MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • మసాజ్ చేయమంటే దివ్యను గోకుతున్న భరణి, తనూజకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

మసాజ్ చేయమంటే దివ్యను గోకుతున్న భరణి, తనూజకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

Bigg Boss Telugu 9 బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ ల సమరం కొనసాగుతోంది. ఎవరికి వారు పోటీ పడుతూ ముందుకు కొనసాగడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో గొడవలు, కొట్లాటలు కామన్ అయిపోయాయి.

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 11 2025, 11:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్ బాస్ హౌస్ లో బీబీ రాజ్యం టాస్క్..
Image Credit : Star Maa

బిగ్ బాస్ హౌస్ లో బీబీ రాజ్యం టాస్క్..

బిగ్‌బాస్ హౌస్ లో ప్రస్తుతం టాస్క్ ల సమరం కొనసాగుతోంది. ప్రతీవారంలా.. ఈ వారం కూడా టాస్క్ ల విషయంలో ఏదో ఒక రచ్చ జరగడం కామన్ అయిపోయింది. రసవత్తరంగా కొనసాగుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో ప్రస్తుతం కెప్టెన్సీ టాస్కులు జరుగుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ గా ఇమ్మాన్యుయేల్ ఉండగా.. కెప్టెన్నసీ టాస్క్ జోరుగా సాగుతోంది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ బీబీ రాజ్యంగా మారిపోయింది. ఈ బీబీ రాజ్యానికి పవన్ కళ్యాణ్ రాజు కాగా.. దివ్య, రీతూ ఇద్దరూ మహారాణులు అయ్యారు. తనూజ, నిఖిల్, డీమాన్, సంజన నలుగురిని కమాండర్లుగా సెలక్ట్ చేయగా.. మిగిలినవారిని రాజ్యంలోని ప్రజలను సెలక్ట్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భరణీతో మసాజ్ చేయించుకున్న దివ్య
Image Credit : Star Maa

భరణీతో మసాజ్ చేయించుకున్న దివ్య

ఇక వీరి మధ్య బిగ్‌బాస్ హౌస్ లో టాస్కులు హోరా హోరీగా కోనసాగుతున్నాయి. టాస్కులు లేని ఖాళీ సమయంలో తమకు నచ్చిన వాళ్లతో సేవలు చేయించుకునే అవకాశం రాజు, రాణీలకు బిగ్ బాస్ ఇచ్చాడు. ఈ క్రమంలో రాణి దివ్య ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. బిగ్ బాస్ రాజ్యంలోని ప్రజలతో బాగా సేవలు చేయించుకుంటోంది. ఈక్రమంలో భరణితో హెడ్ మసాజ్ చేయించుకుంది దివ్య.

35
మసాజ్ చేయమంటే గోకుతావేంటి..
Image Credit : Star Maa

మసాజ్ చేయమంటే గోకుతావేంటి..

భరణి రాణివారుగా ఉన్న దివ్యకు మసాజ్ చేయడానికి సిగ్గుపడ్డాడు. అయినా సరే భరణిని వదిలిపెట్టలేదు దివ్య.. ఇక దివ్యకు భరణి మసాజ్ చేయమంటే వేళ్ళతో తలపై గోకడం మొదలు పెట్టాడు. మసాజ్ చేయమంటే గోకుతావేంటి అని దివ్య..భరణికి స్వీట్ వార్నింగ్ ఇ్చింది. ఇక వీరి మధ్యలో సుమన్ శెట్టి నిల్చువాలని ఆర్డర్ వేయడంతో..మరో శిక్ష వేయండి మహారాణి అంటూ కామెడీ చేశాడు భరణి. దివ్యకు భరణికి మధ్యలో సుమన్ శెట్టి నిల్చొని.. భరణి కళ్లలో కళ్లు పెట్టి చూడాలని మహారాణి ఆర్డర్ వేసింది. ఆతరువాత కమాండర్స్ గా ఉన్న నలుగురికి టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ టాస్క్ కు రీతూ సంచాలక్ గా ఉండగా.. సంజనాకు, రీతుకు మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆతరువాత సంజన ఈ టాస్క్ లో ఓడిపోయింది.

