MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • దివ్వెల మాధురి అసలు రంగు బయటపెట్టిన నాగార్జున, ఇమ్మాన్యుయెల్‌కి పగిలిపోతుందంటూ వార్నింగ్‌

దివ్వెల మాధురి అసలు రంగు బయటపెట్టిన నాగార్జున, ఇమ్మాన్యుయెల్‌కి పగిలిపోతుందంటూ వార్నింగ్‌

Bigg Boss Telugu 9: బిగ్‌ బాస్‌ తెలుగు 9 ఈ శనివారం ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో వచ్చింది. ఇందులో దివ్వెల మాధురికి నాగార్జున ఇచ్చిపడేశాడు. ఆమె అసలు రంగు బయటపెట్టాడు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 18 2025, 04:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బిగ్‌ బాస్‌ లోకి రావడంతోనే రచ్చ స్టార్ట్ చేసిన దివ్వెల మధురి
Image Credit : starmaa

బిగ్‌ బాస్‌ లోకి రావడంతోనే రచ్చ స్టార్ట్ చేసిన దివ్వెల మధురి

బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌లోకి ఐదో వారంలో వైల్డ్ కార్డ్ ద్వారా ఆరుగురు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఇద్దరు సెన్సేషనల్‌ కంటెస్టెంట్లు ఉన్నారు. దివ్వెల మాధురి, రమ్య మోక్ష సోషల్‌ మీడియాలో ఎంతగా పాపులర్‌ అయ్యారో తెలిసిందే. దీంతో ఇకపై హౌజ్‌లో రచ్చ వేరేలా ఉంటుందని భావించారు. అయితే ఎంట్రీతోనే మాధురి రచ్చ షురూ చేసింది. హౌజ్‌లో ఎవరు ఎలా ఉంటున్నారో నిర్మొహమాటంగా చెప్పింది. అదే సమయంలో ఏదైనా విషయంపై గట్టిగా మాట్లాడుతూ అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కళ్యాణ్‌తో గొడవ పడ్డ దివ్వెల మాధురి
Image Credit : starmaa

కళ్యాణ్‌తో గొడవ పడ్డ దివ్వెల మాధురి

ఈ క్రమంలో ఆమె కొన్ని పొరపాట్లు కూడా చేసింది. ఆవేశంలోనో, హడావుడి చేయాలనుకోవడమోగానీ హౌజ్‌లోకి వచ్చిన మొదటి రోజే కెప్టెన్‌ కళ్యాణ్‌తో గొడవకు దిగింది మాధురి. హౌజ్‌లో కిచెన్‌కి సంబంధించిన పనులను కళ్యాణ్‌ వివరణ ఇస్తున్నాడు. ఈ క్రమంలో కాస్త సీరియస్‌ రియాక్ట్ అయ్యింది మాధురి.  ఎటకారాన్ని వ్యక్తం చేసింది. ఇందులో కళ్యాణ్‌ `రేపటి నుంచి షెడ్యూల్‌ ఇలా ఉండదు` అని చెప్పగా, `నేను అక్కడకు వచ్చి అరగంట కూర్చున్నాను, అప్పుడు ఏం చేశారు మీరు, లేటవుతుందని తెలియదా మీకు` అని ఘాటుగా రియాక్ట్ అయ్యింది. దీంతో `మీరిలా మాట్లాడితే, నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుంది` అని కళ్యాణ్‌ అన్నాడు. దీనికి మాధురీ `మాట్లాడండీ` అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది.

36
మాధురిదే తప్పు అని తేల్చిన సుమన్‌ శెట్టి
Image Credit : starmaa

మాధురిదే తప్పు అని తేల్చిన సుమన్‌ శెట్టి

ఇదే విషయాన్ని శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున ప్రశ్నించాడు. మాధురిని నిలదీశాడు. ఇందులో తప్పువెరిది అని సుమన్‌ శెట్టిని అడగ్గా, మాధురిదే అని స్పష్టం చేశాడు. దీనికి నాగ్‌ రియాక్ట్ అవుతూ మాట్లాడిన విషయంలో తప్పులేదు, మాట్లాడిన తీరు లో తప్పు ఉందన్నాడు. `సర్‌ నా వాయిసే అలా ఉంటుంది` అని మాధురి అనగా, `ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావ్ గా` అని నాగార్జున కౌంటర్‌ ఇవ్వడం విశేషం. దీంతో మాధురికి మతిపోయింది. మాట తీరే మిమ్మల్ని అందంలోకి ఎక్కిస్తుందని నాగ్‌ చెప్పడం విశేషం. 

