- Home
- Entertainment
- Bigg Boss Telugu 9: `బిగ్ బాస్ తెలుగు 9`లో సంచలన మార్పులు, ఈ సారి వారికి నో ఛాన్స్ ?
Bigg Boss Telugu 9: `బిగ్ బాస్ తెలుగు 9`లో సంచలన మార్పులు, ఈ సారి వారికి నో ఛాన్స్ ?
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్‌కి సంబంధించిన క్రేజీ అప్‌డేట్లు వినిపిస్తున్నాయి. పలు ఆసక్తికర విషయాలు లీక్ అయ్యాయి. బిగ్ బాస్ ప్రియులకు గుడ్ న్యూస్ వినిపిస్తుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Nagarjuna
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఇండియాలో బాగా పాపులర్ అయిన షో. దీనికి ఆడియెన్స్ నుంచి విశేష స్పందన లభిస్తుంది. క్రమ క్రమంగా షో చూసే వారి సంఖ్య పెరుగుతుంది. యువత నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు అంతా చూస్తున్నారు. దీనికితోడు లైవ్ స్ట్రీమింగ్ ఉన్న నేపథ్యంలో చాలా మంది టైమ్ పాస్ కి కూడా చూస్తున్నారు.
Bigg Boss Telugu 9 update
తెలుగులో బిగ్ బాస్ ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. గత ఆరు సీజన్లుగా నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. రాబోయే సీజన్ కి కూడా ఆయనే హోస్ట్ గా ఉండబోతున్నారని తెలుస్తుంది. ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. కొన్ని వివాదాలే వెంటాడినా, ఇలాంటి షో యువతని చెడగొడుతుందనే కామెంట్లు వినిపించినా అవేవి షోని ఆపలేకపోయాయి. ఇంకా షోకి క్రేజ్ ని పెంచాయి.
Bigg Boss Telugu 9 update
ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ కి సంబంధించిన కొన్ని లీకేజీ వార్తలు ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి. బిగ్ బాస్ లవర్స్ ని ఆకట్టుకుంటున్నాయి. మరి ఇంతకి మ్యాటర్ ఏంటంటే ఈ సారి షోముందుగానే ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. సాధారణంగా సెప్టెంబర్లో షోని ప్రారంభిస్తున్నారు. కానీ ఈ సారి ఏప్రిల్, మే వరకు స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
Bigg Boss Telugu 9 update
ఇదిలా ఉంటే ఈ సారి మరో ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఈ సారి షోలో కీలక మార్పులు చేయబోతున్నారట. గత సీజన్ పెద్దగా ఆదరణ పొందలేదు. ఏడో సీజన్తో పోల్చితే ఎనిమిదో సీజన్ టీఆర్‌పీ రేటింగ్ తగ్గిపోయింది. ఏమాత్రం ఆసక్తికరంగా లేదని, రొటీన్ గా, బోరింగ్ గా ఉందనే విమర్శలు వచ్చాయి.
ఎంగేజ్ చేసే ఎలిమెంట్లు లేవని, కంటెంస్టెంట్లు అంతగా ఆడటం లేదనే విమర్శలు వచ్చాయి. షో చివర్లో కాస్త రక్తికట్టేలా ఉన్నా అంతకు ముందు మాత్రం బోరింగ్గా సాగిందనే విమర్శలు వచ్చాయి. దీనికితో వైల్డ్ కార్డ్ ద్వారా కమెడీ ఆర్టిస్ట్ లను దించడంతో కొంత వరకు రిలీఫ్ నిచ్చింది. అలాగే లవ్ ట్రాక్ ల విషయంలోనూ డిజప్పాయింట్ ఎదురైంది.
Bigg Boss Telugu 9 update
దీంతో ఈ సారి జాగ్రత్తలు తీసుకుంటున్నారట. చాలా కీలక మార్పులు చేశారట. ఈ సారి కామన్ మ్యాన్ అనే ఎలిమెంట్ ఉండబోదట. చాలా వరకు పాపులర్ ఆర్టిస్ట్, సెలబ్రిటీలకే ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నారట.
అలాగే పెద్ద ఏజ్ వాళ్లని కూడా తీసుకోకూడదని అనుకుంటున్నారట. సీనియర్లు, ఏజ్ పెద్ద వాళ్లు వచ్చి హౌజ్లో ముచ్చట్లు తప్ప మరేం చేయడం లేదు, కంటెంట్ ఇవ్వడం లేదు. దీంతో యాక్టివ్గా ఉండే సెలబ్రిటీలను చూస్తున్నారట.
దీనికితోడు ఎంటర్టైన్ చేసే సెలబ్రిటీలను చూస్తున్నారట. లవ్ ట్రాక్, రొమాంటిక్ విసయాలకు ప్రయారిటీ ఇస్తున్నారట. యూత్ ని ఆకట్టుకునేలా లవ్ ట్రాక్ లు నడిపించాలని, అలాంటి కంటెస్టెంట్లకి మొదటి ప్రాధాన్యత అని, గొడవలు పెట్టుకునే వారికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారని, కంటెంట్ క్రియేట్ చేయగలిగే వారిని చూస్తున్నారట.
Bigg boss telugu
అలాగే గత సీజన్ లాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని తెలుస్తుంది. గత సీజన్లలో ఉన్న వారిని కూడా తీసుకుంటారని సమాచారం. ఇలా పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారట. అలాగే గేమ్ ల స్ట్రాటజీల విషయంలోనూ మార్పులు ఉంటాయని, ఈసారి ఆట రంజుగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. మధ్య మధ్యలో ట్విస్ట్ లు, టర్న్ లు కూడా ఉంటాయని, ఊహించని సర్‌ప్రైజ్‌ల, షాకింగ్ విషయాలు ఉండేలా చూసుకుంటున్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం ఇలాంటి విషయాలపై బిగ్ బాస్ నిర్వహకులు వర్క్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ విషయాలు మాత్రం ఈ సారి షోపై ఆసక్తిని పెంచుతున్నాయని చెప్పొచ్చు. స్టార్ మా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఇది టెలికాస్ట్ కాబోతంది. దీనికి కూడా నాగార్జుననే హోస్ట్ గా ఉంటారని సమాచారం.
read more: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు ముహూర్తం ఫిక్స్, ఈసారి రెండు నెలలు ముందే సందడి
also read: సమంత ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఎందుకు అంత ఇష్టమో వెల్లడించిన సామ్.