ఇదో చెత్త సీజన్, ఓటింగ్ కి వ్యతిరేకంగా రాజ్ ఎలిమినేషన్... ఆ 5గురికి పంచెస్ ఇచ్చిపోయిన మిస్టర్ కూల్!
గత ఐదు సీజన్స్ లో ఎన్నడూ చూడని నెగిటివిటీ ఈ సీజన్ మూటగట్టుకుంటుంది. నేడు రాజ్ ఎలిమినేషన్ తో మరింత వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఆడియన్స్ ఓటింగ్ కి వ్యతిరేకంగా రాజ్ ని బయటకు పంపడం దారుణమన్న మాట వినిపిస్తోంది.
Bigg Boss Telugu 6
నాగార్జున హోస్టింగ్, బిగ్ బాస్ గేమ్స్, కంటెస్టెంట్స్ పెర్ఫార్మన్స్... ముఖ్యంగా ఎలిమినేషన్స్ మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 6 విమర్శలపాలవుతుంది. గతంలో ఎన్నడూ చూడనంత నెగిటివిటీ బిగ్ బాస్ తెలుగు 6 ఫేస్ చేస్తుంది. దీనికి కారణం పూర్తిగా నిర్వహణా వైఫల్యమే. నేడు కంటెస్టెంట్ రాజ్ ఎలిమినేషన్ లాజిక్ లేకుండా జరిగింది. ఈ వారానికి ఏడుగురు నామినేట్ అయ్యారు. ఇనయా, శ్రీహాన్, శ్రీసత్య, ఆదిరెడ్డి, రోహిత్, ఫైమా, రాజ్ నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో శ్రీసత్య, శ్రీహాన్,ఇనయా, నిన్న సేవ్ అయ్యారు.
ఆదిరెడ్డి, రోహిత్, ఫైమా, రాజ్ నామినేషన్స్ లో మిగిలారు. వీరిలో ఫస్ట్ రోహిత్ సేవ్ అయ్యాడు. ఎవిక్షన్ పాస్ గెలుచుకున్న ఫైమా ధైర్యంగా ఉంది. ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అవుతారన్న నాగార్జున, ఎవిక్షన్ పాస్ ఎవరికైనా వాడతావా? లేక నీ కోసం వాడుకుంటావా? అని అడిగాడు. ఫైనల్ గా ఇద్దరు ఉన్నప్పుడు చెబుతానని ఫైమా తెలివైన సమాధానం చెప్పింది. నాగార్జున ఓకే అన్నారు. తర్వాత ఆదిరెడ్డి సేవ్ అయ్యాడు. ఇక మిగిలింది ఫైమా, రాజ్.
Bigg Boss Telugu 6
ఫైమా దగ్గర ఉన్న ఎవిక్షన్ పాస్ ఎవరు వాడుకోవాలని నాగార్జున ఇంటి సభ్యులను అడిగారు. ఏడుగురు సభ్యులు ఫైమా వాడుకోవాలన్న నిర్ణయం వెళ్లబుచ్చారు. డేంజర్ జోన్లో ఉన్న రాజ్ సైతం ఫైమా వాడుకోవడమే కరెక్ట్ అన్నాడు. అది ఆమె కష్టపడి గెలుచుకుంది, ఆ పాస్ తో నేను సేవ్ అయినా మంచిగా ఫీల్ కాను అన్నాడు. ఫైనల్ గా ఫైమాను ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నారు నాగార్జున. ఫైమా తనకోసమే వాడుకుంటానని చెప్పింది.
రాజ్ కంటే తక్కువ ఓట్లు ఫైమాకు వచ్చినట్లు నాగార్జున ఫైనల్ గా రివీల్ చేశాడు. పాస్ ఉపయోగించుకున్న ఫైమా సేవ్ అయ్యింది. రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక్కడే లాజిక్ మిస్ అయ్యారు. ఫైమా కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన రాజ్, ఎవిక్షన్ పాస్ ఉన్న ఫైమా ఇద్దరూ సేవ్ కావాలి. గత సీజన్స్ లో ఎవిక్షన్ పాస్ కి వాడిన లాజిక్ ఇది. ఎవరు ఎలిమినేట్ అవుతారో ముందుగా బిగ్ బాస్ చెప్పడు. పాస్ ఉన్నవాళ్లు తమ కోసం లేదా డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్ కోసం వాడుకోవచ్చు.
నేటి సంఘటన ప్రకారం రాజ్ కి ఫైమా కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి సేవ్ అవ్వాలి. ఫైమా కంటే తక్కువ ఓట్లు వస్తేనే రాజ్ ఎలిమినేట్ కావాలి. ఎందుకంటే నామినేషన్స్ లో ఉన్నవారిలో అతి తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడు. దీంతో పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. జనాల ఓట్లను, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా రాజ్ ఎలిమినేషన్ జరిగిందని నెటిజెన్స్ అభిప్రాయ పడుతున్నారు.ఇక ఎలిమినేటైన రాజ్ ని నాగార్జున నలుగురికి హగ్స్, మరో ఐదుగురికి పంచెస్ ఇమ్మని చెప్పాడు. తన ప్రియమైన కంటెస్టెంట్స్ గా ఫైమా, రోహిత్, ఆదిరెడ్డి, రేవంత్ లకు హగ్ ఇచ్చాడు. మిగిలిన ఐదుగురికి పంచెస్ ఇచ్చాడు. రేవంత్ ని రాజ్ కొంచెం ఎక్కువగా పొగిడేశాడు. టైటిల్ విన్నర్ అంటూ తేల్చేశాడు. దానికి మించి రేవంత్ ఓవర్ యాక్షన్ ఉంది. నీ గేమ్ కూడా నేను ఆడతా అంటూ విసుగు పుట్టించాడు.
టాలీవుడ్ సీనియర్ నటుడు వడ్డే నవీన్, జబర్దస్త్ కమెడియన్స్ ఆది, అమరదీప్, చిత్ర రాయ్, దీప్తి పిల్లి, నవ్యావ్మి, యాంకర్ వర్షిణి, యాంకర్ ధనుష్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు టాక్ వినిపిస్తోంది. గత కంటెస్టెంట్ల నుంచి శివ, అనిల్, మిత్రా, అరియానా గ్లోరీ కూడా రానున్నట్టు తెలుస్తోంది. అలాగే సాధారణమైన వ్యక్తులకు ఈ పాపులర్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఇవ్వనున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ కు హోస్ట్ గా అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆరో సీజన్ కు మాత్రం నాగార్జునకు బదులుగా స్టార్ హీరోయిన్ సమంత అయినా.. లేదంటే యాంకర్, నటి ఉదయభాణు హోస్ట్ గా రానున్నారని సమాచారం.