45
టాస్క్ లో పవన్ కళ్యాణ్ కు అగ్నిపరీక్ష
Image Credit : Asianet News

టాస్క్ లో పవన్ కళ్యాణ్ కు అగ్నిపరీక్ష

మొదటి టాస్క్ లో ఒడిపోయిన సంజన తన కమాండర్ తన స్థానం నిలబెట్టుకోవడానికి బిల్డ్ ఇట్ టూ విన్ ఇట్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. తనతో పోటీ చేసే వారిని ఎంచుకునే అవకాశం ఇవ్వగా.. ఆమె సుమన్ ను ఎంచుకుంది. ఈ టాస్క్ లో సుమన్ శెట్టి, సంజన ఇద్దరూ పోటీ పడ్డారు. సంజనాకు పోటీగా సుమన్ టాస్క్ అదరగొట్డాడు. ఇందులో తమకు కేటాయించిన బాక్సులను ఒక్కొట్టిగా సెట్ చేయాలి. ఈ టాస్కులో సుమన్ శెట్టి హైట్ తక్కువ కావడంతో సంజనకు ప్లస్ అయ్యింది. అయినప్పటికీ సంజకు ఈక్వెల్ గా టవర్ నిర్మించాడు. ఇద్దరిలో విన్నర్ ఎవరనేది తేల్చడం సంచాలక్ గా పవన్ కళ్యాణ్ కు అగ్నిపరిక్షలా మారింది.

55
తనూజపై ఫైర్ అయిన పవన్ కళ్యాణ్
Image Credit : Asianet News

తనూజపై ఫైర్ అయిన పవన్ కళ్యాణ్

ఇద్దరి టవర్స్ ఈక్వెల్ గా ఉండటంతో ... టవర్ ఫర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి అంటూ సంజనను విన్నర్ గా ప్రకటించాడు కళ్యాణ్. కానీ టవర్ సరిగ్గా ఉండాలని ముందు చెప్పలేదన్న కారణంగా.. కళ్యాణ్ నిర్ణయాన్ని చాలామంది హౌస్ మెంట్స్ వ్యతిరేకించారు. అప్పుడే మధ్యలోకి వచ్చిన తనూజ… టవర్ ఫర్ఫెక్ట్ గా ఉండాలని ముందే చెప్పలేదంటూ గొడవ చేసింది. దీంతో కళ్యాణ్ సీరియస్ అయ్యాడు. నీకు సగం సగం అర్థమైతే సగం సగం చెప్పకు అని పెద్ద పెద్దగా అరిచాడు. అంతే కాదు ఇష్టమొచ్చినట్లుగా పోట్రే చేస్తే వినడానికి ఎవరూ రెడీగా లేరు అంటూ ఇచ్చిపడేశాడు. దీంతో ఎవడూ పోట్రే చేయలేదు అంటూ తనూజ కూడా రివర్స్ లో గట్టిగా వాదించింది. దాంతో మరోసారి పవన కళ్యాణ్ ఫైర్ అయ్యాడు. ఎవరు ఏమన్నా విన్నర్ సంజన అని ప్రకటించాడు కళ్యాణ్. ఈవిషయంలో హౌస్ లో భిన్న స్వరాలు వినిపించాయి. కాగా కళ్యాన్ సుమన్ ను కూల్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక ఈ వాదనలో దివ్యాకు, పవన్ కళ్యాణ్ కు మధ్య కూడా చిన్న వాదులాట జరిగింది. చివరకు సంజన కమాండర్ గా తన స్థానం నిలబెట్టుకుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
చెమటలు పట్టించే టాప్ 3 కొరియన్ సస్పెన్స్ థ్రిల్లర్స్, ఏ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయంటే?
Recommended image2
46 ఏళ్ల వయసులో 23 ఏళ్ల మూవీ కెరీర్ ను కంప్లీట్ చేసుకున్న ప్రభాస్.. 500 కోట్ల కలెక్షన్ సినిమాలు ఎన్నో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved