి టాప్‌ 5 లో నిలిచే కంటెస్టెంట్లు కళ్యాణ్‌, తనూజ, ఇమ్మాన్యుయెల్‌, రీతూ చౌదరీ, సంజనా అని అంటున్నారు. అయితే వీరిలో రీతూ, సంజనా స్థానాల్లో సుమన్‌ శెట్టి, డీమాన్‌ పవన్‌లు యాడ్‌ అయ్యే అవకాశం ఉంది. కింది రెండు స్థానాల్లో కన్‌ఫ్యూజన్‌ ఉన్నా, టాప్‌ 3 మాత్రం కన్ఫమ్‌ అంటున్నారు. తనూజ, కళ్యాణ్‌, ఇమ్మాన్యుయెల్‌ మధ్యనే టైటిల్‌ కోసం పోటీ ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇమ్మాన్యుయెల్‌ని విన్నర్‌ని చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. 

55
రేసులో లేని భరణి
Image Credit : starmaa

రేసులో లేని భరణి

అయితే భరణి టాప్‌ 5లో నిలుస్తారా? అనే ఆసక్తికర చర్చ కూడా జరుగుతుంది. కానీ రేసులోనే లేరు. భరణి ఈ వారంగానీ, వచ్చే వారం గానీ ఎలిమినేషన్‌కి అవకాశం ఉందంటున్నారు. డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటే ఈ వారమే ఆయన హౌజ్‌ని వీడే అవకాశం ఉందని టాక్‌. మొత్తంగా బిగ్‌ బాస్‌ తెలుగు 9 విజేత కామన్‌ మ్యాన్‌ అవుతాడా? సెలబ్రిటీ అవుతాడా అనేది చూడాలి. కానీ ఈ సారి సెలబ్రిటీకే ఎక్కువగా ఛాన్స్ ఉందని సమాచారం. నాగార్జున హోస్ట్ గా ఈ షో రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Top 10 Heroines: పడిపోయిన నయనతార, కాజల్‌, త్రిష, దూసుకొచ్చిన సాయిపల్లవి.. సమంత, రష్మిక స్థానాలివే
Recommended image2
Chiranjeevi: నాగార్జున సినిమా హోరులో డిజాస్టర్ అయిన చిరంజీవి మూవీ..డైరెక్టర్ తో గొడవ అందుకేనా ?
Recommended image3
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Related Stories
Recommended image1
అనసూయని కోలుకోలేని దెబ్బకొట్టిన ఈ ఒక్క నిర్ణయం.. టాప్‌లో ఉండాల్సిన యాంకర్‌ ఒంటరిగా మిగిలిపోయిందా?
Recommended image2
ఆంధ్ర కింగ్‌ తాలూకా మూవీ బాక్సాఫీసు టార్గెట్‌.. రామ్‌ పారితోషికం వెనక్కి ఇవ్వాలంటూ నిర్మాతల డిమాండ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved