- Home
- Entertainment
- ఆరో వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్, బిగ్ బాస్ 9 నుంచి భరణి ఔట్.. తనూజ, దివ్య హార్ట్ బ్రేక్?
ఆరో వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్, బిగ్ బాస్ 9 నుంచి భరణి ఔట్.. తనూజ, దివ్య హార్ట్ బ్రేక్?
బిగ్ బాస్ తెలుగు 9 ఆరో వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ వారం ఎలిమినేట్ అయ్యిందో తెలిసిపోయింది. ఎవరూ ఊహించిన విధంగా భరణి ఈ వారం హౌజ్‌ని వీడారు.

బిగ్ బాస్ తెలుగు 9 ఆరో వారం ఎలిమినేషన్
బిగ్ బాస్ తెలుగు 9 ఆరో వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. భరణి, దివ్య, తనూజ, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, రాము రాథోడ్ ఈ వారం నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఎవరు హౌజ్‌ని వీడుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే గురువారం వరకు వచ్చిన ఓటింగ్ ప్రకారం రాము రాథోడ్ డౌన్‌లో ఉన్నారు. దీంతో ఈ వారం ఆయన ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. అయితే రాము రాథోడ్‌గానీ, లేదంటే డీమాన్ పవన్ గానీ ఎలిమినేషన్‌కి ఛాన్స్ ఉందని అన్నారు.
ఈ వారం భరణి ఎలిమినేట్
కానీ చివరి నిమిషంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. శుక్రవారం ఓటింగ్ తలక్రిందులైంది. బాటమ్ నుంచి మూడో స్థానంలో ఉన్న భరణి ఈ వారం ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. ఎవరూ ఊహించని విధంగా ఈ వారం భరణిని బిగ్ బాస్ ఎలిమినేట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఈ విషయం కన్ఫమ్ అయ్యింది. ఇది అటు హౌజ్ మేట్స్ నే కాదు, ఇటు ఆడియెన్స్ ని కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే భరణిని అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా భావించారు. చాలా మంది కంటెస్టెంట్లు కూడా అదే చెప్పారు. కానీ ఇప్పుడు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందరి అంచనాలు తలక్రిందులయ్యాయి.
భరణిని నాన్నగా భావించిన తనూజ
బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లో భరణి తనదైన స్టయిల్‌లో గేమ్స్ ఆడుతూ వస్తున్నాడు. ఇతరుల మాదిరిగా పెద్దగా హడావుడి చేయకుండా చాలా సైలెంట్‌గా టాస్క్ ల్లో పాల్గొంటున్నాడు. ఏదైనా గొడవలు అయినా ఆయన కూల్ గా డీల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. హౌజ్‌లో ఒక పెద్దగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు తనూజ ఏకంగా ఆయన్ని నాన్నగా పిలుస్తోంది. పదే పదే నాన్న నాన్న అంటోంది. భరణి కూడా ఆమెని కూతురుగానే భావిస్తూ వచ్చారు. వీరి రిలేషన్‌కి సంబంధించిన ఎన్ని విమర్శలు, సెటైర్లు వచ్చినా వాటిని లెక్కచేయలేదు. స్ట్రాంగ్‌గా ఉంటూ స్పెషల్‌గా నిలిచారు. ఇప్పుడది బ్రేక్ కాబోతుంది.
తనూజ, దివ్యల హార్ట్ బ్రేక్ ?
తనూజ విషయంలోనే కాదు, దివ్య విషయంలోనూ అలాంటి రిలేషనే ఉంది. దివ్య కూడా భరణిని ఫాదర్ ఫిగర్‌గానే భావిస్తూ వచ్చారు. తమ రిలేషన్‌ని పెద్దగా బయటపెట్టకపోయినా, ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు. గేమ్స్ లోనూ సపోర్ట్ చేసుకున్నారు. ఓపెన్‌గానే తమ బాండింగ్ గురించి మాట్లాడుకున్నారు. ఇతర హౌజ్ మేట్స్ రాంగ్‌గా మాట్లాడుకున్నా పట్టించుకోలేదు. అలా భరణి, తనూజ, దివ్యల మధ్య బాండింగ్ హౌజ్‌లో స్పెషల్‌గా నిలుస్తోందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఆ బాండింగ్ బ్రేక్ అయ్యే పరిస్థితి నెలకొంది. ఈ వారం భరణి ఎలిమినేషన్ కన్ఫమ్ అంటున్నారు. ఇదే జరిగితే అటు తనూజ, ఇటు దివ్యల హార్ట్ బ్రేక్ అయ్యే పరిస్థితి నెలకొంటుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

