11వ వారం నామినేషన్స్ లిస్ట్ లీక్... 8 మంది టాప్ కంటెస్టెంట్స్ లో ఇంటికి వెళ్ళేది ఎవరు?
బిగ్ బాస్ 7లో నేడు నామిషన్స్ డే. 11వ వారానికి గానూ నామినేషన్స్ ప్రక్రియ ముగిసిందని సమాచారం. ఇక లిస్ట్ ఉన్నది ఎవరో చూద్దాం...
10 వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో 11వ వారంలో అడుగుపెట్టింది. గత వారం శివాజీ, రతిక, గౌతమ్, యావర్, భోలే నామినేట్ అయ్యారు. యావర్, భోలే డేంజర్ జోన్లోకి వచ్చారు. వీరిద్దరిలో తక్కువ ఓట్లు తెచ్చుకున్న భోలే ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.
భోలే ఎలిమినేషన్ తర్వాత హౌస్లో అమర్ దీప్, గౌతమ్, యావర్, శివాజీ, ప్రియాంక, శోభ, అశ్విని, రతిక, అర్జున్, ప్రశాంత్ మొత్తం 10 మంది ఉన్నారు. శివాజీ ఇంటి కెప్టెన్ గా ఉన్నారు. వీరిలో ఒకరు వచ్చే వారం ఇంటిని వీడనున్నారు. కాగా ఈ వారానికి నామినేషన్స్ ప్రక్రియ ముగిసిందట.
శివాజీ కెప్టెన్ కాగా అతడిని ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. ప్రతి హౌస్ మేట్ కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడట. వాడివేడిగా నామినేషన్స్ ప్రక్రియ సాగినట్లు సమాచారం. హౌస్ మేట్స్ మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయట. నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన క్రమంలో 8 మంది లిస్ట్ లో ఉన్నారట.
అనంతరం కెప్టెన్ ని ఎంపిక చేసే ప్రక్రియ మొదలయింది. అర్జున్, శివాజీ కెప్టెన్సీ కంటెండర్స్ గా పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరిలో కెప్టెన్ ఎవరో తేల్చేందుకు నాగార్జున చిన్న గేమ్ పెట్టారు. కన్ఫెషన్ రూంలో శివాజీ, అర్జున్ పేరుతో రెండు కిరీటాలు ఉంచారు.
Bigg Boss Telugu 7
ఇప్పటి వరకు ఉన్నవాళ్లలో శివాజీ, పల్లవి ప్రశాంత్ టైటిల్ ఫేవరేట్స్ గా ఉన్నారు. వీరిద్దరిలో ఒకరు టైటిల్ కొట్టడం ఖాయం అంటున్నారు. వీరికి పోటీ ఇచ్చే సత్తా ఎవరికీ లేదు. అర్జున్ ఇరగదీస్తాడు అనుకుంటే ఏమంత ప్రభావం చూపడం లేదు. అమర్ వెర్రిపప్ప ముద్రతో ఇమేజ్ పోగొట్టుకున్నాడు. కాబట్టి టైటిల్ శివాజీ లేదా ప్రశాంత్ తీసుకెళతారనే వాదన గట్టిగా వినిపిస్తోంది.
Also Read బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ కి బంపర్ ఆఫర్, రాంచరణ్ మూవీలో ఛాన్స్.. వేదికపైనే ప్రకటించిన బుచ్చిబాబు