- Home
- Entertainment
- చెమటలు పట్టించే టాప్ 3 కొరియన్ సస్పెన్స్ థ్రిల్లర్స్, ఏ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయంటే?
చెమటలు పట్టించే టాప్ 3 కొరియన్ సస్పెన్స్ థ్రిల్లర్స్, ఏ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయంటే?
Top 3 Must Watch Korean Movies on OTT : ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొరియన్ సినిమాలకుు మంచి డిమాండ్ ఉండి. ఈ మూవీస్ కు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. ఇక ఓటీటీలో తప్పక చూడాల్సిన మూడు సస్పెన్స్, థ్రిల్లర్ కొరియన్ సినిమాలు ఏవో తెలుసా?

టాప్ 3 కొరియన్ సస్పెన్స్ థ్రిల్లర్స్
థియేటర్లకు వెళ్లి సినిమా చూసే అలవాటు రోజురోజుకు తగ్గిపోతోంది. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, వూట్, జీ5 లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అందరికి బాగా అలవాటు అయ్యాయి. ఇవి ప్రతీ ఒక్కరి మొబైల్స్‌లో ఉంటున్నాయి. దీనివల్ల, ప్రజలు ఇంట్లో కూర్చునే తమకు నచ్చిన సినిమాలు చూసే వీలు కలిగింది. సినిమా అభిమానుల అభిరుచి మారడంతో, వాళ్లు వేర్వేరు భాషల సినిమాలు చూడటం మొదలుపెట్టారు.
ఇంగ్లీష్‌తో పాటు ఇతర విదేశీ భాషా చిత్రాలు డబ్ చేసి ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మీరు తప్పక చూడాల్సిన మూడు సస్పెన్స్, థ్రిల్లర్ కొరియన్ సినిమాలు ఏంటో తెలుసా?. ఈ కొరియన్ సినిమాలు డబ్బింగ్‌లో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఐ సా ది డెవిల్ (I SAW THE DEVIL)
ఈ సినిమా లో.. రాత్రిపూట నిర్మానుష్య ప్రాంతంలో ఒక యువతి కారు ఆగిపోతుంది. అప్పుడు అక్కడికి వచ్చిన ఒక గుర్తుతెలియని వ్యక్తి, ఆ అమ్మాయిపై దాడి చేసి దారుణంగా హత్య చేస్తాడు. ఇదంతా ఆ అమ్మాయి ప్రియుడు ఫోన్‌లో వింటాడు. ఆ అమ్మాయిని చంపింది ఎవరు? ప్రియుడు ఆ హంతకుడిని ఎలా కనుక్కుంటాడు అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా ఉత్కంఠభరితమైన కథనంతో, ఎన్నో మలుపులతో సాగుతుంది.
ఈ సినిమా 2010లో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాను చూడొచ్చు. కిమ్ జీ-వూన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి, పార్క్ హూన్-జంగ్, కిమ్ జీ-వూన్ స్క్రీన్‌ప్లే రాశారు. లీ బ్యుంగ్-హన్, చోయ్ మిన్-సిక్, జియోన్ గూక్-హ్వాన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ది కాల్ (THE CALL)
ఈ సినిమాలో, గతం నుంచి, భవిష్యత్తు నుంచి వచ్చే రెండు ఫోన్ కాల్స్ కనెక్ట్ అవుతాయి. ఈ రెండు కాల్స్ మాట్లాడే ఇద్దరు అమ్మాయిల జీవితాల్లో భయంకరమైన సంఘటనలు జరగడం మొదలవుతాయి. ఈ కాల్స్ వెనుక ఉన్న కథ ఏంటి? చివరికి ఆ అమ్మాయిల జీవితాల్లో ఏం జరుగుతుందో మీరు అస్సలు ఊహించలేరు. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. ఈ చిత్రానికి ఐఎండీబీ 7.1 రేటింగ్ ఇచ్చింది. సెర్గియో కాసి, చుంగ్-హ్యూన్ లీ కథకు, చుంగ్-హ్యూన్ లీ దర్శకత్వం వహించారు. పార్క్ షిన్-హే, జియోన్ జాంగ్-సియో, కిమ్ సంగ్-ర్యూంగ్ ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా నవంబర్ 2020లో విడుదలైంది.
ది వెయిలింగ్ (THE WAILING)
ఒక చిన్న గ్రామంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్యల చుట్టూనే సినిమా సాగుతుంది. సినిమాలోని ట్విస్ట్ ఏంటంటే, హంతకుడు ఆ ఊరి ప్రజల మధ్యలోనే ఉంటాడు. అదే ఊరికి చెందిన ఒక సాధారణ పోలీస్ అధికారి ఈ హత్య కేసులను ఎలా పరిష్కరిస్తాడు అనేదే సినిమా కథ. హంతకుడు వేరొకరి నియంత్రణలో ఉన్నట్లు తెలుస్తుంది. హంతకుడు ఎవరి నియంత్రణలో ఉన్నాడు అనేదే సినిమాలోని ఉత్కంఠభరితమైన మలుపు. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో చూడొచ్చు. ఐఎండీబీ ఈ చిత్రానికి 7.4 రేటింగ్ ఇచ్చింది. నా హాంగ్-జిన్ కథ రాసి దర్శకత్వం వహించారు. జున్ కునిమురా, హ్వాంగ్ జంగ్-మిన్, క్వాక్ డో-వాన్ ఈ సినిమాలో నటించారు.