46
పవర్‌ అస్త్ర పవర్‌ కోల్పోయిన మాధురి
Image Credit : starmaa

పవర్‌ అస్త్ర పవర్‌ కోల్పోయిన మాధురి

ఇంతటితో వదల్లేదు నాగార్జున. ఆమెకి కిరీటం ఇచ్చి ఆ పవర్‌కి ఆమె అర్హురాలా? కాదా? అనేది తేల్చే పనిలో పడ్డారు. ఆడియెన్స్ ఓటింగ్‌కి వెళ్లారు. ఇందులో అరవై శాతం మాధురితో వ్యతిరేకించారు. ఆమె పవర్‌ అస్త్రకి అర్హురాలు కాదని తేల్చారు. నలభై శాతం మంది మాత్రమే అర్హురాలుగా తెలిపారు. దీంతో ఈ పవర్‌కి అర్హురాలు కాదని చెప్పి ఆమె షీల్డ్ లో ఉన్న పవర్‌ని తీసేశారు.

56
వైల్డ్ కార్డ్ పవర్స్ నిగ్గు తేల్చిన నాగార్జున
Image Credit : starmaa

వైల్డ్ కార్డ్ పవర్స్ నిగ్గు తేల్చిన నాగార్జున

మరోవైపు ఇతర పవర్‌ అస్త్ర కలిగిన వారి నిగ్గు తేల్చారు. ఆయేషా వద్ద ఉన్న నామినేషన్‌ పవర్‌పై ఓపీనియన్‌ తీసుకోగా, దానికి ఆమె అర్హురాలే అని తనూజ వెల్లడించింది. తనకు పోటీగా వచ్చినా అందులో తప్పులేదని తనూజ చెప్పడం విశేషం. మరోవైపు రీతూ చౌదరీ కూడా ఓకే చెప్పింది. ఆయేషా వద్ద ఆ పవర్‌ ఉన్నా, తనకు ఎలాంటి సమస్య లేదని, అందుకే ఆమె అర్హురాలు అని చెప్పింది రీతూ. ఇలాంటి వారికి డైరెక్ట్ నామినేషన్‌ చేసే పవర్‌ అవసరం లేదని చెప్పింది. దీనిపై వాదనలు జరగడం విశేషం. లేటెస్ట్ గా విడుదలైన శనివారం ఎపిసోడ్‌ ప్రోమో ఆకట్టుకుంది.

66
ఇమ్మాన్యుయెల్‌కి వార్నింగ్‌ ఇచ్చిన నాగార్జున
Image Credit : starmaa

ఇమ్మాన్యుయెల్‌కి వార్నింగ్‌ ఇచ్చిన నాగార్జున

అంతటితో ఆగలేదు, శనివారం ఎపిసోడ్‌లో ఒక్కొక్కిరి బండారం బయటపెట్టాడు. అందులో భాగంగా ఇమ్మాన్యుయెల్‌ని పగిలిపోతుందంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. మరి దీంతో ఇమ్మూ షాక్‌ అయ్యాడు. మరి ఇంతకి ఇమ్మాన్యుయెల్‌ చేసిన తప్పేంటి? ఎందుకు అలా అన్నాడనేది ఈ రోజు ఎపిసోడ్‌లో తేలనుంది. వీరితోపాటు వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చిన రమ్య మోక్ష, నిఖిల్‌ నాయర్‌, శ్రీనివాసా సాయిలకు ఉన్న పవర్స్ విషయంలో కూడా దానికి వాళ్లు అర్హులేనా అనేది తేల్చారు నాగార్జున. మొత్తంగా ఈ శనివారం ఎపిసోడ్‌ ఆసక్తికరంగా ఉంటుందని లేటెస్ట్ గా విడుదలైన ప్రోమోని బట్టి అర్థమవుతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
డేంజర్‌ జోన్‌లో ఆ కంటెస్టెంట్‌.. ఈ వారం బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌ నుంచి ఎలిమినేషన్‌ పక్కా?
Recommended image2
`K ర్యాంప్‌` మూవీ రివ్యూ రేటింగ్‌.. కిరణ్‌ అబ్బవరం దీపావళి విన్నర్‌గా నిలిచాడా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved