మెగా చీఫ్ గా చివరి అవకాశం, షర్టులు చించేసుకుంటున్న కంటెస్టెంట్లు, ఫినాలేకు వెళ్ళేది ఎవరంటే..?
బిగ్ బాస్ హౌస్ లో చివరి మెగా చీఫ్ కంటెండర్ షిప్ కోసం పోటీ నడుస్తోంది. ఈ పోటీలో పాల్గొనేందుకు చొక్కాలు చించుకునిమరీ రెడీ అయ్యారు కంటెస్టెంట్లు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎండ్ కార్డ్ పడటానికి చాలా దగ్గరలో ఉంది. ఈసీజన్ ముగింపుకి ఇంకా మూడు వారాలే టైమ్ ఉండటంతో.. టాస్క్ లు ఇంకాస్త టఫ్ గా తయారయ్యాయి. ఈసారి ఎవరైతే మెగా చీఫ్ అవుతారో.. వారు టాప్ 5 లోకి వెల్ళినట్టే అని చెప్పాలి. దాంతో ఈసారి టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. అందులో భాగంగానే ముందుగా బిగ్ బాస్ చివరిమెగాచీఫ్ గా పోటీపడటానికి కంటెండర్స్ ను సెలక్ట్ చేయసుకోవడం కోసం ఓ టాస్క్ పెట్టారు.
Also Read:
ఐదుగురుమాత్రమే... చీఫ్ కంటెండర్స్.. హౌస్ లో ఉన్నవారి కోసం షర్ట్స్ వస్తుంటాయి. ఒక్కొక్కరి షర్ట్ విడిగా గ్యాప్ తో విసిరేస్తారు. దాన్ని చింపకుండా కాపాడుకోవాలి. అలా బసర్ మోగేంత వరకూ కాపాడుకుంటే.. వారు పోటీదారులవుతారు. ఈక్రమంలో ఎవరైనా ఇష్టంలేనివారి షర్ట్ చింపేయవచ్చు. అయితే మొదట ప్రేరణతో స్టార్ట్ అయ్యింది.
ప్రేరణ, గౌతమ్, తేజ, అవినాష్, యష్మి, పృధ్వి, నబిల్, విష్ణు ప్రియ టీషర్ట్స్ రాగా అందులో పృధ్వి, తేజ, విష్ణు ప్రియా, యష్మి టీ షర్ట్స్ మాత్రమేకాపాడుకోగలిగారు. మరీ ముఖ్యంగా పృధ్వీకి, విష్ణు ప్రియకు, తేజ కు నబిల్ సపోర్ట్ చేశాడు. యష్మికి కూడా సపోర్ట్ గానిలిచాడు. అయితేనబిల్ రేసులో లేకుండా చేయడం కోసం నిఖిల్, ప్రేరణ, రోహిణి పనికట్టుకుని టీషర్ట్ ను చించేశారు.
ఈ విషయంలో నబిల్ బాగా హార్ట్ అయ్యాడు. ఇక ఈక్రమంలో నిఖిల్, రోహిణి టీషర్ట్స్ రాలేదు. వీరిలో కంటెండెర్ ను ఏంచుకునే బాధ్యత హౌస్ లో ఉన్నవారికి ఇచ్చడు బిగ్ బాస్. ఇక ఈ గేమ్ కంటే ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు హౌస్ లో జరిగాయి. విష్ణు కు అవినాశ్ కు, విష్ణు ప్రియ, యష్మికి మధ్య గొడవ జరిగింది. కిచెన్ క్లీనింగ్ విషయంలో విష్ణును అడిగినందుకు ఆమె రకరకాల మాటలు అన్నది.
విష్ణు ప్రవర్తన ఇక్కడ ఎంత మాత్రం యాక్సెప్టబుల్ కాదు. ఇక టాస్క్ జరుగుతన్న టైమ్ లో కూడా కాస్త అతిగా ప్రవర్తించింది. పృధ్వీ టీష్ట్ వచ్చినప్పుడు బాగా డిఫైన్ చేసింది. ఈ టైమ్ లో యష్మిని నియంత్రింకేక్రమంలో ఆమె కాలుకు దెబ్బ తగులుతుంది. కాని అవేమి పట్టించుకోకుండా..నేను డిఫెన్స్ చేసిన విధానం ఎలా ఉంది అంటూ యష్మిని చిరాకు పెట్టింది. దాంతో ఆమెఫైర్ అయ్యింది.
వారికి మాటా మాటా పెరిగింది. అటు రోహిణితో కూడా విష్ణు కాస్త హాష్ గా మాట్లాడింది. దాంతో విష్ణు ప్రియను టార్గెట్ చేస్తున్నారు అవినాశ్ అండ్ టీమ్. యష్మి కూడా ఇక కాచుకుర్చున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ హౌస్ లో ఎప్పుడు వాడీ వేడి వాదనలే కాదు.. అప్పుప్పుు సంతోషాలు సరదా ఆటలు కూడా సాగుతున్నాయి. తేజానిద్రపోయినందుకు ఇచ్చిన పనిష్మెంట్ అందరిని నవ్వించింది.