- Home
- Entertainment
- BiggBossTelugu7: గ్రాండ్ లాంచ్‌కి సర్వం సిద్ధం.. ఎంట్రీతోనే కంటెస్టెంట్లకి సూట్‌కేసు మనీ ఆఫర్..ఇదేం ట్విస్ట్
BiggBossTelugu7: గ్రాండ్ లాంచ్‌కి సర్వం సిద్ధం.. ఎంట్రీతోనే కంటెస్టెంట్లకి సూట్‌కేసు మనీ ఆఫర్..ఇదేం ట్విస్ట్
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ గ్రాండ్‌గా లాంచ్‌కి సంబంధించి సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో ఈ సీజన్ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Photo credit - star maa
బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే విజయవంతంగా ఆరు సీజన్లని పూర్తి చేసుకుంది. ఒక ఓటీటీ సీజన్ కూడా పూర్తయ్యింది. ఇప్పుడు నేటి ఆదివారం(సెప్టెంబర్ 3) గ్రాండ్‌గా బిగ్ బాస్ ఏడో సీజన్‌ని ప్రారంభించబోతున్నారు. ఈ సాయంత్రం ఏడు గంటల నుంచి ఈ ప్రారంభ కార్యక్రమం జరుగనుంది. నాగార్జున హోస్ట్ గా ఈ సీజన్ ప్రారంభం కానుంది.
Photo credit - star maa
ఈ మేరకు హౌజ్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి ఏర్పడింది. గతంలో మాదిరిగానే ఉంటుందని అంతా భావించినా, ఈ సారి కొత్తగా ఉండబోతుందట. హౌజ్‌లో కొత్త రూమ్‌లు, కొత్త విభాగాలు కూడా ఉండబోతున్నాయట. ప్రత్యేకంగా కెప్టెన్ రూమ్ ఉంటుందని సమాచారం. ఈ మేరకు హౌజ్ ఫోటోలను వదిలారు. అవన్నీ కాస్త కొత్తగా ఉందనిపిస్తుంది. అయితే ఈసారి పింక్ కలర్‌కి ప్రయారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది.
Photo credit - star maa
అంతేకాదు ఈ సారి ఉల్టాఫల్టా అంటూ నాగార్జున ప్రారంభం నుంచి చెబుతున్నారు. ఈ సారి లెక్క వేరే అంటున్నారు. అందరు ఊహించినట్టుగా ఉండబోదని, మా ఆట వేరే అంటున్నారు. దీంతో ఈ సీజన్‌పై ఆసక్తి ఏర్పడింది. ఎలా ఉండబోతుందనే ఇంట్రెస్ట్ అందరిలోనూ ఏర్పడింది. నేడు సాయంత్రం షో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అంతా ఉత్కంఠభరితంగా చూస్తున్నారు.
Photo credit - star maa
అయితే గత రెండు సీజన్లు డల్‌గా సాగాయి. పెద్దగా రేటింగ్ లేదు. కంటెస్టెంట్లు కూడా సేఫ్ జోన్‌లో ఉంటూ ఆట ఆడలేదు. దీంతో బిగ్ బాస్‌పై కిక్ పోయింది. ఈ నేపథ్యంలో ఈ సారి సరికొత్తగా ఉండేలా ప్లాన్ చేశారట బిగ్ బాస్ నిర్వాహకులు. ఊహించని విధంగా ప్లాన్ చేసినట్టు సమాచారం.
Photo credit - star maa
నాగార్జున చెప్పినట్టుగానే ఓపెనింగ్ రోజే కంటెస్టెంట్లకి ఝలక్ ఇచ్చాడు. జనరల్‌గా చివరి రోజు గ్రాండ్ ఫినాలేలో ముగ్గురు ఉన్నప్పుడు ప్రైజ్ మనీ ఆఫర్ చేస్తారు. కానీ ఈ సారి ఓపెనింగ్ రోజే ప్రైజ్ మనీ ఆఫర్ చేయడం విశేషం. దీంతో ఆ సూట్ కేసు తీసుకుని ఎవరైనా ఇప్పుడే వెళ్లిపోవచ్చు అని నాగార్జున చెప్పడం షాకిస్తుంది.
Photo credit - star maa
లేటెస్ట్ గా విడుదల చేసిన ప్రోమోలో ఇది హైలైట్‌గా నిలిచింది. అయితే ఈ సూట్ కేసు కోసం కంటెస్టెంట్లు కొట్టుకోవడం విశేషం. మరి అందులో ఉండే ట్విస్ట్ ఏంటనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.
Photo credit - star maa
ఇక ఓపెనింగ్ రోజు.. ఇద్దరు స్టార్స్ సందడి చేయబోతున్నారు. `ఖుషి` సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఈ షోకి గెస్ట్ గా వచ్చారు. ఇందులో ఆయన సినిమాలోని పాటకి డాన్సు చేయడం విశేషం. అయితే మీ హీరోయిన్ సమంత ఏది అని నాగ్ అడగడం హైలైట్‌గా నిలిచింది.
Photo credit - star maa
మరోవైపు `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` చిత్ర హీరో, `జాతిరత్నాలు` ఫేమ్ నవీన్ పొలిశెట్టి కూడా ఈ షోకి వచ్చారు. గెస్ట్ గా కాసేపు సందడి చేసి నవ్వులు పూయించారు. విజయ్, నవీన్‌ల గెస్ట్ అప్పీయరెన్స్ హైలైట్‌గా నిలుస్తుంది.
Photo credit - star maa
ఇక ఈ సారి కంటెస్టెంట్లు ఎవరెవరనేది సస్పెన్స్ ఏర్పడింది. ఇందులో నటుడు శివాజీ రాబోతున్నారట. ఆయనతోపాటు శోభా శెట్టి,విష్ణు ప్రియా, ఆట సందీప్, అమర్ దీప్ చౌదరి, గౌతమ్ కృష్ణ, భోలే షావలి, టీవీ9 ప్రత్యూష, షకీలా, టేస్టీ తేజా, మహేష్ ఆచంట, అంబటి అర్జున్, అపూర్వ, సింగర్ దామిన భాట్ల పాల్గొనబోతున్నారట.
Photo credit - star maa
వీరితోపాటు ఫర్జానా, పల్లవి ప్రశాంత్, పూజా మూర్తి, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, శుభవ్రీ రాయగురు ఇలా 20 మంది ఈ ఏడో సీజన్లో కంటెస్టెంట్లుగా ఉండబోతున్నారట. నిజం ఏంటనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. బిగ్ బాస్ షో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో 24జ 7 ప్రసారం కానుంది. స్టార్ మాలో ప్రతి రోజు రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారం కానుంది.