- Home
- Entertainment
- Bigg Boss Telugu 6: గీతూ, అర్జున్ వైల్డ్ కార్డు ఎంట్రీ? ఇక హౌస్లో జరిగే పరిణామాలు ఇవే!
Bigg Boss Telugu 6: గీతూ, అర్జున్ వైల్డ్ కార్డు ఎంట్రీ? ఇక హౌస్లో జరిగే పరిణామాలు ఇవే!
లేటెస్ట్ సీజన్లో ఎలిమినేటైన అర్జున్ కళ్యాణ్, గీతూ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వడం పక్కా అంటున్నారు. వీరిద్దరినే పంపడం వెనుక స్పెషల్ రీజన్స్ కూడా ఉన్నాయి. శ్రీసత్య అంటే అర్జున్ కి ఎక్కడలేని ప్రేమ. అసలు అర్జున్ ఎలిమినేషన్ కి ప్రధాన కారణం శ్రీసత్య. ఆమె వెనుక తిరిగి తన గేమ్ వదిలేశారు.

Bigg Boss Telugu 6
కాగా ఈ సీజన్లో ఓ సంచలనం నమోదు కాబోతుందట. ఎలిమినేటైన ఇద్దరు కంటెస్టెంట్స్ తిరిగి హౌస్లో కాలుపెట్టబోతున్నారట. అది ఎవరో కాదు గీతూ, అర్జున్ కళ్యాణ్ అట. వీరిద్దరి రీఎంట్రీకి సర్వం సిద్దమైందట.
Bigg Boss Telugu 6
ప్రతి సీజన్లో వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయి. ఆ వైల్డ్ కార్డ్స్ ద్వారా కొత్తవాళ్ళనే కాకుండా ఎలిమినేటైన వాళ్ళను కూడా హౌస్లోకి పంప వచ్చు. గతంలో అలీ రేజా ఇలానే రీఎంట్రీ ఇచ్చారు. సీజన్ 3లో పాల్గొన్న అలీ రెజా ఒకసారి ఎలిమినేటై వైల్డ్ కార్డు తో రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.
Bigg Boss Telugu 6
లేటెస్ట్ సీజన్లో ఎలిమినేటైన అర్జున్ కళ్యాణ్, గీతూ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వడం పక్కా అంటున్నారు. వీరిద్దరినే పంపడం వెనుక స్పెషల్ రీజన్స్ కూడా ఉన్నాయి. శ్రీసత్య అంటే అర్జున్ కి ఎక్కడలేని ప్రేమ. అసలు అర్జున్ ఎలిమినేషన్ కి ప్రధాన కారణం శ్రీసత్య. ఆమె వెనుక తిరిగి తన గేమ్ వదిలేశారు.
Bigg Boss Telugu 6
నేను లవ్ బ్రేకప్ అని చెప్పుకున్న శ్రీసత్య అర్జున్ ఎంత ట్రై చేసినా ఛాన్స్ ఇవ్వలేదు. అయితే అర్జున్ ఎలిమినేషన్ తర్వాత శ్రీహాన్ కి దగ్గరైంది. ఇప్పుడు అర్జున్ ఎంట్రీ ఇస్తే ఈ ట్రై యాంగిల్ లవ్ ట్రాక్ ఇంట్రెస్ట్ గా మారుతుంది. శ్రీసత్య ఎవరివైపు మొగ్గుతుంది? అలాగే అర్జున్ వచ్చాక ఎవరితో ఎక్కువగా స్నేహం చేస్తుంది? అనేది ఇంట్రెస్ట్ గా మారుతుంది.
Bigg Boss Telugu 6
ఇక గీతూ విషయానికి వస్తే... ఆమె తప్పుగా ఆడానని రిగ్రీట్ అవుతుంది. హౌస్లో ఫైర్ బ్రాండ్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న గీతూ ఎలిమినేట్ అయ్యాక తన లోపాలు ఏమిటో తెలుసుకుంది. ఇతరుల ఎమోషన్స్ తో ఆడుకుంటూ, రెచ్చగొడుతూ సాగిన ఆమె గేమ్ రీఎంట్రీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది? గతంలో మాదిరి ముక్కుసూటితనంగా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుందా? రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుందా? లేదా? ఇలా అనేక ఆసక్తికర అంశాలున్నాయి.
Bigg Boss Telugu 6
ప్రచారం జరుగుతున్నట్లు అర్జున్, గీతూ రీ ఎంట్రీ ఇస్తే బిగ్ బాస్ గేమ్ చాలా ఆసక్తికరంగా మారిపోతుంది. ఇక ఈ వారం తొమ్మిది మంది ఎలిమినేషన్స్ లో ఉన్నారు. బాల ఆదిత్య ఎలిమినేట్ కానున్నాడంటూ ప్రచారం జరుగుతుంది.