MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అప్పుల బాధ తాళలేక అమ్మ ఆత్మహత్య ఆ ప్లేస్ చూస్తే ఇప్పటికీ బాధేస్తుంది... ఆదిరెడ్డి కన్నీటి గాధ!

అప్పుల బాధ తాళలేక అమ్మ ఆత్మహత్య ఆ ప్లేస్ చూస్తే ఇప్పటికీ బాధేస్తుంది... ఆదిరెడ్డి కన్నీటి గాధ!

బిగ్ బాస్ హౌస్ ఎమోషనల్ గా మారిపోయింది. కంటెస్టెంట్స్ తమ జీవితంలో జరిగిన విషాద సంఘటనలు గుర్తు చేసుకున్నారు. ఆదిరెడ్డి తన తల్లి ఆత్మహత్య చేసుకుందని చెప్పి అందరి చేత కన్నీరు పెట్టించారు.  

2 Min read
Sambi Reddy
Published : Sep 15 2022, 02:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. ఐతే అవి శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు అన్నీ తొలగిపోతాయి. అప్పటి వరకు సహనంగా వేచి చూడాలని ఆది రెడ్డి తెలియజేశాడు. దానికి తన తల్లి ఉదంతాన్ని ఉదాహరణ చెప్పాడు. అప్పుల బాధ తాళలేక తన తల్లి ఉరి వేసుకొని మరణించినట్లు చెప్పి అందరినీ విషాదంలో ముంచేశాడు. 
 

26
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


మా అమ్మ చాలా హైట్ గా ఉంటారు. నా హైట్ కి కారణం మా అమ్మగారే. ఆమె చాలా తక్కువ హైట్ ఉన్న బాత్ రూమ్ లో ఉరేసుకొని చనిపోయారు. ఆ బాత్ రూమ్ చూసిన ప్రతిసారి ఇంత తక్కువ హైట్ లో ఎంత స్ట్రగులై మా అమ్మ చనిపోయిందన్న బాధ కలుగుతుంది. ఇక బాధల తీరవు ఈ జీవితం ఇంతే అనే బాధతో మా అమ్మ ఆత్మహత్య చేసుకుంది. 
 

36
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

ఆమె 2013లో సూసైడ్ చేసుకున్నారు. సరిగ్గా ఐదేళ్లకు 2018లో నేను సక్సెస్ అయ్యాను. ఆరోజు అమ్మ ఆత్మ హత్య చేసుకోకపోతే ఇప్పుడు సుఖంగా ఉండేవారు. ఆమె కష్టాలన్నీ తీరిపోయేవి. అప్పట్లో అమ్మకు కనీసం ఒక బంగారు గొలుసు కూడా ఉండేది కాదు. బంధువుల నగలు పెట్టుకొని ఫంక్షన్స్ కి వెళ్ళేది. ఇప్పుడు నేను ఆమెకు కావలసినంత బంగారం కొనివ్వగలను. 
 

46
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

ఇదంతా నేను సింపతీ కోసం చెప్పడం లేదు. ప్రతి ఒక్కరికీ చాలా కష్టాలు ఉంటాయి. అవన్నీ ఏదో ఒకరోజు తీరిపోతాయి. తొందరపడి ప్రాణాలు తీసుకోవద్దు. ఆత్మహత్యలు చేసుకోవద్దు. కష్టాలు శాశ్వతం కావని చెబుతున్నాను. ఒకప్పడు కనీస సంపాదన లేని నేను 2022లో బిగ్ బాస్ షోకి వచ్చి ఇక్కడ నిలబడ్డాను. కాబట్టి బాధలు, కష్టాలకు భయపడి సూసైడ్ చేసుకోవద్దు.. అని ఆది రెడ్డి చెప్పుకొచ్చారు. 
 

56
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

ఆది రెడ్డి తన తల్లి గురించి చెబుతుంటే కంటెస్టెంట్స్ అందరూ ఎమోషనల్ అయ్యారు. అందరూ కన్నీరు పెట్టుకున్నారు. ఎప్పుడూ సరదాలు, కోపాలు, నవ్వులతో సాగే హౌస్ లో ఎమోషనల్ సీన్ చోటు చేసుకుంది. 
 

66
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


ఇక ఈ వారం నామినేషన్స్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. షాని, గీతూ రాయల్, ఆదిరెడ్డి, రోహిత్-మెరీనా, అభినయశ్రీ, రేవంత్, ఫైమా, రాజ్ నామినేషన్స్ లో ఉన్నారు. వీరి నుండి ఒకరు వచ్చేవారం హౌస్ ని వీడనున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved