- Home
- Entertainment
- రీతూ చౌదరీ, డీమాన్ పవన్‌ల రిలేషన్ అంత బ్యాడ్‌గా ఉందా? రమ్య మోక్ష మొత్తం బయటపెట్టేసిందిగా
రీతూ చౌదరీ, డీమాన్ పవన్‌ల రిలేషన్ అంత బ్యాడ్‌గా ఉందా? రమ్య మోక్ష మొత్తం బయటపెట్టేసిందిగా
వీకెండ్‌లో వచ్చిన హోస్ట్ నాగార్జున రమ్య మోక్ష రియాలిటీని బయటపెట్టాడు. అదే సమయంలో రీతూ చౌదరీ, డీమాన్ పవన్‌ల మధ్య రిలేషన్ లో నిజమెంతా అనేది నిగ్గుతేల్చాడు.

రీతూ చౌదరీ, డీమాన్ పవన్ మధ్య రిలేషన్ బహిర్గతం
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్‌లో లవ్ బర్ద్స్ గా రాణిస్తోన్న జంట రీతూ చౌదరీ, డీమాన్ పవన్. ఈ ఇద్దరు ప్రారంభం నుంచే క్లోజ్‌గా ఉంటున్నారు. ఆల్మోస్ట్ లవర్స్ గా రాణిస్తున్నారు. స్నేహితులుగా చెలామణి అవుతున్నా, వాళ్ల తీరు చూస్తుంటే లవర్స్ లాగే అనిపిస్తోంది. ఇద్దరు అంతటి క్లోజ్‌గా మూవ్ అవుతున్నారు. ఒకరికొకరు తినిపించడం, కబుర్లు చెప్పుకోవడం, ఒకరికోసం ఒకరు సపోర్ట్ చేసుకోవడం చూస్తుంటే ఈ ఇద్దరు లవర్స్ అనే ఫీలింగ్ తెప్పిస్తోంది. అయితే తమ రిలేషన్ ఏంటనేది తేల్చుకునే సమయం వచ్చింది. శనివారం ఎపిసోడ్ లో నాగార్జున వీరిద్దరిని నిలదీశాడు. రమ్య మోక్ష చెప్పిన విషయాలను సైతం బహిర్గతం చేశారు.
రమ్య రియాలిటీ చూసి షాకైన కళ్యాణ్
శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వారికి దక్కిన పవర్స్ గురించి చర్చించారు. ఎవరు దానికి అర్హులో అటు హౌజ్ మేట్స్ ని, ఇటు ఆడియెన్స్ ని ప్రశ్నించారు. ఆడియెన్స్ ఓటింగ్ ద్వారా తమ అభిప్రాయం వెల్లడించారు. దివ్వెల మాధురి తన పవర్‌కి అర్హురాలు కాదని తేల్చారు. ఇక రమ్య మోక్షని, కళ్యాణ్‌ని కన్ ఫెషన్ రూమ్‌కి పిలిచారు నాగార్జున. ఇందులో రమ్య మోక్ష చేసిన కామెంట్లకి సంబంధించిన వీడియోని చూపించారు. తనపై ఆమె చేసిన కామెంట్లని చూసి కళ్యాణ్ షాక్ అయ్యారు.
