- Home
- Entertainment
- హాట్ హాట్ గా నామినేషన్స్ డే... వారిద్దరిని టార్గెట్ చేసిన మెజారిటీ కంటెస్టెంట్స్, నామినేషన్స్ లో 9మంది!
హాట్ హాట్ గా నామినేషన్స్ డే... వారిద్దరిని టార్గెట్ చేసిన మెజారిటీ కంటెస్టెంట్స్, నామినేషన్స్ లో 9మంది!
నామినేషన్ డే హౌస్ బిగ్ బాస్ షో హాట్ హాట్ గా సాగింది. కంటెస్టెంట్స్ మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఈ వారానికి మొత్తం తొమ్మిది మంది నామినేట్ అయ్యారు.

Bigg Boss Telugu 6
సోమవారం వస్తుందంటే కంటెస్టెంట్స్ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. నామినేషన్ డే కావడంతో ఏమవుతుందో అన్న భయం వెంటాడుతుంది. నామినేషన్ చేయడం కోసం ఇతర కంటెస్టెంట్స్ తో వాదించాలనే భయం ఒకవైపు... మనం నామినేట్ అవుతామేమో అనే భయం మరోవైపు. నామినేటైతే వచ్చే వారం హౌస్లో ఉంటామనే గ్యారంటీ ఉండదు.
Bigg Boss Telugu 6
సాయంత్రం వేళ బిగ్ బాస్ నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ చేశారు. ప్రతి సభ్యుడు ఇద్దరు సభ్యుల ముఖానికి ఫోమ్(నురగ) పూసి కారణం చెప్పి నామినేట్ చేయాలి అన్నారు. మొదటగా కెప్టెన్ రేవంత్ కారణాలు చెప్పి సుదీప, బాల ఆదిత్యను నామినేట్ చేశాడు.
Bigg Boss Telugu 6
ఇక వరుసగా కీర్తి కంటెస్టెంట్స్ గీతూ, శ్రీసత్యలను నామినేట్ చేసింది. ఆదిరెడ్డి కంటెస్టెంట్స్ మెరీనా, కీర్తిలను నామినేట్ చేశాడు. రోహిత్ కంటెస్టెంట్స్ శ్రీహాన్, ఆదిరెడ్డిలను చేయడం జరిగింది. నటి సుదీప కంటెస్టెంట్స్ ఆదిరెడ్డి, కీర్తిలను నామినేట్ చేశారు.
Bigg Boss Telugu 6
అలాగే శ్రీహన్- గీతూ , రాజ్,... వాసంతి- గీతూ, ఆదిరెడ్డి... బాల ఆదిత్య- గీతూ, రాజశేఖర్... సూర్య- గీతూ, ఆదిరెడ్డి... ఫైమా-సుదీప, బాల ఆదిత్య... ఇనయా- శ్రీహాన్, కీర్తి... రాజశేఖర్- గీతూ, బాల ఆదిత్య... మెరీనా- కీర్తి, ఆదిరెడ్డి.... గీతూ- రాజశేఖర్, కీర్తి... అర్జున్ - కీర్తి, ఆదిరెడ్డి... శ్రీసత్య- గీతూ, ఆదిరెడ్డిలను నామినేట్ చేయడం జరిగింది.
Bigg Boss Telugu 6
మెజారిటీ కంటెస్టెంట్స్ గీతూ, ఆదిరెడ్డిలను టార్గెట్ చేయడం విశేషం. బహుశా వాళ్ళను స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా బావిస్తున్నారేమో. అలాగే కీర్తి కూడా ఎక్కువ మంది సభ్యులతో నామినేట్ అయ్యారు. ఈసారి నామినేషన్స్ లో రేవంత్ లేడు. సూర్య, వాసంతిని ఎవరూ టచ్ చేయలేదు.
Bigg Boss Telugu 6
ఇక ఈవారానికి మెజారిటీ ఓట్లు పొందిన బాల ఆదిత్య, గీతూ, ఆదిరెడ్డి, సుదీప, శ్రీహాన్, కీర్తి, రాజశేఖర్, శ్రీసత్య, మెరీనా నామినేట్ అయ్యారు. ఈ తొమ్మిది మంది సభ్యులలో ఒకరు వచ్చే వారం హౌస్ నుండి ఎలిమినేట్ కానున్నారు.
Bigg Boss Telugu 6
21 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ షో ఐదు వారాలు పూర్తి చేసుకొని ఆరవ వారంలోకి అడుగుపెట్టింది. ఆదివారం చలాకీ చంటి ఎలిమినేటై వెళ్ళిపోయాడు. అంతకు ముందు వారాల్లో షాని, అభినయశ్రీ, నేహా చౌదరి, ఆరోహిరావు ఎలిమినేటైన విషయం తెలిసిందే.
Bigg Boss Telugu 6
ప్రస్తుతానికి హౌస్ లో 16 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. హౌస్ కెప్టెన్ గా రేవంత్ ఉన్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీ అంటూ కొన్ని క్రేజీ నేమ్స్ వినిపిస్తున్నాయి. సాధారణంగా ప్రతి సీజన్ 19 మంది కంటెస్టెంట్స్ తో స్టార్ట్ అవుతుంది. సీజన్ 6 మొత్తం 21 మందితో మొదలైంది. ఈ క్రమంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందా అనే సందేహాలు కలుగుతున్నాయి.