కళ్యాణ్ గురించి రమ్య షాకింగ్ కామెంట్
నాగార్జున చూపించిన వీడియోలో `చాలా ఇరిటేటింగ్‌గా ఉంది. చేతులు వేసి ఇలా ఇలా అంటుంటే నాకైతే ఎంత ఇరిటేటింగ్‌గా ఉందో తెలుసా?, చూస్తేనే ఇబ్బందిగా ఉంది. అదే నన్ను చేస్తే లాగిపెట్టి ఒక్కటి ఇచ్చేస్తా` అని మాధురికి చెప్పింది రమ్య. ఇది చూసి ఆశ్చర్యపోవడం కళ్యాణ్ వంతు అయ్యింది. ఒక మనిషిని అమ్మాయిల పిచ్చి అనడానికి నువ్వు అతన్ని జీవితాంతం చూడలేదు` అని నాగార్జున రమ్యని నిలదీశాడు. అంతేకాదు `క్రౌన్ పెట్టుకుంటే మనం రాణి కాలేము, మనల్ని దానికి అర్హత ఉండేలా చేసేది మన మాట తీరు` అని తెలిపారు నాగార్జున. ఈ సందర్భంగానే కళ్యాణ్ అమ్మాయిలతో ప్రవర్తిస్తున్న తీరు గురించి ఆడియెన్స్ ఒపీనియన్ తీసుకోగా, వాళ్లు 53 కాదు అని, 47 అవును అని ఇచ్చారు. ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీకి దగ్గరలో ఉండటం గమనార్హం.
రీతూ, పవన్ రిలేషన్ లో రియాలిటీ ఇదే
అనంతరం కన్‌ఫెషన్ రూమ్‌కి రీతూ చౌదరీ, డీమాన్ పవన్‌లను పిలిచారు నాగార్జున. మీ ఇద్దరి మధ్య నువ్వు ఏ జోన్‌లో ఉన్నావని ప్రశ్నించాడు. దీనికి రీతూ రియాక్ట్ అవుతూ, తాను చాలా కంఫర్టబుల్ గా ఉన్నానని, తనకు ఏదైనా కంఫర్టబుల్‌గా చెప్పే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది వీడే(పవన్) సర్ అని రీతూ చెప్పింది. ఆ తర్వాత వీరికి ఒక వీడియో చూపించాడు నాగ్. ఇందులో రమ్య, డీమాన్ పవన్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. `నేను జెన్యూన్‌గా అనిపించలేదా నీకు` అని రమ్యని అడగ్గా, ఆమె `చాలా బ్యాడ్ ఉంది ఓకేనా, అంతకు మించి ఏం చెప్పను` అని అంటే, `నేను లవ్ చేయట్లేదు. అపోజిట్ పర్సన్ గురించి నేను చూసింది` అంటూ ఏదో చెప్పబోయాడు పవన్. `అమ్మాయి జెన్యూనా కాదా, ఏంటనేది ఆ అమ్మాయికే తెలియాలి. నాకు సంబంధం లేదు. బయట ఏం జరిగిందనేది మాత్రమే నేను చెబుతున్నా` అని రమ్య వెల్లడించింది.
డీమాన్ పవన్ చెప్పిందంతా అబద్దమేనా?
అనంతరం పవన్‌ని నాగార్జున మళ్లీ అడిగాడు, ఏ జోన్‌లో ఉన్నావని, దీనికి ఆయన రియాక్ట్ అవుతూ, కంఫర్టబుల్ జోన్‌లో ఉన్నట్టు తెలిపాడు. దీనిపై రీతూ స్పందిస్తూ `నేను చాలా క్లారిటీతో ఉన్నాను, నాకు నా గేమ్ ముఖ్యమ`ని చెప్పింది. దీంతో పవన్ చెబుతున్నది ఎంత వరకు నిజమనేది ఆడియెన్స్ అభిప్రాయం తీసుకోగా, వంద శాతం తప్పుగానే ఓటింగ్ ఇవ్వడం షాకిస్తోంది. ఆ తర్వాత తనూజ విషయంలో రమ్య మోక్ష చేసిన కామెంట్లని చూపించాడు నాగ్. ఆమె వీడియో చూసి తనూజ ఆశ్చర్యపోయింది. మొత్తంగా అటు మాధురి, ఇటు రమ్య హౌజ్‌లో రచ్చ లేపుతున్నారనేది దీన్ని బట్టి అర్థమవుతోంది. ఈ విషయంలోనే వీరిని నాగ్ నిలదీశాడు. వాళ్ల రియల్ రంగు బయటపెట్టాడు. తాజాగా విడుదలైన ప్రోమోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.